
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు. సోమవారం ఉదయం కాళహస్తి శివారులోని పానగల్ నుంచి 68వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ మొదలుపెట్టనున్నారు.
తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్ క్రాస్, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ మీదుగా రెడ్డిగుంటబడవ వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు వైఎస్ జగన్ 909.1 కిలోమీటర్లు నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment