
సాక్షి, నరసాపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 176వరోజు పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు శివారు (నైట్ క్యాంప్) నుంచి వైఎస్ జగన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదగా పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు.
విరామం అనంతరం చిన మామిడిపల్లి, నరసాపురం, స్టీమర్ రోడ్డు వరకూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలనుకునేవారు నైట్‌క్యాంపునకు వెళ్లి వైఎస్ జగన్‌ను కలుసుకుని తమ సమస్యలపై లేఖను అందజేయవచ్చు. పాదయాత్రలో భాగంగా మంగళవారం వరకు వైఎస్ జగన్ 2,192.5 కిలో మీటర్లు నడిచిన విషయం తెలిసిందే.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)