ఏజెన్సీలో జగన్ పర్యటన ఖరారు
జూలై 1న చాపరాయిలో పర్యటన
జిల్లా అధ్యక్షుడు
కురసాల కన్నబాబు వెల్లడి
కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏజెన్సీ పర్యటన ఖరారైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ రాత్రికి జిల్లాకు చేరుకుంటారని, జూలై 1వ తేదీన విష జ్వరాలతో అల్లాడుతున్న చాపరాయి, ఇతర గ్రామాలను సందర్శించి మృతుల కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని తెలిపారు. అక్కడి పరిస్థితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నెలకున్న సమస్యల్ని బాధిత కుటుంబాలు, స్థానికులతో జగన్ మాట్లాడి తెలుసుకుంటారన్నారని జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు తెలిపారు.
చాపరాయి ఘటనపై జగన్ ఆరా...
వై.రామవరం మండలం చాపరాయి ఘటనపై జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో మాట్లాడారు. మృతుల కుటుంబాలు, బాధితులకు న్యాయం జరిగేలా పార్టీ అండగా నిలవాలని జగన్ ఆదేశించారు.