నర్సీపట్నం దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులు
ఆయనో.. నవశకం.. చీకటి తెరల్లో చిక్కుకున్న రాష్ట్రానికి నవరత్నాల వెలుగులు నింపేందుకు ఆ యువనేత వేసిన తొలి అడుగు.. ప్రభంజనమైంది. జన హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.ఏ విజయ పయనమైనా.. ఒక్క అడుగుతోనే ప్రారంభమన్నట్లు..అరాచక పాలన వలయంలో విలవిల్లాడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ ప్రారంభమైన యాత్ర..వందలు.. వేల కిలోమీటర్లు దాటింది..దాటుతూ ఉంది.
మహానేతను స్మరించుకుంటూ 2017 నవంబర్ 6న మొదలైన సంకల్పానికి ఏడాది పూర్తయింది.ఈ సందర్భంగా అన్న.. చెల్లి.. అక్క.. తమ్ముడు..అమ్మ.. నాన్న.. అవ్వ.. తాత.. నాయకుడు, కార్యకర్త, అభిమాని..అనే తారతమ్యం లేకుండా.. జననేతకు జేజేలు పలికారు.కత్తులు దూసిన అధికార పక్షాన్ని దుమ్మెత్తి పోస్తూ..మనసెరిగిన మన నేత చల్లంగా ఉండాలంటూ పూజలు నిర్వహించారు.
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంగళవారంతో ఏడాది పూర్తి చేసుకుంది. 365 రోజుల పాటు అశేష జనవాహిని అభిమానం నడుమ నిరాటంకంగా సాగడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చే సుకున్నాయి. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జననేత జగనన్నపై జరిగిన హత్యాయత్నం ఘట నను గుర్తు చేసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలనీ పూజలు చేస్తూ.., దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేవుళ్లను వేడుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర ఏడాది పూర్తయిన సంబరాలు ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించారు.
పాయకరావుపేటలో.
ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా నక్కపల్లి మండలం ఉద్దండపురంలో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జగన్ గోత్రనామాలతో స్వామివారికి తమలపాకుల పూజ, అభిషేకం నిర్వహించారు. పాయకరావుపేటలో సమన్వయకర్త, జడ్‌పీటీసీ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎస్.రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లి రామాలయం వద్ద పార్టీ నేతలు 365 కొబ్బరికాయలు కొట్టారు.
నర్సీపట్నంలో..
జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం శ్రీదుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు.
యలమంచిలిలో..
మహానేత రాజన్న ఆశయాలు అమలు కావాలంటే రానున్న రోజుల్లో జగన్‌మోహనరెడ్డి సీఎం కావడం ఒక్కటే మార్గమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కన్నబాబురాజు అన్నారు. మునగపాక మండలంలోని రామగిరి, మడకపాలెం, చెర్లోపాలెం గ్రామాల్లో ఏడాది సంబరాలతో పాటు రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అరకులో...
సంకల్పయాత్ర చారిత్రాత్మకమని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి పాల్గుణ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజ యవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా ని యోజకవర్గ కేంద్రమైన అరకులోయలో విజయోత్సవ ర్యాలీని చెట్టి పాల్గుణ ఘనంగా నిర్వహిం చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని కిలోమీటరు పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలాభిషేకం చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించా రు. గన్నెల పంచాయతీ కేంద్రంలో గిరిజనులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గిరిజనులంతా జైజగన్ నినాదాలతో హోరెత్తించారు.
పాడేరులో...
ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగొళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జి.మాడుగులలోని జీపులస్టాండ్ మూడురోడ్లు జంక్షన్ వద్ద పార్టీ జెండా పండుగ నిర్వహించారు. అదే విధంగా బందవీధిలో వెన్నెలమ్మ తల్లి ఆలయంలో మత్సరాజు విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment