YS Jagan Journey
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
జగన్ దూకుడుకు చేతులెత్తేసిన చంద్రబాబు
-
2021 వైఎస్ఆర్ సీపీ విజయ ప్రస్థానం పై స్పెషల్ ఫోకస్
-
మనం ప్రజాసేవకులం
-
సంక్షేమ సారథి.. జననేత జగనన్న
పట్టుదలకు మరోరూపం ఆయన. నిజాయితీకి, నిబద్దతకు నిలువుటద్దం ఆయన. అన్నా.. కష్టాల్లో ఉన్నామంటే చాలు అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. చిరునవ్వే ఆయన ఆభరణం. ప్రజలే ఆయన ఆస్తి. తండ్రి ఆశయ సాధన కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి, ఎంతటి వారినైనా ఎదిరించే ధీరత్వం ఆయన సొంతం. మాట తప్పని మడమ తిప్పని ముక్కుసూటితనం. పేదవారికోసం నాన్న ఒక అడుగు వేస్తే తాను రెండడుగులేస్తాను అని చెప్పి దాన్ని ఆచరించి చూపిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజల గుండెల్లో జననేతగా ముద్రవేసుకుని.. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న... సంక్షేమ సారథి సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా సాక్షి డాట్ కమ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
నయ వంచకుడు చంద్రబాబు
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: అబద్ధపు హమీలిచ్చి ప్రజలను మోసగించిన నయవంచకుడు చంద్రబాబునాయుడని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభించిన ఎన్నికల శంఖారావ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. పాదయాత్రకు రెండు వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించాడన్నారు. ప్రత్యేకహోదా లేని కారణంగా నేడు ప్రజలు ఉద్యోగాల కోసం అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పొదుపు మహిళలు, రైతులు, విద్యార్థులపై కపటప్రేమ చూపుడుతున్నాడన్నారు. గత ఎన్నికలో మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేడు ఎన్నికల సమయంలో మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని, దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేవని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేవలం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ సారి ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు త్వరలోనే రానున్నాయన్నారు. జగన్మోహన్రెడ్డితోనే మత్స్యకారుల అభివృద్ధి మత్స్యకారుల అభివృద్ధి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మత్స్యకారులకు పెద్దపీట వేస్తామన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండిచ్చేరి, కడలూరు తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు వచ్చి మన మత్స్య సంపదను దోచుకెళుతున్నారన్నారు. జిల్లాలోని దద్దమ్మ మంత్రులు చూసీచూడనట్లుగా ఉంటున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్రెడ్డితో మాట్లాడి, ప్రభుత్వ జీఓలను సవరించి మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారునికి రూ.10 వేల పరిహారం ఇస్తామని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అలాగే వేట సమయంలో ఎవరైనా మత్స్యకారులు మృతి చెందితే వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. తీరంలో టీడీపీ ఖాళీ పాదయాత్ర సందర్భంగా రామచంద్రాపురం పంచాయతీలోని పాతూరు, కోత్తూరు, లక్ష్మీపురం, వెంకటనారాయణపురం, పొన్నపూడి, రామచందారపురం గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తీరంలో టీడీపి ఖాళీ అయిందన్నారు. టీడీపీ చేసే మోసాలను తెలుసుకుని మత్స్యకారులంతా వైఎస్సార్సీపీలో చేరుతున్నారని పేర్కొరు. కార్యక్రమంలో విడవలూరు, ఇందుకూరుపేట, కొడవలూరు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, మండల కన్వీనర్లు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గంధం వెంకటశేషయ్య, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి , నలుబోలు సుబ్బారెడ్డి, నాయకులు దువ్వూరు కళ్యాణరెడ్డి, సూరా శ్రీనివాసులరెడ్డి, పూండ్ల అచ్యుత్‌రెడ్డి, కొండూరు అనీల్‌బాబు, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మాతూరు శ్రీనివాసులరెడ్డి, ఓగు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం..
-
విజయ శంఖారావం
-
తూర్పున సంకల్ప సూరీడు
-
పశ్చిమ ఒడిలో రాజన్న బిడ్డ
-
కృష్ణమ్మ ఒడిలో జన్ పరవళ్ళు
-
కరువు నేల ప్రకాశించేలా..
-
సింహపురిలో సింహనాదం
-
జనధాత్రిపై జగన్ కేతనం
జననేత వైఎస్ జగన్ జన్మదినం నేడు. ఓ ఉత్సాహం... పట్టుదల, పోరాటాల బాట, అకుంఠిత దీక్షకు సంకేతం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తెలుగు ప్రజలకు ఆయన ఒక ఆశాజ్యోతి. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని ఎదిగిన పోరాట యోధుడు జగన్. ఒకానొక సందర్భంలో ఆళ్లగడ్డ బహిరంగ సభలో ప్రసంగిస్తూ తనపై దాడి చేయవచ్చని తన కాళ్లు, చేతులు విరగ్గొట్ట వచ్చని తనను విగతజీవిని చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చని.. అయినా, తాను సముద్రం లోని కెరటంలా ఉవ్వెత్తున ఎగసిపడుతూ మళ్లీ ప్రజ లతో కలసి పోరాటం చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. నేడు జన్మదినం జరుపుకుంటున్న జగన్‌ను భారత న్యాయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని రీతిలో 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఆయనను నిర్బంధించాయి. ఒకవైపు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ వైఎస్సార్సీపీని బలమైన ప్రతిపక్షంగా జగన్ తీర్చిదిద్దారు. తొమ్మిదేళ్ల రాజ కీయ ప్రస్థానంలో ఇంత విస్తృతంగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అరుదుగా కనిపిస్తారు. ఆయన ఓదార్పుయాత్ర, రైతు భరోసాయాత్ర, ప్రత్యేక హోదాపై పోరు ఇందుకు నిదర్శనం. 10 కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ బహిరంగ సభలు జరిపిన చరిత్ర ఎవరికీ లేదు. ఆయన జరుపుతున్న ప్రజాసంకల్పయాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకహోదా ఆవశ్యకతను జగన్ గుర్తించినంతగా వేరే ఏ పార్టీ నాయకులు గుర్తించలేదు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన పార్టీకే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి జగన్. అలాగే పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను జగన్ ఎండగట్టినంతగా మరెవరూ వెలుగులోకి తేలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అనేక విభజన హామీలు అమలుపరచలేదని కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్న నిఖార్సైన నాయకుడు జగన్. రాజధాని నిర్మాణంలో అవి నీతి అక్రమాలను ప్రశ్నించిన నాయకుడు కూడా వైఎస్ జగనే. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య సమతుల్యత జరగాలని నినదించిన నాయకుడు జగనే. నేడు పోరాటాలకే జగన్ స్ఫూర్తి. కాంగ్రెస్ పార్టీని ఆయన వదిలిన తీరూ, తను, తన తల్లి పార్లమెంట్, అసెంబ్లీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి నేడు ఒక బలమైన పార్టీగా ఎదిగి వచ్చిన తీరు రాజకీయ పార్టీలకు ఓ ఆదర్శం. తన పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను బాబు కొనుగోలు చేసి జగన్‌ను దెబ్బతీయాలనుకున్నా ఆయన చలించలేదు. తనపై భౌతి కంగా దాడి జరిగినప్పుడు కూడా ఆయన నిబ్బరంగా వ్యవహరించారు. రాష్ట్రంలో జగన్ అంటే జనం.. జనం అంటే జగన్.. ఇదే నేడు మనకు కనిపిస్తున్న వాస్తవం. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని రైతులకు ద్రోహం చేయడాన్ని, నిరుద్యోగ యువతను మోసగించడాన్ని, డ్వాక్రా మహిళలకు ద్రోహం చేయడాన్ని ఆయన వందలాది సభలలో బట్టబయలు చేశారు. వైఎస్సార్ తనయుడిగా ఆ మహా నుభావుడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దివిటీని కొనసాగించే ధీశాలిగా జగన్ ఎదిగారు. నేడు జగన్ నిరంతరం ప్రజల్లో ఉండి రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక వాతావరణం కల్పించగలిగారు. ప్రజలల్లో వైఎస్సార్సీపీ పట్ల సానుకూల వాతావరణ కల్పించారు. నేడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. ఈ భావనతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమన్వయకర్తలు పని చేయాలి. రాష్ట్ర ప్రజలు జగన్‌ను ఆశీర్వదించి సీఎంగా ఎన్నుకోవడానికి కృషి చేయాలి. దివంగత నేత వైఎస్‌కు నివాళిగా తనయుడు జగన్‌ను సీఎం చేయడం ద్వారా ఆయనకు శుభాభినందనలు అందించినవారమవుతాం. వ్యాసకర్త : ఇమామ్, కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
సిట్ చుట్టూ రాజకీయ ఉచ్చు !
సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టే జరుగుతోంది. సిట్‌విచారణ అటకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ చదరంగంలో సిట్ పావుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ బాస్ డైరెక్షన్లో విచారణను ముగించేయడానికి కసరత్తు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కుట్ర కోణాన్ని వెలికి తీయకుండా.. సూత్రదారులను గుర్తించకుండానే విచారణను ముగించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలను తప్పించు కోవడానికేపిటిషన్ ఇప్పటికే కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతుండడంతో కస్టడీ పొడిగింపు పిటిషన్ వేసినట్టు పోలీసు వర్గాల్లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తుందేమోనని సిట్ వర్గాలు ఎదురు చూశాయి. విచారణను 9వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు వేచి చూసి, కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపో తే సాధ్యమైనంత త్వరగా కేసు క్లోజ్ చేసేందుకు పథక రచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. టీడీపీ నేతల జోలికెళ్లక పోవడంపైఅనుమానాలు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును సాధ్యమై నంత త్వరగా ముగించేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. టీడీపీనేత ప్రమేయం కళ్లకు కట్టినట్టుగా కన్పిస్తున్నా సిట్ విచారణ ఆ దిశగా సాగడం లేదు. ప్రభుత్వ పెద్ద నుంచి వచ్చిన ఆదేశాల కనుగుణంగానే దీపావళి వెళ్లిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఈ కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనకు వెళుతూ సోమవారం విశాఖలో సీపీ లడ్డా, సిట్‌ను పర్యవేక్షిస్తున్న నయీమ్ తదితర పోలీస్ అధికారులతో భేటీ అయి విచారణ వివరాలను తెలుసుకుని కేసును ఎలాకొలిక్కి తీసుకు రావాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇక హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. ప్రజలు, మీడియాలో వ్యతిరేక వార్తలు రావడంతోనే మరోసారి కస్టడీ పొడిగింపు పిటిషన్ వేశామని చెబుతున్నారు. పిటిషన్ పేరుతో డ్రామా నిందితుడు తమ కస్టడీకి కావాలనుకున్నప్పుడు పోలీస్ అధికారులు న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళ్లాలి. ఇక్కడ మాత్రం పిటిషన్ వీగి పోవాలనే ఉద్దేశంతోనే అసంపూర్ణంగా వేసినట్టు తెలుస్తోంది. మరో వైపు నిందితుడ నుంచి రాబట్టాల్సిన విషయాలు ఏమీ లేవని..మిగిలిన కోణాల్లో దర్యాప్తు సాగించి సాధ్యమైనంత త్వరగా చార్జి షీట్‌ఫైల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని ఓ సిట్ అధికారి ‘సాక్షి’ తోచెప్పారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా అరెస్ట్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే చార్జి షీట్ ఫైల్ చేస్తామని, ఇది ప్రత్యేక కేసు కావడం వల్లే అన్ని కోణాల్లోదర్యాప్తు చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ఒత్తిళ్ల వల్లే పక్కదారి రెండు నెలల కిందట వరకు కేవలం లేఖ ఇచ్చేందుకే సిద్ధమయ్యాడని, కానీ ఉన్నట్టుండి ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్న అధికారులు సూత్రధారులను మాత్రం వదిలేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకు అటు వైపు చూడడం లేదు. టీడీపీ నేత హర్షవర్ధన్‌ను అర్ధరాత్రి దాటే వరకు విచారించిన మరుసటి రోజు నుంచి సిట్ విచారణ జోలికి సీపీ లడ్డా రాలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకే సీపీ ఈ కేసు విషయంలో అంటిముట్టనట్టుగా ఉన్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ పక్కా ప్రణాళికతోనే హత్యాయత్నం చేశాడని స్పష్టమవుతోంది. పైగా టీడీపీ నేత హర్షవర్ధన్ యాజమాన్యంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేందుకు కోనసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు సిఫార్సు చేసినట్టుగా చెబుతున్నారు.ఇక శ్రీనివాస్‌కు లేఖ రాసి సహాయం చేసిన రేవపతిపతి ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ సిఫార్సుతో చేర్పించినట్టు పోలీసులే గుర్తించారు. కుట్ర ఉందని గుర్తించినా మౌనం హర్షవర్ధన్, ఆయన హోటల్లోసూపర్వైజర్గా పనిచేస్తున్న రామకృష్ణలు శ్రీనివాస్‌ను చేరదీయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీ ఇప్పించి మరీ హోటల్లోకి తీసుకోవడం జగన్‌కు కాఫీకి బయట నుంచి రానీయకుండా అడ్డుకోవడం.. పథకం ప్రకారం శ్రీనివాస్‌ను పంపి హత్యాయత్నానికి పాల్పడడం చూస్తుం టే ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరిగిందని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో టీడీపీ నేతల ప్రమేయం ఉందని కళ్లెదుట కన్పిస్తున్నా వారి జోలికి వెళ్లే సాహయం చేయలేకపోతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఎలాంటి విచారణ సాగడం లేదు. పూర్తిగా రికార్డు వర్కుకే పరిమితమవడం ఈ విమర్శలకు మరింత బలం చేకూరుస్తోంది. -
సాహో..సంకల్పధీరుడా
ఆయనో.. నవశకం.. చీకటి తెరల్లో చిక్కుకున్న రాష్ట్రానికి నవరత్నాల వెలుగులు నింపేందుకు ఆ యువనేత వేసిన తొలి అడుగు.. ప్రభంజనమైంది. జన హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.ఏ విజయ పయనమైనా.. ఒక్క అడుగుతోనే ప్రారంభమన్నట్లు..అరాచక పాలన వలయంలో విలవిల్లాడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ ప్రారంభమైన యాత్ర..వందలు.. వేల కిలోమీటర్లు దాటింది..దాటుతూ ఉంది. మహానేతను స్మరించుకుంటూ 2017 నవంబర్ 6న మొదలైన సంకల్పానికి ఏడాది పూర్తయింది.ఈ సందర్భంగా అన్న.. చెల్లి.. అక్క.. తమ్ముడు..అమ్మ.. నాన్న.. అవ్వ.. తాత.. నాయకుడు, కార్యకర్త, అభిమాని..అనే తారతమ్యం లేకుండా.. జననేతకు జేజేలు పలికారు.కత్తులు దూసిన అధికార పక్షాన్ని దుమ్మెత్తి పోస్తూ..మనసెరిగిన మన నేత చల్లంగా ఉండాలంటూ పూజలు నిర్వహించారు. విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంగళవారంతో ఏడాది పూర్తి చేసుకుంది. 365 రోజుల పాటు అశేష జనవాహిని అభిమానం నడుమ నిరాటంకంగా సాగడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చే సుకున్నాయి. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జననేత జగనన్నపై జరిగిన హత్యాయత్నం ఘట నను గుర్తు చేసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలనీ పూజలు చేస్తూ.., దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేవుళ్లను వేడుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర ఏడాది పూర్తయిన సంబరాలు ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించారు. పాయకరావుపేటలో. ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా నక్కపల్లి మండలం ఉద్దండపురంలో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జగన్ గోత్రనామాలతో స్వామివారికి తమలపాకుల పూజ, అభిషేకం నిర్వహించారు. పాయకరావుపేటలో సమన్వయకర్త, జడ్పీటీసీ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎస్.రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లి రామాలయం వద్ద పార్టీ నేతలు 365 కొబ్బరికాయలు కొట్టారు. నర్సీపట్నంలో.. జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం శ్రీదుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు. యలమంచిలిలో.. మహానేత రాజన్న ఆశయాలు అమలు కావాలంటే రానున్న రోజుల్లో జగన్మోహనరెడ్డి సీఎం కావడం ఒక్కటే మార్గమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కన్నబాబురాజు అన్నారు. మునగపాక మండలంలోని రామగిరి, మడకపాలెం, చెర్లోపాలెం గ్రామాల్లో ఏడాది సంబరాలతో పాటు రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరకులో... సంకల్పయాత్ర చారిత్రాత్మకమని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి పాల్గుణ అన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజ యవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా ని యోజకవర్గ కేంద్రమైన అరకులోయలో విజయోత్సవ ర్యాలీని చెట్టి పాల్గుణ ఘనంగా నిర్వహిం చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని కిలోమీటరు పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలాభిషేకం చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించా రు. గన్నెల పంచాయతీ కేంద్రంలో గిరిజనులతో కలిసి వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గిరిజనులంతా జైజగన్ నినాదాలతో హోరెత్తించారు. పాడేరులో... ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగొళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జి.మాడుగులలోని జీపులస్టాండ్ మూడురోడ్లు జంక్షన్ వద్ద పార్టీ జెండా పండుగ నిర్వహించారు. అదే విధంగా బందవీధిలో వెన్నెలమ్మ తల్లి ఆలయంలో మత్సరాజు విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
కృష్ణ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
సంకల్పానికి ఏడాది: కడప జిల్లాలో ప్రత్యక పూజలు
-
సంకల్పానికి ఏడాది: ఒంగోలు పార్టీకార్యలయంలో కేక్ కట్ చేసిన నేతలు
-
ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
సంకల్పానికి ఏడాది: తిరుపతిలో ప్రత్యక పూజలు
-
సంకల్పానికి ఏడాది: అనంతపూరం జిల్లాలో ప్రత్యక పూజలు
-
సంకల్పానికి ఏడాది: కర్నూలు జిల్లాలో ప్రత్యక పూజలు
-
నెల్లూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
సంకల్పధీరుడు...!
పాలకుల్లో సమన్యాయం లోపించింది. కుట్రలుకుతంత్రాలకు పాల్పడుతున్నారు. అడుగడుగునాఅన్యాయానిదే పైచేయి అవుతోంది. అణగారినవర్గాలకు రిక్తహస్తం ఎదురవుతోంది. రైతులకుభరోసా లేదు, అర్హతతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల పక్షానప్రభుత్వానికి విన్నవిస్తే హేళనే ప్రధాన భూమికైంది.ఎంత కష్టమొచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినాప్రజలకు అండగా నిలవాలనే ‘సంకల్పం’ మొలచింది.వెరసి ఇడుపులపాయ నుంచి తొలి అడుగు పడింది.3,211 కిలోమీటర్లు అలుపుసొలుపు లేకుండా‘ప్రజాసంకల్ప యాత్ర’ సాగింది. కనీవిని ఎరుగని రీతిలోప్రజాభిమానంతో తడిసిముద్దవుతున్న ప్రతిపక్షనేత వైఎస్జగన్మోహన్రెడ్డి చరిత్రకు చేరువలో ఉన్నారు.ఈక్రమంలో అసూయ, ద్వేషం, పుట్టుకొచ్చాయి.ఏకంగా అంతమొందించే పథక రచన తెరపైకి వచ్చింది. సాక్షి ప్రతినిధి కడప: ఆంధ్రావని అభివృద్ధే లక్ష్యంగా... ప్రజా హితమే ధ్యేయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిగ్గా ఇదే రోజున గత ఏడాది నబంబరు 6న జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. తొలి అడుగుతో ప్రారంభమైన ‘ప్రజాసంకల్పయాత్ర’ 3,211 కిలోమీటర్లు నిర్విరామంగా కొనసాగింది. లక్షలాది మందితో మమేకమౌతూ... వారి కష్టాలు తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ...దగా పడ్డ జనానికి భరోసా కల్పిస్పూ.. ముందుకు సాగారు. 12జిల్లాల్లో ప్రజల ఆదరణ రోజురోజుకు రెట్టింపు అవుతూ వచ్చింది. రాబోవు రోజుల్లో ప్రజలు అగ్రపీఠం వేస్తారనే భావన పాలకపక్షంలో పడింది. ఈక్రమంలో కుట్ర కోణం తెరపైకి వచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గతనెల 25న హత్యాయత్నం చోటుచేసుకుంది. యావత్తు తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. ఊహించనిపరిణామాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఆపై మరో కపట నాటకాన్ని సృష్టించడం పాలకుల వంతు అయిందని పరిశీలకులు వివరిస్తున్నారు. పేద ప్రజలకు తోడు నీడగా.... 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా సాగింది. గత అక్టోబర్ 25 నాటికి 294రోజులు చేపట్టిన పాదయాత్రలో 3211.5 కిలోమీటర్లు నడిచారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా... ఆత్మబంధువుగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ప్రభుత్వం ఆసరాగా నిలివాల్సి ఉండగా నామమాత్రపు చర్యలుండడంతో బాధితులకు కొండంత ధైర్యం నింపుతూ... బడుగు, బలహీన వర్గాల్లో నేనున్నానని.. మీకేం కాదని భరోసా కల్పిస్తూ ఎక్కడికక్కడ ముందుకు కొనసాగింది. ఇంటి బిడ్డలా...కష్టంలో ఇంటికి పెద్దన్నలా ఉంటానం టూ హామీ ఇçస్తూనే భవిష్యత్‌పై భరోసా కల్పించారు. ఇబ్బడి ముబ్బడి ప్రజా సమస్యలు తెరపైకి వస్తుండడంతో అలుపెరగని బాటసారిగా ప్రతిపక్షనేత ప్రజాసంకల్పయాత్రను కొనసాగించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం తత్తరపాటు... ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు విన్నపాలు అధికమయ్యాయి. ప్రభుత్వ డొల్లతనాన్ని ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువస్తున్నారు. ఈక్రమంలో ప్రజా విన్నపాలపై ప్రజానేత స్పందిస్తూ తక్షణమే హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ తత్తరపాటు తెరపైకి వచ్చిందని పలువురు వెల్లడిస్తున్నారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడికక్కడ వారి సమస్యలకు అండగా నిలుస్తుండడమే అందుకు కారణంగా పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. సంక్షేమ పథకాల్లో ఏకపక్ష నిర్ణయాల కారణంగా రాజన్న రాజ్యం కోసం ప్రజానీకం ఎదురుచూస్తోందని నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దల్ని అదిలించినట్లు తెలుస్తోంది. ఇక ఉన్న ఏకైక మార్గం కుట్రలు కుతంత్రాలేనని గ్రహించి పక్కా ప్రణాళిక బద్ధంగా పథక రచన చేసినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆపై హత్యాయత్నం ఘటన తెరపైకి రావడంతో తాత్కాలికంగా సంకల్పానికి విరామం పడింది. సంకల్పధీరుడు ప్రజల కోసం మరింత పట్టుదలతో ప్రజాముంగిటకు చేరుకోవాలని తెలుగు ప్రజలు ఆకాంక్షిస్తుండడం విశేషం. -
జన హితుడు
హత్యకు కుట్ర.. ఆగ్రహిస్తున్న జనం ప్రజా సమస్యలే అజెండాగా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండనకా..వాననకా, చలి అనకా పాదయాత్ర సాగిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలను నేరుగా కలుసుకుని.. వారి బాగోగులను తెలుసుకుంటున్నారు. ప్రతిచోట భారీగా జనం వస్తుండడంతో ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన యాత్ర ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. విశేష ప్రజాదరణ చూసి ఓర్వలేక జననేతను అంతమొందించడానికి కుట్ర పన్నారు. అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తి కాదని, ఒక శక్తి అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ అధికార పార్టీ పన్నాగాలపై ప్రజలు మండిపడుతున్నారు. ఉక్కు సంకల్పంతో పాదయాత్రను కొనసాగించేందుకు సన్నద్ధమవుతున్న జననేతకు జనం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నాయకుడంటే...జనం గుండెచప్పుడు వినాలి. వారిలో ఒకడిలా మెలగాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా వారి కోసమే నిలబడాలి. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రజాశ్రేయస్సునే కాంక్షించాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నాయకులు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజా సమస్యలే అజెండాగా ఆయన అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. ఉక్కు ‘సంకల్పం’తో ముందుకు సాగుతున్నారు. జనం కష్టసుఖాలను తెలుసుకోవడానికి, వారి సంక్షేమాన్ని విస్మరించిన పాలకులకు కనువిప్పు కల్గించడానికి ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి(మంగళవారం)తో సరిగ్గా ఏడాది అవుతోంది. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 3,211 కిలోమీటర్ల మేర కొనసాగింది. కర్నూలు జిల్లాలో గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు 18 రోజుల పాటు 263 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. జనంతో మమేకం.. కర్నూలు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 14వ తేదీ ప్రారంభమై డిసెంబర్ మూడో తేదీ వరకు ఏడు నియోజకవర్గాల్లో కొనసాగింది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో జననేత పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎక్కడికక్కడ పెద్దఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి చెప్పుకొని ఉపశమనం పొందారు. ప్రజాకంఠక టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడానికి మహిళలు, వృద్ధులు, అన్నదాతలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కూలీలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. జిల్లాకు బాసటగా జననేత హామీలు ప్రస్తుత పాలనలో జిల్లా అభివృద్ధి పదేళ్లు వెనక్కి పోయిందని ప్రజలు భావిస్తున్నారు. ఇదే తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే పనులపై పూర్తి సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని నమ్ముతున్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి జననేత ఇచ్చిన హామీలతో పాటు ‘నవరత్నాలు’ ఎంతగానో తోడ్పతాయని అంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సత్వరమే చర్యలు తీసుకుంటామని, నాపరాయి పరిశ్రమకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు మూడు టీఎంసీలను తీసుకెళ్లాలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కోడుమూరు తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎస్‌ట్యాంకు నిర్మాణం, ఎమ్మిగనూరులో చేనేతలకు బాసటగా క్లస్టర్ పార్కు ఏర్పాటు, హంద్రీనదిపై గోరంట్ల– ఎర్రగుడి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం, మండలాలకో కోల్డ్ స్టోరేజీ తదితర హామీలను ఇచ్చారు. వీటితో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి భరోసా ఇచ్చారు. చంపేందుకు కుట్ర పన్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కచ్చితంగా చంపాలనే కుట్ర పన్నారు. దేవుడి దయతో ఆయన బయటపడ్డారు. సీఎం చంద్రబాబు దారుణంగా తయారయ్యారు. వైఎస్ జగన్‌పై అభిమానే దాడి చేశారని చెప్పడం ఘోరం. ఎక్కడైనా అభిమానులు చంపుతారా? ఈ ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అభిమానులకు ప్రేమను పంచడం తప్పా ద్వేషించడం తెలియదు. ఈ కేసు నుంచి టీడీపీ పెద్దలు బయట పడడానికే అభిమాని నాటకం ఆడుతున్నారు. – విజయలక్ష్మీ, రిటైర్డ్ లెక్చరర్, మద్దూర్ నగర్, కర్నూలు -
సాహో..‘సంకల్ప’ ధీర
ఆయన గమ్యం.. ఐదు కోట్ల ఆంధ్రుల మోముపై చిరునవ్వులొలికించే సంతకంఅడుగడుగునా పేదల కష్టాలను ఆలకించి.. చలించిపోతున్న మానవత్వం. తాను నడిచిన బాటలో ప్రతి కన్నీటి బొట్టును తుడుస్తూ భరోసా కోట కడుతున్న గుండె ధైర్యం. అవినీతి, అక్రమాల పాలనను చీల్చి చెండాడుతున్న రేపటి వెలుగు కిరణం.. ఇదీ జన బాంధవుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది కాలపు ప్రజా సంకల్పయాత్ర ప్రస్థానం.. ఈ ఆత్మీయ యాత్ర పురుడు పోసుకుని నేటితో ఏడాది కాలం ముగిసిన సందర్భంగా కృష్ణా జిల్లా గుండెల్లో పదిలమైన పాదయాత్ర జ్ఞాపకం.. మరోసారి గుండె తలుపు తట్టింది.. జననేతపై జరిగిన హత్యాయత్నాన్ని తలుచుకుని ఆందోళనతో వణికిపోయింది.. తెలుగుదేశం పార్టీ కుట్రలను కాలం గర్భంలో కలిపేస్తామంటూ ప్రతిన బూనింది. సాక్షి, అమరావతిబ్యూరో : పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను గుర్తించడం.. ఆచరణయోగ్యమైన పరిష్కార మార్గాలను అధ్యయనం చేయడం.. అధికారంలోకి వస్తే ఆ సమస్యల పరిష్కారానికి అమలు చేయనున్న విధాన నిర్ణయాలను ప్రకటించడం.. తద్వారా దివంగత మహానేత వైఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం.. ఈ లక్ష్యాలతో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిçస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రోజురోజుకీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. అయితే గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి విదితమే. జననేత నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్రకు నీరాజనాలు పట్టిన జనం.. ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. జననేతను ఎదుర్కొనలేకే అధికారపార్టీ నేతలు దొంగదెబ్బ తీయాలనుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడాది పూర్తయింది. వారధి సాక్షిగా.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జిల్లాలో జనాభిమానం వెల్లువెత్తింది. నెల రోజులపాటు ఆయన నిర్వహించిన పాదయాత్ర ఆసాంతం జనసందోహం మధ్య సందడిగా సాగింది. ‘సంకల్ప’ యాత్రికుడికి విజయవాడ ఆత్మీయ తివాచీతో స్వాగతం పలికింది. కనకదుర్గ వారధి వద్దే ఆయనకు అభిమాన జనసందోహం ఎదురేగి జిల్లాలోకి సాదరంగా తోడ్కొని వచ్చింది. జననేతను అనుసరిస్తూ వేలాదిమంది అభిమానులు వారధిపై కదం తొక్కారు. జననేత ఆసాంతం జనంతో మమేకమవుతూ పాదయాత్ర కొనసాగించారు. అందరి కష్టాలు వింటూ వారిని ఆదుకుంటానని ధైర్యంచెబుతూ ముందుకు సాగిపోయారు. అధైర్యపడొద్దు.. నేనున్నా! రెండు కాళ్లూ కోల్పోయినా పింఛన్‌రాని దుస్థితి.. గూడు కావాలి అంటే లంచం అడుగుతున్నారన్న పేద మహిళ గోడు.. పింఛను కోసం పడిగాపులు కాస్తున్నామన్న అవ్వాతాతల ఆవేదన.. కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నా అన్న ఆశా కార్యకర్తల బాధ.. ఇలా దారిపొడుగునా పేదలు, వృద్ధులు, మహిళలు, సామాన్యులు తమ కష్టాలను జననేత వద్ద చెప్పుకున్నారు. దాంతో చలించినపోయిన వై.ఎస్.జగన్ కళకళలాడాల్సిన పల్లెసీమలు ఇంతటి కష్టాలతో కునారిల్లుతున్నాయా అని ఆవేదన చెందారు. అందరికి ధైర్యం చెబుతూ.. ‘నేనున్నానని’ భరోసానిచ్చారు. ఆశా కార్యకర్తలు వై.ఎస్.జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు వివరించారు. ఆశా కార్యకర్తలు వంటి చిరు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేసే విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. తనను కలిసిన కాంట్రాక్టు లెక్చరర్ల అసోషియేషన్ ప్రతినిధులకూ ఆదే హామీ నిచ్చి ధైర్యం చెప్పారు. అదే విధంగా చాలీచాలనీ జీతాలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని వై.ఎస్.జగన్ ధైర్యం చెప్పారు. స్కాలర్షిప్ ఇవ్వడం లేదని, ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేదని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జననేతకు చెప్పుకున్నారు. మహానేత మహోన్నత ఆశయంలో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్‌ఐటీలను సంస్కరిస్తామని హమీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలు అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. జిల్లాకు జననేత ఇచ్చినహామీల్లో కొన్ని.. ♦ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. ♦ నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ. 10 వేల సాయం ♦ అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న దానికంటే ఎక్కువ జీతం ♦ దళిత వధువుకు వైఎస్సార్ పెళ్లి కానుకగా రూ.లక్ష ♦ ఎస్సీ, ఎస్టీలతోపాటు రెల్లి తదితర కులస్తులకు ప్రత్యేకంగా మూడు ఫైనాన్స్ కార్పొరేషన్లు ♦ 90 శాతం సబ్సిడీతో పాడి పశువుల పంపిణీ ♦ ప్రతి గ్రామంలో దళితులకు శ్మశానాలకు స్థలం కేటాయింపు ♦ దేవాలయం, చర్చిల నిర్వహణకు ప్రతి పంచాయతీకి రూ. 10 వేల కేటాయింపు ♦ పట్టణ పేదలకు ఇచ్చే ఫ్లాట్లపై ఉన్న రూ. 3 లక్షల రుణం మాఫీ ♦ లాయర్లకు రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి ♦ విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ, ప్రత్యేక కార్పొరేషన్ ♦ ప్రైవేట్ టీచర్, లెక్చరర్ల కోసం ప్రత్యేక చట్టం ♦ ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం ♦ కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదింపు -
సంకల్పధారి..
అలుపెరగని బాటసారి అతను. నిత్యం వేలాది మందిని కలుస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకొని జిల్లా సమస్యలు వరకు అనేకం క్షేత్రస్థాయిలో తెలుసుకుని, పరిశీలించి వారందరికి భరోసా కల్పించారు. కొన్ని గంటలు, కొద్ది రోజులు పాదయాత్ర చేయడానికే కష్టంగా మారిన తరుణంలో సరిగ్గా ఏడాది నుంచి పాదయాత్ర చేస్తూ లక్షలు కాదు కోట్ల మందిని వ్యక్తిగతంగా కలిసి వారి కష్టాలు విని నేనున్నాంటూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యమిచ్చారు. పాదయాత్ర చేస్తున్న జననేతపై హత్యాయత్నం జరిగినా చెదరని సంకల్పంతో యాత్ర కొనసాగించడానికి సన్నద్ధమవుతున్నారు. ఎండకు వానకు వెరవక, రాజకీయ కుట్రలు లెక్క చేయకుండా ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. జిల్లాలో సాగిన యాత్ర ఆద్యంతం ఓ వైపు సమస్యలు వింటూ మరో వైపు అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం నాటికి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 6వ తేదీ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర నిరాఘాటకంగా సాగుతోంది. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ద్వారా జిల్లాలో సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. సాధారణంగా నేతల ద్వారా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుంటారు. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి నేరుగా ప్రజల్లోకి వచ్చి వారి సాధక బాధకాలనువింటూ ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి తెలుసుకోవడం అత్యంత అరుదుగా జరిగేది. అలాంటి సాహసోపేతమైన యాత్రకు జననేత జగన్ శ్రీకారం చుట్టారు. నేత నడిచిన దారి అంతా జనసంద్రంగా మారటంతో పాటు పార్టీ నిర్వహించిన సభలకు జనప్రభంజనం పోటెత్తింది. ఈ ఏడాది జనవరి 23న జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాకలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి చేరింది. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు జన నేత వెంట అడుగులు వేసేందుకు పోటీలు పడ్డారు. రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే పాదయాత్రగా నేతలు అభివర్ణించారు. పాదయాత్ర వెయ్యి కిలో మీటర్ల కీలక వేదికగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నిలిచింది. ఈ సందర్భంగా అశేష జనవాహని జననేత వెంట వాక్ విత్ జగనన్నలో పాల్గొన్నారు. 100 కిలో మీటర్ల కీలక ఘట్టానికి ఆత్మకూరు నియోజకవర్గం వేదిక అయింది. అక్కడ 72 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభ్యుల ఆత్మీయ సమావేశాలతో మరింత చేరువ జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరురూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఇటుక బట్టీల కార్మికుల కష్టాలు మొదలుకొని పొగాకు రైతుల ఇబ్బందుల వరకు అన్నింటిని ప్రత్యక్షంగా చూశారు. దీంతో పాటు లక్షల మంది వ్యక్తిగత సమస్యల్ని జననేత దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ముఖ్యంగా బట్టీ కార్మికులు, సెజ్‌ల్లో పనిచేసే కార్మికుల కష్టాలు, వరి, నిమ్మ, పొగాకు, మినుము, శనగ, తదితర పంటల రైతులు అనేక చోట్ల జననేతను కలిసి కష్టాలను చెప్పారు. చేనేత కార్మికుల దయనీయ స్థితి, చేతివృత్తి కళాకారుల కష్టాలు, వివిధ వర్గాలు, కులాల ప్రజల ఇబ్బందులు జననేత దృష్టికి వచ్చాయి. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 15 వరకు జనవరి 23న ప్రారంభం సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాకలో ప్రారంభమైన యాత్ర ఫిబ్రవరి 15న ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో ముగి సింది. 9 నియోజకవర్గాల్లో 14 మండలాలు 142 గ్రామాల్లో 266.5 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. చేనేత, యాదవ, అర్యవైశ్య, ముస్లిం, మహిళలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సాధక బాధకాలను తెలుసుకుని వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సూళ్లూరుపేటలో పెళ్లకూరు(చెంబేడు), నాయుడుపేట గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి (పొదలకూరు), నెల్లూరు రూరల్ (సౌత్ మోపూరు), కోవూరు (బుచ్చిరెడ్డిపాళెం), ఆత్మకూరు (సంగం), కావలి (దగదర్తి),ఉదయగిరి (కలిగిరి)లో బహిరంగ సభల్లో ప్రజలు నీరాజనం పలికారు. ఉలికి పడి..ఉద్యమించి ప్రజలను కలుసుకుంటూ.. బాధలను తెలుసుకుంటూ వేల కిలో మీటర్లు సుదూర ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడంతో నెల్లూరు ప్రజలు ఉలికి పడ్డారు. వైఎస్సార్సీపీ అభిమాని ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసిన దురాఘాతుకాన్ని ఖండిస్తూ.. జిల్లాలోని వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు టీడీపీ హత్యారాజకీయ కుట్రలపై కదం తొక్కారు. ఊరూరు ఉద్యమ బాటలు పట్టాయి. హత్యాయత్నంలో తీవ్రగాయానికి గురైన జగన్మోహన్రెడ్డి త్వరలో కోలుకోవాలని సర్వమతప్రార్థనలు, పూజలు చేశారు. వేలకు వేల కొబ్బరి కాయలు ముక్కోటి దేవుళ్లను మొక్కారు. రాజకీయ పార్టీలకు అతీతంగా (టీడీపీ మినహా) ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాలు జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటనను ఖండించాయి. -
గుర్తుకొస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు పాలనలో సమస్యలు పరిష్కారం కాక అష్టకష్టాలు పడుతున్న జనం సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడాన్ని పార్టీల కతీతంగా జనం ముక్తఖంఠంతో ఖండిస్తున్నారు. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండిచక పోవడాన్ని తప్పు పడుతున్నారు. అందుకే ఇది ప్రభుత్వం చేయించిన చర్యే అన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఇక తమ అధినేతపై హత్యాయత్నం జరగడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించమన్నందుకు ఇంతటి దురాగతానికి పాల్పడతారా.. ఏకంగా ప్రతిపక్ష నేతనే అంతమొందించే కుట్రకు దిగుతారా అంటూ మండి పడుతున్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమై నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా యాత్ర సాగిన తీరును గుర్తు చేసుకుంటూ.. ఆయనపై జరుగుతున్న కుట్రలను తీవ్రంగాఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సర్వమత ప్రార్ధనలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 6న వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన యాత్ర కర్నూలు, అనంతపురం,చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా,పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం వరకూ సాగింది. మంగళవారంతో యాత్ర ప్రారంభమై సరిగ్గా ఏడాది అవుతుంది. ప్రకాశం జిల్లాలో 22 రోజులపాటు జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగింది. ఈ యాత్రకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రజలు స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. దివంగత నేత వైఎస్ పాలనలో వైఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను నేతలు, ప్రజలు జగన్ కు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో వరుస కరువులను ఏకరువు పెట్టారు. సాగు,తాగునీరందక పడుతున్న ఇబ్బందులను చెప్పారు. గిట్టు బాటు దరలు లేవన్నారు. దివంగత నేత చేసిన ప్రాజెక్టు పనులుతప్ప బాబు ఏమీ చేయలేదన్నారు.సంక్షేమ ఫలాలు అధికారపార్టీ కార్యకర్తలకు తప్ప అర్హులకు అందలేదన్నారు. అన్ని కష్టాలను జగన్ ముందుంచారు. వైఎస్ జగన్ అందరి కష్టాలను విన్నారు. అడుగడుగునా జనం కన్నీళ్లు తుడిచారు. నున్నానంటూ భరోషా ఇచ్చారు. అందరి దయతో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. జగన్ హామీలపై జనానికి నమ్మకం పెరిగింది. జగన్ యాత్ర ఇంకా జిల్లా వాసుల కళ్లముందు మెదులుతునే ఉంది. ఇంతలో గత నెల 25న జగన్ పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది.శ్రీనివాసరావు అనే యువకుడు ఏకంగా విమానాశ్రయంలోనే జగన్ పై దాడికి దిగి కత్తితో పొడిచాడు. ప్రమాదం తృటిలో తప్పింది. ఈ వార్తతో పార్టీ శ్రేణులతో పాటు జనం హతాశులయ్యారు. కన్నీటి పర్యంత మయ్యారు. తమ నేతను అంతమొందించే కుట్రకు దిగడాన్ని సహించ లేకున్నారు. ముఖ్యమంత్రి తో సహ అధికారపార్టీ పై మండి పడుతున్నారు. సర్వత్నా హత్యాయత్నాన్ని ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా వాసులు జగన్ పాదయాత్ర,ఆయన ఇచ్చిన భరోసా ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రకాశంలో 278.1 కి.మీ యాత్ర.. 2018 ఫిబ్రవరి 16న జగన్ ప్రజా సంకల్ప యాత్ర కందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం మండలం కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. తొలిరోజు యాత్ర 1200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్ రామకృష్ణాపురం వద్ద మొక్కను నాటి వాకమళ్లవారిపపాలెం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలోని కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్ధంకి, పర్చూరు, చీరాల 9 నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలు, 124 గ్రామాల గుండా 22 రోజుల పాటు 278.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మార్చి 12 ఉదయం∙యాత్ర బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొండపి నియోజక వర్గంలో రైతు సదస్సు నిర్వహించగా మిగిలిన 8 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ⇔ తొలిరోజు కందుకూరు నియోజకవర్గ ప్రజలు రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జగన్ దృష్టికి తెచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునీకరణ, సోమశిల ఉత్తర కాలువ నిర్మాణం పూర్తి అయితే తాగు, సాగునీరు లభిస్తుందని తెలిపారు. ⇔ కొండపి నియోజకవర్గంలో పొగాకు రైతులు, పాడి రైతులు తమ బాధలను జగన్ ముందు ఏకరువు పెట్టారు. అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న ఒంగోలు డైయిరీ రైతులను వంచించిందని వాపోయారు. ⇔ సురక్షిత తాగునీరు అందక ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలు జగన్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. దివంగత నేత వైఎస్ ఇచ్చిన సాగర్ జలాలే దిక్కయ్యాయన్నారు. ⇔ పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగునీరు అందక అష్ట కష్టాలు పడుతున్నామని మార్కాపురం ప్రాంత వాసులు జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు. వైఎస్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు 65 శాతం పూర్తి అయితే చంద్రబాబు పాలనలో 10 శాతం పనులు కూడా చేయలేదని ఆరోపించారు. ⇔ ప్రభుత్వం జీఎస్టీ, విద్యుత్ ఛార్జీలు పెంచడంతో గ్రానైట్ పరిశ్రమలు నిర్వీర్యమైనాయని చీమకుర్తి ప్రాంతానికి చెందిన గ్రానైట్ వ్యాపారులు జగన్‌కు తమ కష్టాలను చెప్పుకున్నారు. వైఎస్ కట్టిన రామతీర్థం ప్రాజెక్టు వల్లే గుక్కెడు నీళ్లు దొరుకుతున్నాయని చెప్పుకున్నారు. ⇔ చంద్రబాబు సర్కారు చెప్పినట్లు దొనకొండలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్కరికి ఉద్యోగం రాలేదని దర్శి ప్రాంత ప్రజలు జగన్ దృష్టికి తెచ్చారు. ⇔ వైఎస్ హయాంలో భవనాసి చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు నిధులు కేటాయించగా ఆయన మరణంతో పనులు నిలిచి పోయాయని, చంద్రబాబు దానిని పట్టించుకోలేదని అద్ధంకి వాసులు జగన్ దృష్టికి తెచ్చారు. ⇔ అధికార పార్టీ నేతలు పేదల భూములను, స్థలాలను కబ్జా చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పర్చూరు ప్రాంత వాసులు జగన్ దృష్టికి తెచ్చారు. ⇔ చేనేతల కష్టాలతో పాటు కాల్వల ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నామని చీరాల ప్రాంతవాసులు జగన్ దృష్టికి తెచ్చారు. తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జిల్లాలో మైలురాళ్లు ⇔ తొలిరోజు యాత్ర 1200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్ రామకృష్ణాపురం వద్ద మొక్కను నాటి వాకమళ్లవారిపపాలెం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ⇔ 1300 కిలోమీటర్లు యాత్ర పూర్తి అయిన సందర్భంగా నందమారెళ్ల వద్ద జగన్ మొక్కను నాటారు. ⇔ వైఎస్ జగన్ పాదయాత్ర 100వ రోజు సందర్భంగా చీమకుర్తిలో భారీ పైలాన్‌తో పాటు వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ⇔ మార్చి 3వ తేదిన దర్శి నియోజకవర్గంలోని కొర్రపాటివారిపాలెం క్రాస్ వద్ద జగన్ ఢిల్లీ ప్రత్యేక హోదా ధర్నాకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వాహన శ్రేణికి జెండా ఊపారు. ⇔ చివరి రోజు మార్చి 12న చీరాల నియోజకవర్గం ఈపూరుపాలెం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. -
నిన్నమొన్నలా.. పండు వెన్నెల!
ఆయన.. ప్రజాహితుడు..ప్రజల సంక్షేమం కోరే పథకుడు..జన సంకల్పానికి నిలువెత్తు రూపం..మహానేత రాజన్న ప్రతిరూపం..అభ్యాగులకు అభయం..అంతకంతకూ పెరుగుతోన్న ప్రజాభిమానంఅధికార పార్టీకదే అసహనంఅందుకే హత్యాయత్నం.. ఆగిన ప్రజాసంకల్పం..‘అనంత’లో పెల్లుబుకుతోంది ఆవేశంత్వరగా కోలుకోవాలనేది అందరి అభిమతంనాటి పాదయాత్రను తలచుకుంటోంది అభిమానగణంసంకల్పం నెరవేరాలని కోరుతోంది ప్రతి హృదయం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎండనక.. వాననక... అలుపెరుగక.. జనమే కుటుంబంగా.. ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్ప యాత్ర’కు నేటికి సరిగ్గా ఏడాది. అయితే ఇటీవల కొంతమంది చేసిన కుట్రలతో పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రజల కోసం చేపట్టిన ఈ పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగడాన్ని ‘అనంత’ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొందర్లోనే కోలుకుని తిరిగియాత్ర ప్రారంభించి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కాంక్షిస్తున్నారు. ‘అనంత’లో 24 రోజుల పాటు సాగిన జననేత పాదయాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. మనవడు.. మంచికోరే వాడు వైఎస్ జగన్మోహన్రెడ్డిది వైఎస్సార్ జిల్లా అయినప్పటికీ ‘అనంత’తో ఆయనకున్న అనుబంధం ఎనలేనిది. ‘అనంత’ మనవడే కాదు.. జిల్లా సమస్యలను ఆకళింపు చేసుకున్న జననేత. అందుకే ‘నేనున్నానని’ భరోసానిచ్చారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసిన ఆయన ఇక్కడి రైతుల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు దన్నుగా నిలవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఆత్మహత్యలు బూటకమని వ్యాఖ్యానించిన సీఎంకు వాస్తవాలను చూపించేందుకు ‘రైతుభరోసా యాత్ర’ చేపట్టారు. 5 విడతల్లో 32 రోజుల పాటు 82 రైతు కుటుంబాలను పరామర్శించారు. దేశచరిత్రలో ఓ రాజకీయనేత చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతన్నల ఇళ్లకే వెళ్లి బాధితులకు భరోసానిచ్చారు. ఆపై పాదయాత్ర పేరుతో మరో 24 రోజులు జిల్లాలో గడిపారు. ఇందులో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లోని 176 గ్రామాల్లో 278.6 కిలోమీటర్లు యాత్ర చేశారు. అనుకోని ముప్పుతో ఆగిన యాత్ర ‘అనంత’లో జగన్ అడుగిడిన 176 గ్రామాల్లో మహిళలు హారతిపట్టి, దిష్టితీసి, విజయ తిలకం దిద్ది ‘విజయోస్తు’ అని దీవించారు. యాత్రలో వేలాదిమంది మధ్య సాధారణ వ్యక్తిలాగా తిరిగేవాడు. ఎక్కడా, ఎవ్వరూ, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే నడిచే నమ్మకంలా...ప్రేమను పంచే శిఖరంలా...ఇంట్లో అన్నలా...ఆత్మబంధువులా కన్పిస్తారు. జగన్ ఆహార్యాన్ని చూస్తే శత్రువు కూడా ప్రేమిస్తాడు. అందుకే ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగలేదు. కానీ పక్కా ప్రణాళికతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో జగన్‌ను మట్టుపెట్టేందుకు హత్యాయత్నం చేయించారు. ఈ ఘటన యావత్ రాష్ట్రంతో పాటు జాతీయస్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన జగన్మోహన్రెడ్డి.. గాయం మానేవరకూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నేటితో యాత్ర ఏడాదికి చేరుతున్న సందర్భంలో ‘అనంత’ గుండెలు జగన్‌ను తలుచుకుంటున్నాయి. ఆయన చూపిన ప్రేమ.. పంచిన ఆప్యాయత.. ఇచ్చిన భరోసాను గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. జనహితం కోసం కష్టపడుతూ పాదయాత్ర చేస్తుంటే...ఆయన్ను చంపాలనుకున్నారా దుర్మార్గులు’ అని ఒకరు.. ‘జనాదరణ చూసి ఓర్వలేక పథకం ప్రకారం హత్యకు కుట్రపన్నారు.. అలాంటి వారి పాపం పండుతుంది’ అని మరొకరు వేదన పడుతున్నారు...కారకులపై మండిపడుతున్నారు. తుదిగా దేవుడి దయతో తొందరల్లోనే కోలుకుని తిరిగి ప్రజల్లోకి వచ్చి యాత్ర చేయాలని కాంక్షిస్తున్నారు. స్వయంగా చూసి.. చలించి ‘ఓదార్పుయాత్ర’తో వైఎస్ రాజశేఖరరెడ్డిని.. ఆయన కుటుంబాన్ని ‘అనంత’ ఎలా ఆదరిస్తుందో పల్లెగడపలు తొక్కి తెలుసుకున్నారు. పదిమందికి అన్నంపెట్టే అన్నదాతలు.. తాము పస్తుండి ఎలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారో.. ఓ విపక్షనేతగా ‘రైతు భరోసా యాత్ర’తో వాస్తవాలను తెలుసుకుని చలించిపోయారు. ప్రభుత్వ మోసపూరిత మాటలతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ముసలీ ముతక అనే తేడా లేకుండా అన్ని వర్గాలు దగాపడిన తీరును.. తనపై ప్రజలు పెట్టుకున్న ఆశలను ‘ప్రజాసంకల్పయాత్ర’లో అర్థం చేసుకున్నారు. అందుకే అనంత ప్రజానీకం ఆయన పట్ల అంత అభిమానం చూపుతోంది. రూ.కోట్లు పెట్టినా కొనలేని అభిమానం ప్రజాసంకల్పయాత్ర వాస్తవానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరగలేదు. కానీ అక్కడున్న వారంతా ఎక్కడోచోట జగన్మోహన్రెడ్డిని చూసి సంబరపడ్డారు. రాజన్న బిడ్డను కళ్లారా చూసి దీవించారు. ఈ క్రమంలోనే కుందుర్పికి చెందిన ఇద్దరు మహిళా కూలీలు కదిరి వరకూ వచ్చి జగన్‌ను కలిసి చేతిలో ఓ మూటపెట్టారు. ‘అన్నా! రోజు కూలికి వెళ్లి కొంత చిల్లర పోగు చేశాం. మీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. తీసుకో అన్నా’ అన్నారు. రూ.కోట్లు కుమ్మరించినా కొనలేని వీరి అభిమానానికి జగన్ కళ్లు చెమర్చాయి. ఇలాంటి అభిమాన, అనుభవాల మూటలెన్నిటినో ఇక్కడి నుంచి విజయం నగరం దాకా తనతో తీసుకెళ్లారు అలుపెరుగని బాటసారి. -
కుట్ర చీకట్లను చీల్చుకుంటూ సంకల్ప వెలుగులు
జగన్ వజ్ర సంకల్పానికి నేటితో ఏడాది. టీడీపీ ప్రభుత్వంఏర్పడినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.బాధిత ప్రజానీకానికి అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు చేస్తున్న ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన సంకల్పయాత్ర గతేడాది డిసెంబర్ 28న జిల్లాలో ప్రవేశించింది. తంబళ్లపల్లె నుంచి సత్యవేడు నియోజకవర్గాల వరకూ 23 రోజుల పాటు సాగింది. అడుగడుగునా జనంతో జగన్ మమేకమయ్యారు. చిన్నా పెద్దా.. పేదాగొప్పా.. కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరి కష్టాలను ఆయన తెలుసుకున్నారు. కష్టాలు కొన్నాళ్లేనని భరోసానిచ్చారు. జననేత పలకరింపులతో జనం మురిసిపోయారు. రాజన్నను తలచుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజాపక్షాన నిలిచిన జననేతపై హత్యాయత్నం జరగడాన్నిజిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలే ఈ కుట్రలో ఉన్నారంటూ వారు మండిపడుతున్నారు. ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకుని తమ మధ్యకు రావాలని ప్రజలంతావేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. చిత్తూరు, సాక్షి: ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయింది. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర మరో మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన పాదయాత్రను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నవరత్నాల గురించి జగన్ చేసిన ప్రచారాన్ని చెప్పుకుంటున్నారు. ఇంట్లో మనిషిగా కలిసిపోయిన వైనాన్ని తలచుకుంటున్నారు. అవ్వాతాతలు, వికలాంగులు కలవడానికి వచ్చినపుడు కింద కూర్చొని సమస్యలు వినడం, ఆప్యాయంగా పలకరించడం గురించి చర్చించుకుంటున్నారు. అక్క చెల్లెళ్లు ఎదురైనప్పుడు పిల్లల్ని బాగా చదివించాలనిసూచించడం, ఉద్యోగులు ఎదురైనప్పుడు ప్లకార్డులు పట్టుకొని వారి భరోనివ్వడంపై ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. నవరత్నాలపై సర్వత్రా హర్షం.. జగన్ ప్రకటించిన నవరత్నాలపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అవ్వతాతల పెన్షన్ రూ.2 వేలు, వికలాంగుల పెన్షన్ ఇస్తామని చెప్పడం వారిని ఆనందపరుస్తోంది. ఇతరులపై ఆధారపడకుండా జీవిస్తున్న వారికి ఈ హామీ ఊరట కలిగిస్తోంది. రుణమాఫీ హామీ నమ్మి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ‘వైఎస్సార్ రైతు బీమా’ పథకం వారికి స్వాంతన కలిగి స్తోంది. పాడి రైతులకు రూ.4 రాయితీ ఇస్తామని ప్రకటన జిల్లాలోనే చేశారు. ఈ పథకం వల్ల జిల్లాలో ఉన్న 15 లక్షల మంది పాడిరైతులకు మేలు జరుగుతుంది. చేనేతలకు కూడా వైఎస్సార్ బీమా వర్తింపజేస్తామనే ప్రకటన చేనేతల్లో ఆనందం నింపింది. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల రుణాలు ఎంత ఉంటుందో.. అంతే మొత్తం అధికారంలోకి రాగానే నేరుగా చేతికి ఇస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేల పెన్షన్ ఇస్తామన్నారు. మద్య నిషేధంతో గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతామన్నారు. సదుంలో బహిరంగ సభలో జగన్ ఆర్టీసీ కార్మికులకు పెద్ద వరం ఇచ్చారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఇప్పటికీ ఆ వర్గాల్లో చర్చనీయాశంగా ఉంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే మొదటి అసెంబ్లీలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పారు. కోలుకోలేని స్థితిలో టీడీపీ.. జగన్ పాదయాత్రతో జిల్లాలో టీడీపీ రాజకీయంగా బాగా దెబ్బతింది. పాదయాత్ర ప్రభావంతో కుప్పం, పలమనేరు, తిరుపతి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, మదనపల్లె, సత్యవేడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ఆ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లా మంత్రి సైతం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. కుప్పంలో మెజారిటీ నిలుపుకునేందుకు చేయని టీడీపీ ప్రయత్నం అంటూ లేదు. తట్టుకోలేకపోతున్న జనం.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఎండావానను సైతం లెక్క చేయకుండా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి జగన్‌పై హత్యాయత్నం జరగడంతో జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కష్టాలు తెలుసుకోడానికి వచ్చిన పేదల మనిషే ఇప్పుడు కష్టాల్లో ఉండటంతో వారు విలవిల్లాడుతున్నారు. హత్యాయత్నం తరువాత జగన్‌పై జరుగుతున్న రాజకీయాలపై జిల్లా జనం తట్టుకోలేకపోతున్నారు. ‘సోనియా దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరూ జగన్‌ను కష్టపెట్టే పనులే చేస్తున్నారు. నేరుగా ఢీకొట్టే పసలేని వాళ్లు జగన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. జగన్ అభిమన్యుడు కాదు. అర్జునుడు. ఎన్ని కష్టాలు పెట్టినా నిలదొక్కుకునే శక్తి ఉంది. ప్రతి కుటుంబానికీ రాజన్న మేలు చేశారు. వారి దీవెనలే జగన్‌ను కాపాడతాయని’ కురుబలకోటకు చెందిన రాజమ్మ అన్నారు. సంకల్పం నెరవేరే వరకూ నా దీక్ష ఆగదు.. మా కుటుంబమందరికీ వైఎస్ అంటే ఎంతో ఇష్టం. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎం కావాలనేది మా కోరిక. అది జరిగే వరకూ నేను పాదాలకు చెప్పులు వేసుకోను. ఒంటిపై చొక్కా కూడా ధరించేది లేదు. గడ్డం, తల వెంట్రుకలు తీయకూడదని నిశ్చయించుకున్నాను. ఈ విషయం పోటుకనుమలో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. కక్షతో నా రేషన్‌కార్డు తొలగించారు. మండల అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు చెప్పినా ఏమాత్రమూ పట్టించుకోలేదు. అదే మండలం చింతమాకులపల్లెలో ప్రస్తుతం ఉం టున్నాను. ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్ వెంట చిత్తూరు, కడప, తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాల్లో 350 కిలో మీటర్లు నడిచాను. ఆయన స్పర్శతో బాధలు, కష్టాలు మరిచిపోయాను. జగన్‌తో పాదయాత్రలో పాల్గొన్న తర్వాత మండల అధికారులకు తెలిసి రేషన్‌కార్డు ఇస్తాం, పింఛన్ ఇస్తాం అంటూ వచ్చారు. అయినా తీసుకోలేదు. జగన్ సీఎం అయ్యాకే పింఛన్, రేషన్ తీసుకుంటాను.– దేవేంద్రస్వామి, పోటుకనుమ, పూతలపుట్టు మండలం భరోసా ఇచ్చిన యాత్ర వైఎస్ జగన్మోహన్రెడ్డి యాత్ర ఏడాది పూర్తి చేసుకోనుంది. ఏడాది పాటు ఆయన జనంతోనే మమేకమై సమస్యలను తమ సమస్యలుగా భావించి భరోసా ఇస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ అరాచకాలను ప్రజలు పంటిబిగువున భరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి జగన్ హామీలు సంతృప్తినిచ్చాయి. వారిలో భవిష్యత్‌పై భరోసా లభిం చింది. ఇలాంటి తరుణంలో ఆయనపై దాడి చేయిం చడం బాధాకరం. త్వరలోనే జగన్మోహన్రెడ్డి కోలు కుని తమ యాత్రను కొనసాగించాలి.–శివకృష్ణయాదవ్, ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ప్రజా కోర్టులో శిక్ష జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జగన్‌పై హత్యయత్నం చేశారు. వీరు ప్రజా కోర్టులో శిక్ష అనుభవించాల్సిందే. జగన్‌పై హత్యాయత్నం జరిగింది అంటే నేను నమ్మలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సెల్ఫోన్లలో చూపిస్తే షాక్‌కు గురయ్యాను. – శ్రీరామిరెడ్డి, రిటైర్డ్ టీచర్,విఠలం, వాల్మీకిపురం మండలం. -
మాట తప్పని కుటుంబం
-
జగనన్నా నువ్వే మా ధైర్యం!
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. నాడు... ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న చేపట్టిన పాదయాత్ర 1,470 కిలోమీటర్లు కొనసాగింది.. ఆ యాత్ర నుంచే ‘ప్రజా మానిఫెస్టో’ రూపుదిద్దుకుని... రైతును రాజు చేసింది... నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించింది... అన్నివర్గాల ప్రజలకు మేలు చేసి కోట్లాది మంది గుండెల్లో ‘మహానేత’ను కొలువుదీరేలా చేసింది... ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇప్పటికే 3200 కిలోమీటర్లుకు పైగా కొనసాగింది... ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది.. స్వార్థ రాజకీయాల కుట్రలకు బలై కాస్త విరామం తీసుకుంది.. అంతేకానీ ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఇసుమంత కూడా తగ్గించలేకపోయిందంటూ భావోద్వేగానికి లోనైన ఓ అభిమాని పంచుకున్న భావాలివి.. అన్నా, ప్రజాసంకల్ప పాదయాత్రలో నువు నడవడం మొదలు పెట్టి 1 సంవత్సరం అయ్యింది. మాకోసం రాళ్లూ, రప్పలు లెక్క చేయకుండా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నావ్. నాకు తెలుసన్నా. ఈ నడక ఎంత కష్టమో? నాకు తెలుసన్నా ఈ యాత్ర ఎట్టాంటి యాతనో? ఎందుకంటే పేదోడికి ఏది కావాలన్నా ఈ కాళ్లను నమ్ముకునే పోవాలి గదన్నా? అందుకే నీ కష్టం మాకు తెలుసు. మైళ్లకు మైళ్లు నడిచి ఎళ్లి పింఛన్ కోసం పడిగాపులు కాచిన ముసలయ్య కాళ్లకు నీ కష్టం తెలుసు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక టాంకర్ల దగ్గర బిందెలు మోసే చెల్లెమ్మలకు తెలుసు నీ పాదాలు మోసే బరువెంతో. ఒక్క సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే కుర్రోళ్లకు తెలుసు కాళ్లరిగిపోవడం అంటే ఏమిటో? లక్షల ఫీజులు కట్టలేక ప్రైవేటు బళ్లలో బెంచెక్కి నిలబడే పిల్లగాళ్లకు తెలుసు ఆ కాళ్లకెంత కష్టమో? అందుకే అన్నా నువ్వొచ్చే ప్రతి చోటా మేము పూలు జల్లుతున్నాము. తాహతు ఉంటే పట్టుచీరలే పరవాలనుకుంటున్నాము. ఎందుకంటే మా కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు అప్పుడు మీ అయ్య వచ్చాడు...ఇలాగే..అచ్చం ఇలాగే.. గడపగడపకూ వచ్చి పలకరించాడు. గుండె గుండెనూ తాకి ధైర్యమిచ్చాడు. ఇప్పుడు నువ్వూ అంతే. నా వాళ్లంటూ ఆదరిస్తున్నావు. నీ సంగతి మరచి మాకోసమే పరితపిస్తున్నావు. మా కన్నీళ్లు తుడుస్తున్నావు. మా చెమటను తాకుతున్నావు. మా కష్టాన్ని వింటున్నావు. మాకు ఓదార్పు అవుతున్నావు. అందుకే అన్నా నీ కష్టం మా కష్టంగా ఉంది. నీ భుజానికి గాయమైతే మా గుండెకు నొప్పేసింది. నీ అడుగులు నువు కోరిన గమ్యం వైపు సాగాలన్నా? అందుకు మా అందరి సహకారం ఉంటుంది. నీ గెలుపే మా కష్టాలను తీర్చే మలుపు అని నమ్ముతున్నాం అన్నా. మాకై నడిచి వస్తున్న నీ పాదాలకు పట్టాభిషేకం చేస్తామన్నా... జగనన్నా నువ్వే మా ధైర్యం. నువ్వే మా ఆశాకిరణం. ఇట్లు నీ ప్రియమైన అభిమాని -
కష్టసుఖాలు తెలుసుకుంటూ..భరోసా కల్పిస్తూ..
-
సంకల్పానికి ఏడాది
-
జననేత వస్తాడని.. జనమంతా కనులై!
వైఎస్ రాజశేఖరరెడ్డి... 2003 నాటికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కనీవినీ ఎరుగని కరువుకాటకాలు! తెలుగు నేల అతలాకుతలమైన విపత్కర పరిస్థితులు! ఇలాంటి పరిస్థితుల్లో కర్షక, కార్మిక, బడుగు వర్గాలను పలకరించి ఉపశమనం కల్పించాలని నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం మొదలైంది. 2003 ఏప్రిల్ 9న ప్రారంభమైన ఈ యాత్ర 68 రోజుల పాటు 1,470 కి.మీ. దూరం సాగింది. అడుగడుగునా ప్రజల కష్టాలు చూస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఈ పాదయాత్ర జిల్లాలోని ఇచ్ఛాపురంలో 2003 జూన్ 15వ తేదీన ముగిసింది! వైఎస్ షర్మిల... 2012 నాటికి ప్రతిపక్షం టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను మరింత కష్టపెడుతున్న వైనం! జననేతగా ఎదుగుతున్న రాజన్న తనయుడు జననన్నను నేరుగా ప్రజల్లో ఎదుర్కోలేక అక్రమంగా కేసులు బనాయించిన కుతంత్రం! పద్నాలుగు నెలల పాటు బయటకు రానీయకుండా బంధించిన దుర్మార్గం! ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి వైఎస్సార్ ఆశయాలే ప్రాణంగా... జగనన్న వదిలిన బాణంగా... ప్రజల తోడుగా ప్రజల సాక్షిగా ప్రజల కోసం వైఎస్ షర్మిల తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర! అదో సంచలనం! 2012 అక్టోబరు 18న వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద నుంచి మొదలైన ఈ పాదయాత్ర 14 జిల్లాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3,112 కి.మీ. పాటు కొనసాగి ఇచ్ఛాపురంలోనే 2013 ఆగస్టు 4న ముగిసింది! వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఆరొందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా దోపిడీలతో పాలన చేస్తున్న వేళ! విభజనతో గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెడతానని చెప్పిన నేతలు మాటమార్చి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న నేపథ్యంలో ‘అన్న వస్తున్నాడు’ అని భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టినదే ప్రజాసంకల్ప యాత్ర! 2017 నవంబరు 6వ తేదీన వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఈ మహాకార్యం ప్రారంభమై నేటికి ఏడాది అయ్యింది. 12 జిల్లాల్లో 294 రోజుల పాటు 3,211.5 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ప్రజల జయజయధ్వానాల మధ్య జననేత మరో కొద్దిరోజుల్లో సిక్కోలు జిల్లాలో అడుగుపెడతారనగా పిడుగులాంటి వార్త! గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర కోసం సిక్కోలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో, పచ్చపార్టీ ప్రజాప్రతినిధుల పక్షపాత పాలనలో, జన్మభూమి కమిటీల అరాచకాలతో ప్రజలు విసిగివేశారిపోయారు. జగన్ జిల్లాలో అడుగుపెట్టగానే తమ కష్టాలను ఆయనకు వినిపించాలని, తమ భవిష్యత్తుకొక భరోసా పొందాలని ఆశిస్తున్నారు. ఒక దుండగుడి హత్యాయత్నంతో గాయపడిన తమ జననేత సత్వరమే కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు చేశారు. శాంతియాత్రలు చేశారు. ఆయన ఆరోగ్యం కోసం పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. వాస్తవానికి జగన్‌పై హత్యాయత్నం జరగకపోతే ఈ దీపావళికే ఆయన సిక్కోలు జిల్లాలో అడుగుపెట్టి ఉండేవారు. వైద్యచికిత్స తర్వాత డాక్టర్ల సూచనలతో తాత్కాలిక విరామం ఇచ్చినా త్వరలోనే పునఃప్రారంభమవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమస్యలపై సంపూర్ణ అవగాహన... ‘రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతంగా ఏడాది పాతయాత్ర చేశారు. హత్యాయత్నం దురదృష్టకరం. పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలు తెల్సుకున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా మంచి పాలన అందించేందుకు పాదయాత్రలో గుర్తించిన సమస్యలు దోహదపడతాయి. రాష్ట్రంలో చివరి దశకు చేరిన సంకల్పయాత్ర తప్పకుండా విజయవంతంగా పూర్తవుతుంది.’ – పి.రాజమనోహర్, విద్యార్థి,డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి జగన్... ‘రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి యువనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సుమారు ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం అందరి లక్ష్యం. ఇలాంటి నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు. –పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రజాసమస్యలు తెలుసుకోవడంవల్ల ప్రయోజనాలు... ‘ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర వల్ల ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సమస్యలు తెలుకున్నాక, ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో నవరత్నాలు ప్రకటించారు. ప్రస్తుతం పాదయాత్ర అంటే ఇది ఒక్క యజ్ఞం వంటిది. ప్రజల సమస్యలు తెల్సిన నాయకుడే ప్రజలకు మేలుచేయగలరు.’ – ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, పూర్వపు ఇన్చార్జి వీసీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం. -
ప్రజల ఆశాజ్యోతి జగన్
ఓ ప్రజానాయకుడు అనేక ప్రతికూల రాజకీయ పరిణామాలు ఎదురుర్కొంటూ సంవత్సరం పాటు జరిపిన ప్రజాసంకల్పయాత్ర భారతదేశ రాజకీయ చిత్రపటంలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గది. వైఎస్ కుటుంబం ప్రజా సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు చేయడం మనం గమనించాం. అదే కుటుంబం నుంచి నేడు జననేత జగన్ రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం లిఖించారు. తన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగి సమకాలీన రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. పాదయాత్రలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించక ముందు చంద్రబాబు శాసనసభను తన నియంతృత్వ పోకడతో ఒక నిర్జీవమైన సభగా మార్చుకున్నారు. శాసనసభ్యులను కొనుగోలు చేశారు. వ్యవస్థలన్నింటినీ భ్రష్ట్పుట్టించారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల్లో అవినీతి వరదలై పారింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించేవారిని నిర్భందిస్తున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా దోపిడీకి పూనుకున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. ప్రతిపక్షనేతగా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ ఒక పరిపక్వత కలిగిన నేతగా తన రాజకీయ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ప్రజలకు జగన్ ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. తమను కష్టాల నుంచి నవరత్నాల ద్వారా గట్టెక్కించగలరని నమ్ముతున్నారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న తెలుగుదేశం నేతలు జగన్‌పై హత్యాయత్నం కుట్ర చేశారు. జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ దాడి. ఈ దాడికి చంద్రబాబుగారే బాధ్యత వహించాలి. ఒక ముఖ్యమంత్రిగా బాబు ఈ ఘటనపై స్పందించిన తీరు ప్రజాస్వామిక వ్యవస్థకు సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం జగనే దాడి చేయించుకున్నాడని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేయడం నీచాతినీచం. వారి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పతనావస్థకు అద్దం పడుతుంది. చంద్రబాబు వెకిలి నవ్వులు సినిమాలోని క్రూరమైన విలన్‌లాగా ఉన్నాయి. పాదయాత్రలో ప్రజలు జగన్‌కు జేజేలు పలకడం చంద్రబాబు భరించలేకపోయారు. కుట్రతో జగన్‌ను భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి వ్యూహం పన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై నేటికీ ప్రజల్లో అనుమానాలు బలంగా ఉంది. నేడు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులే నాడు వైఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి. ఆ శక్తులు మరోరూపంలో ఆంధ్రప్రదేశ్‌లో సమీకృతం అవుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంపై లోతుగా పరిశోధించి దోషులను శిక్షించాలి. థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని చేస్తున్న పోరాటం విజయవంతం కావాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఒక బలమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక రకంగా చంద్రబాబు గారికి బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేక.. బాధ్యత మరిచి ఆయన్ను బలపరుస్తూ పగలును రాత్రిగా, ఎండలను నీడగా, చీకటిని వెలుతురుగా చూపించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం, చంద్రబాబును స్థాయికి మించి మోయడం ఒక చీకటి అధ్యాయం. ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎల్లో మీడియా కుట్రలను, కుతంత్రాలను అర్థం చేసుకుంటున్నారు. రాజకీయ ప్రజాక్షేత్రంలో ఈ శక్తులకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు. - ఇమామ్, కదలిక ఎడిటర్ -
నడుస్తున్న చరిత్ర
ఆ సంకల్పానికి ఏడాది పూర్తవుతోంది. ఆ అడుగు వెంట వేలాది అడుగులు అనుసరించాయి. లక్షలాది మంది ఆశీస్సులు లభించాయి. ప్రజాకంటక పాలనను అంతమొందించేందుకు... బడుగుల సంక్షేమానికి... భవిష్యత్తులో చేపట్టాల్సిన సంస్కరణలకు... అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జననీరాజనం లభించింది. అభిమానుల ఆశీస్సులే ఆలంబనగా... జనం ఇచ్చిన ఉత్సాహమే ఊపిరిగా ఇప్పటికే 3,200 కిలోమీటర్లు దాటింది. ఈ సుదూర ప్రయాణంలో పలు చారిత్రక ఘటనలకు విజయనగరం జిల్లా వేదికగా నిలిచింది. జిల్లాలో అడుగుపెడుతూనే 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇంతలోనే కుట్రలు ఊపిరి పోసుకున్నాయి. జననేతను అంతమొందించేందుకు పథక రచన సాగింది. కానీ అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కోలుకుంటున్న ఆయన మళ్లీ జిల్లాలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి, ప్రజాక్షేత్రంలోనే ఉండి జనం సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి మంగళవారానికి ఏడాది పూర్తవుతోంది. నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దివ్య ఆశీస్సులు అందుకుని తొలి అడుగువేసిన జగన్ 11 జిల్లాల్లో 168 రోజులపాటు పాదయాత్ర చేసి 12వ జిల్లా అయిన విజయనగరంలో 169వ రోజు అడుగుపెట్టారు. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకుఎస్ కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం, చింతలపాలెంలో ప్రవేశించిన జననేతకు విజయనగరం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్న విరామ సమయానికి దేశపాత్రునిపాలెం చేరుకున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఆ చారిత్రక ఘట్టానికి చిహ్నంగా ఆ రోజు దేశపాత్రునిపాలెంలో స్తూపాన్ని జగన్ ఆవిష్కరించారు.అదే రోజు కొత్తవలసలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించి తొలిరోజే జిల్లాలో పెను ప్రభంజనాన్ని సృష్టించారు. ఇంకా గుర్ల మండలం ఆనందపురం వద్ద 3,100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగుపేటవద్ద 3,200 కిలోమీటర్ల దూరాన్ని సైతం జిల్లాలోనే అధిగమించారు. ప్రతిసభా ప్రభంజనమే... జిల్లాలో నిర్వహించిన ప్రతిసభా ప్రభంజనమే అయింది. అక్టోబర్ 1వ తేదీన విజయనగరం మూడు లాంతర్ల వద్ద బహిరంగలో విజయనగరం శాసన సభ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించారు. అక్కడి నుంచి నెల్లిమర్ల నియోజకవర్గానికి చేరుకుని అక్టోబర్ 3వ తేదీన అక్కడి మొయిద జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో అడుగిడిన జననేత అక్కడి గుర్ల జంక్షన్లో అక్టోబర్ 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గజపతినగరంలో అక్టోబర్ 10వ తేదీన అన్నదాతలకు వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. బొబ్బిలిలో అడుగుపెట్టిన జగన్ అక్కడ అక్టోబర్ 17వ తేదీన జరిగిన బహిరంగ సభలో బొబ్బిలి రాజులను చీల్చి చండాడారు. తాండ్రపాపారాయుడి పౌరుషాన్ని గుర్తుచేసి పదవుల కోసం పార్టీమారిన బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావుపై నిప్పులు చెరిగారు. అక్కడి నుంచి సాలూరు నియోజకవర్గం చేరుకున్న జగన్‌కు అక్టోబర్ 22వ తేదీన అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అడుగడుగునా నీరాజనం జిల్లాలో జననేతకు అడుగడుగునా జననీరాజనం లభించిం ది. ఆయన పాదయాత్ర ఎస్ కోట నియోజకవర్గం లో మొదలై సాలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టి 213.3 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పార్వతీపు రం, కురుపాం నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేసుకుని శ్రీకా కుళం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. పాదయాత్రలో అనేక వర్గాల ప్రజలను నేరుగా కలుస్తున్నారు. కార్మికులు, కర్షకులు, కాం ట్రాక్టు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు, కళాకారులు, చేనేత కార్మికులు, వృత్తికళాకారులు ఇలా లక్షలాది మంది సమస్యలు తెలుసుకున్నారు. వారి కన్నీళ్లను తుడుస్తున్నారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మరో సీనియర్‌నేత పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు జగన్ పాదయాత్రను జిల్లాలో విజయవంతం చేయడానికి శ్రేణులను సమాయత్తం చేస్తూ జగన్ వెంట నడుస్తున్నారు. జననేతపై దూసిన కత్తి అన్నా అన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న జగన్ అక్టోబర్ 25వ తేదీన 294వ రోజు మక్కు వ మండలంలో ఉదయం పాదయాత్ర చేసి విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. ఎయిర్‌పోర్టు, వీఐపీ లాంజ్‌లో వేచి ఉన్న జననేతపై శ్రీనివాసరావు అనే దుర్మార్గుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ జగన్‌కు హైదరాబాద్ వెళ్లిన వెంటనే వైద్యులు తొమ్మిది కుట్లు వేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొద్ది రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. త్వరలో జిల్లాలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయన సంకల్పం గొప్ప ది. అలుపెరని పాదయాత్ర చేస్తున్న జగనన్న దీపావళి అనంతరం కారు చీకట్లను చీల్చుకుంటూ వేకువ సూరీడై మన ముందుకు వస్తున్నారు. జనం కన్నీళ్లు తుడిచే వెళతారు. రాజన్నబిడ్డపై హత్యాయత్నమా.. జననేత జగన్‌పై దాడి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాం. ఈ మధ్యనే ఆయన్ను కలిసాం. చిన్నవాడైనా సమస్యలను చాలా విపులంగా ఓపిగ్గా అ డిగి తెలుసుకుని మన ప్రభుత్వం వస్తే పరిష్కరిద్దాం అన్నారు. ఆయన మాటలే మాకు గుర్తుకు వచ్చాయి. అది చాలా దారుణమైన సంఘటన. మానవత్వం ఉన్నవారంతా దీనిని ఖండించాలి. దీనిపై సమగ్ర విచారణ జరపాలి. – అడబాల కృష్ణారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం ఆయన అండగా జనం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న జననేతపై హత్యాయత్నం జరిగిందని తెలిసి తల్లడిల్లిపోయాం. పెద్దలహస్తం లేకుండా ఓ సాధారణ వ్యక్తి అంతటి సాహసం చేయలేదు. ఆ వెనకనున్నవారెవరో బయటకు రావాలి. బొబ్బిలిలో నిర్వహించిన యాత్రలో ఎన్సీఎస్ పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు, చెరకు రైతుల సమస్యలు తీర్చాలని వినతి పత్రాన్ని సమర్పించాం. మాతో ఆయన ఎంతో చక్కగా మాట్లాడారు. ఓపికగా మా సమస్యలు విన్నారు. వెంటనే ఆయన కోలుకుని మా ప్రాంతానికి రావాలని కోరుకుంటున్నాం.– ఆర్.వి.కిశోర్, ఎన్సీఎస్ కార్మిక సంఘం నాయకుడు జగనన్నపై అఘాయిత్యంపై తట్టుకోలేకపోయా జగనన్నపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. గతనెల 25వ తేదీ అన్నను కలిసి, మన ప్రభుత్వం వచ్చినవెంటనే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరాను. అందుకు అలాగే చెల్లమ్మా అంటూ ఎంతో ఆత్మీయంగా హామీ ఇచ్చారు. అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి అఘాయిత్యమా...– నిర్మల, మక్కువ -
ఘన చేతనమై.. జనకేతనమై..
సడలని సంకల్పం... ఒక్కో అడుగులో వజ్ర సంకల్పం...జనం వ్యధను హృదయంతో అధ్యయనం చేస్తూ, వారి బతుకు గతుకులను మథిస్తూ సాగిన ఆ పాదం వెనుక లక్షల పాదాలు కదం తొక్కాయి. ఒక్కో జిల్లా సరిహద్దు దాటుకుంటూ ప్రభంజనంలా మున్ముందుకు దూసుకుపోతున్న ఆ వేగాన్ని అడ్డుకోడానికి ఎన్నో అడ్డంకులు. మరెన్నో ప్రతిబంధకాలు.. అయినా ‘కదం తొక్కుతూ...పదం పాడుతూ... పదండి పోదామంటూ మహా సంకల్ప యాత్రకు లక్షలాదిగా జనం ఎదురొచ్చి నీరాజనాలు పట్టిన తీరు పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఆ కర్కశులు చివరికి హత్యాయత్నానికే బరితెగించారు. అయితే జనలోకం కన్నెర్ర చేసి శాంతియుతంగానే నిరసించింది.మళ్లీ ఆ నేత అడుగుల సవ్వడి కోసం ఎదురు చూస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘పచ్చ’దనం సాక్షిగా రాష్ట్రంలో నాలుగేళ్లుగా అవినీతి, అరాచకం, అక్రమాలు రాజ్యమేలుతున్న వేళ.. రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాలను పాలకులే మంటగలుపుతున్న వేళ.. జన్మభూమి కమిటీలతో స్థానిక ప్రజాప్రతినిధుల హక్కుల్ని హరిస్తున్న వేళ.. అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల వంటి సంక్షేమ పథకాల అమలులో రాజకీయ వివక్ష పాటిస్తున్న వేళ.. రుణమాఫీపై రైతులు, మహిళల జీవితాలతో ప్రభుత్వం దుర్మార్గపు ఆట ఆడుతున్న వేళ.. మొత్తంగా జనసంక్షేమాన్ని తుంగలో తొక్కిన వేళ.. తెలుగుదేశం ప్రభుత్వ దౌష్ట్యాన్ని దునుమాడుతూ.. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న అన్ని వర్గాల ప్రజల్లో నవచైతన్యాన్ని నింపడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమై మంగళవారానికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంగా ఆ జననేత నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదం పల్లెపల్లెనూ తాకింది. ఆయన పలుకు జనం గుండెల్లో ధైర్యాన్ని నింపింది. ఓటేసి గెలిపించిన ప్రభుత్వం తమను ఎలా విస్మరించిందో, వివక్షకు గురి చేస్తోందో పాదయాత్ర సందర్భంగా జననేతకు జనం చెప్పుకున్నారు. హామీలు నమ్మి మోసపోయామంటూ గోడు వెళ్లబోసుకున్నారు. పేదలపై కనికరం లేకుండా పాలన సాగిస్తున్న ప్రభుత్వాధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. నిండా మునిగిన తమను ఆదుకోవాలని వేడుకున్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కూలీలు, చిరుద్యోగులు, వలస కార్మికులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలూ సమస్యలు చెప్పునే వేదికలా జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సాగింది. జనం పెట్టుకున్న ఆశలకు తగ్గట్టుగానే జననేత జనం గోడును ఓపిగ్గా విన్నారు. వారి సమస్యలపై అధ్యయనం చేశారు. పేదలకేం చేయాలో శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి చరిత్రలో నిలిచిపోయే పథకాలను రూపొందించారు. ‘నవరత్నాలు’ పేరుతో వాటిని ప్రజలకు వివరించారు. పాలకపక్షం పట్టించుకోకపోయినా ప్రతిపక్ష నేత తమకోసం ఆలోచిస్తున్నారని, శ్రమిస్తున్నారన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. ఇంకేముంది! జననేత పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలిరాసాగారు. పల్లె, పట్టణం, నగరం.. ఎక్కడికి వెళ్లినా జనమే జనం. పాదయాత్రలో జ్వరమొచ్చినా జనం సమస్యలు వింటూనే పాదయాత్రను కొనసాగించారు. మొత్తంగా పాదయాత్రకు జనం నీరా‘జనం’ పలికారు. ఈ ప్రభంజనం చూసిన పాలకపక్షం గుండెల్లో రైళ్ళు పరుగెత్తనారంభమైంది. జనం మధ్యలో ఏమీ చేయలేక విశాఖలో కుట్ర పన్నారు. కత్తితో హత్యాయత్నానికి ఒడిగట్టారు. ప్రజల ఆశీశ్సులు, దేవుని దయ వల్ల జననేతకు ముప్పు తప్పింది. కుట్ర కాస్తా భగ్నం కావడంతో కుట్రదారులు తేలుకుట్టిన దొంగలయ్యారు. అభిమానే దాడి చేశారంటూ కట్టుకథను అల్లారు. జనం నమ్మకపోవడంతో వెకిలి చేష్టలకు బరితెగించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్న చందాన జననేత మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనం మధ్యలో చిరునవ్వు చిందిస్తూ ఆప్యాయతతో కూడిన పలకరింపు కోసం వేచి చూస్తున్నారు. ‘తూర్పు’న జననేత అడుగులు సాగాయిలా.. పాదయాత్ర ప్రారంభమై ఏడాది కాలమైంది. జూన్ 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి జననేత ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జగన్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. లక్షలాదిగా జనాలు తరలివచ్చి ‘తూర్పు’లోకి జననేతను తోడ్కొని వచ్చారు. అక్కడి నుంచి ఏకధాటిగా అలుపెరగనివిధంగా పాదయాత్రీకుడు ముందుకు సాగారు. కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్బేధ్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అరుదైన మైలురాళ్లు అధిగమించారు. 2400, 2500, 2600, 2700 కిలోమీటర్ల మైలురాళ్లను దాటి చరిత సృష్టించారు. 200వ రోజు కూడా ఇక్కడే పూర్తి చేసుకున్నారు. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే ప్రత్యేక హోదా కోసం జూలై 24వ తేదీన బంద్ నిర్వహించారు. ఆ సమయానికి పెద్దాపురంలో ఉన్న జగన్ పాదయాత్రకు విరామమిచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. జిల్లాలో ఊహించినదానికంటే అధికంగా పాదయాత్రకు జనాభిమానం వెల్లువెత్తడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టించింది. భరోసా ఇచ్చారిలా. ♦ దారీతెన్నూ లేని, నాటు పడవలే దిక్కైన గోదావరి లంక వాసుల వ్యధను తెలుసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ప్రజల కష్టాలు విని, ఆయా గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ♦ ఒక్కొక్కరికీ ఇంటి నిర్మాణానికి అయ్యే రూ.3 లక్షల రుణభారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. ♦ ప్రభుత్వోద్యోగులందరికీ ఇంటి స్థలమిచ్చి సొంతిళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ♦ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి సకాలంలో డీఏలు ఇస్తానన్నారు. ♦ దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. ♦ కాకినాడ రూరల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, డీజిల్‌పై సబ్సిడీ పెంచుతానని, కొత్త బోట్లకూ రిజిస్ట్రేషన్ చేయిస్తానని, ఫిషింగ్ హాలిడే సమయంలో ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచుతామని, ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలు, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చారు. ♦ ఖాళీగా ఉన్న లక్షా 42 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు గ్రామ సచివాలయాల ద్వారా మరో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ♦ యానిమేటర్లకు ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తానని ప్రకటించారు. ♦ కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ♦ చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేలు ఇస్తామని, ఆప్కోలో మార్పులు తీసుకొచ్చి చేనేతకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని చెప్పారు. ♦ గతంలో భూములిచ్చి, తక్కువ పరిహారం పొందిన పోలవరం ముంపు బాధితులకు ఎకరాకు రూ.5 లక్షలు, గతంలో పరిహారం పొందనివారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. విలేకర్లందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇవీ మైలురాళ్లు ♦ జూన్ 27న అమలాపురం నియోజకవర్గంలో 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ♦ మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ♦ తునిలో 2700 కిలోమీటర్ల మజిలీని అధిగమించింది. జగన్‌కు భయపడే... ప్రజా సంకల్ప యాత్రకు భయపడే రాష్ట్రం ప్రభుత్వం ఈ మాత్రమైనా పని చేస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి పాదయాత్ర ప్రారంభించేనాటికి ప్రభుత్వ పెద్దలు దోపిడీయే అజెండాగా పని చేసే వారు. జగన్ క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కడికక్కడ ప్రభుత్వ దోపిడీని ఎండగట్టడంతోపాటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాస్త ప్రభుత్వం తాయిలాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోంది. నిరంతర కష్టజీవి జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా ప్రతి పేద వాడికీ న్యాయం జరుగుతుంది.– షేక్ మహబూబ్ జానీ, టైలర్, బిక్కవోలు ప్రజాసంకల్పయాత్ర వాయిదాపడడం బాధగా ఉంది దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జగన్ త్వరగా కోలుకుని ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రభుత్వ పెద్దల అక్రమాలను బహిర్గతం చేసి పాలనలో సంక్షేమాన్ని గుర్తు చేసే నాయకుడిపై దాడి చాలా బాధాకరం. జగన్ వంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం. ప్రజా సంకల్పయాత్ర మళ్లీ ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నాను.– గొర్రిపోటి అరుణ, గృహిణి, పందలపాక ఎన్ని ఆటుపోటులు వచ్చినా... రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఎన్ని ఆటు పోటులు ఎదురైనా, తనపై హత్యాయత్నం జరిగిన గుండె ధైర్యంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజల పట్ల జగన్‌కు ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తున్నాయి. ప్రజల సమస్యలు తెలిసుకోవడానికి ఎండనక, వాననక కుటుంబాన్ని వదిలి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పాదయాత్ర చేయడం నాడు వైఎస్‌కు, నేడు జగన్‌కు మాత్రమే సాధ్యం. – పడాల నాగిరెడ్డి, రావులపాలెం. -
అభిమాన ధనుడు సంకల్ప సాధకుడు
రాజకీయ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ.. వేల కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా నడిచేస్తూ...2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ఒక్క అడుగుతో ప్రారంభమైన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర మంగళవారానికి (నేడు) ఏడాది పూర్తి చేసుకుంటోంది. ప్రజల ప్రేమాభిమానాలే ఇంధనంగా అప్రతిహతంగా నడక కొనసాగిస్తూ తెలుగునాట రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రబిందువుగా మారారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జగన్ పాదయాత్ర... జన జాతరలా మారి పోయింది. ప్రజాభిమానం సంద్రంలా ఉప్పొంగుతుంటే ఆ ఉప్పెనలో తాము కొట్టుకుపోవటం ఖాయమనే ఆందోళన అధికార టీడీపీ వర్గాల్లో సుస్పష్టంగా కన్పిస్తోంది. ఇటీవల విశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతల కనుసన్నలో జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో పాదయాత్రకు కొంత విరామం ప్రకటించాల్సి వచ్చింది. జగన్‌కువస్తున్న జనాభిమానాన్ని చూసి ఓర్వలేకే ఈ కుట్రలు పన్నారని సామాన్యుల నుంచి మేధావుల వరకూ అభిప్రాయపడుతున్నారు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల మధ్య గడుపుతున్న జగన్‌పై జరిగిన కుట్ర తమకు బాధ కలిగించిందని వారు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమలో ప్రజాసంకల్పం ప్రజా సంకల్ప పాదయాత్ర పశ్చిమలో ప్రవేశించిన నాటినుంచీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణాలు, పల్లెలు వైఎస్ జగన్ కోసం పరవశించాయి. కృష్ణా జిల్లా నుంచి పాదయాత్ర 160వ రోజు మే 13వ తేదీన జిల్లాలోకి వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, జనసందోహం మధ్య ప్రవేశించింది. కొల్లేరు ప్రాంతం కోలాహలంగా మారింది. ఏలూరు నియోజకవర్గం సుంకరవారితోట ప్రాంతంలో జగన్ పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. అక్కడ భారీ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించి ముందుకు సాగారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు నేల ఈనిందా అన్న చందంగా జనం హాజరయ్యారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతూ వైఎస్ జగన్ చేసిన ప్రసంగానికి ప్రజలు ఈలలు, హర్షద్వానాలతో మద్దతు తెలిపారు. బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తానని జగన్ చేసిన ప్రకటన ఆ వర్గాలను ఆనందంలో ముంచెత్తింది. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రజలను పాదయాత్రకు వెళ్ళకుండా అడ్డుకున్నా ప్రజాసంకల్పాన్ని నిలువరించలేకపోయారు. దెందులూరులో రైతన్నలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రైతులపై జగన వరాల జల్లు కురిపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే హెయిర్ సెలూన్లలో విద్యుత్ బిల్లులపై రాయితీ ప్రకటించటంపై ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమయింది. ఉండి నియోజకవర్గం చినకాపవరంలో ఆక్వా రైతులు తాము పడుతోన్న కష్టాలను వైఎస్ జగన్‌కు వివరించారు. ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీల్లో యూనిట్ రూ.1.50కి అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ప్రతీ మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తానని వైఎస్ జగన్ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకారులపై జగన్ వరాల జల్లు కురిపించారు. మత్స్యకారులకు కొత్తబోట్లు రిజిస్ట్రేషన్లు చేయించటంతోపాటు, డీజిల్‌ను సబ్సిడీకి అందిస్తామన్నారు. వేట విరామ సమయంలో ప్రతి కుటుం బానికీ రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిండు నూరేళ్ళూ చల్లగా ఉండాలి ఆటో కార్మికుల కష్టాలు చూసిన జగన్మోహనరెడ్డి అడగకుండానే వరాలు కురిపించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుముల్లో 50 శాతం తగ్గిస్తానని, ఆటోవాలాలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తాననడం జగన్ ప్రజా సంక్షేమం కోసం ఎంతగా తపన పడుతున్నారో తెలుపుతోంది. అటువంటి మహోన్నత వ్యక్తిపై హత్యాప్రయత్నం జరగడం దారుణం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం ప్రజల్లో ఉంటున్న వ్యక్తి నేడు ఆసుపత్రిపాలుకావడం దురదృష్టకరం. – బుద్దా నాగ సూరిబాబు,ఏఐటీయూసీ అనుబంధ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జగనన్న త్వరగా కోలుకోవాలి ఎండనకా, వాననకా, రేయనకా, పగలనకా, ప్రజల సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సంవత్సర కాలంపాటు ముఖంలో చిరునవ్వు తగ్గకుండా నిత్వం ప్రజల్లో ఉంటూ పాదయాత్ర చేస్తున్న మా జగనన్న కత్తి దాడిలో గాయపడ్డాడని తెలిసి నా మనస్సు చెప్పలేని బాధపడింది. కత్తిపోటు బాధ చెప్పుకోలేనిది. ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన జగన్ ఇప్పటికే ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కత్తిపోటుతో బాధపడుతూ ఏ స్థితిలో ఉన్నారో అర్థం కావడంలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. – ధర్ముల బాబురావు, గిరిజనుడు, సిద్ధప్పగూడెం మాట తప్పని కుటుంబం వైఎస్ కుటుంబం మాట తప్పనిది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో జిల్లాకు వచ్చినప్పుడు పశ్చిమ డెల్టాలో నీటి కాలుష్యం గురించి వివరించాం. వినతిపత్రం అందజేశాం. ముఖ్యమంత్రి అయిన వెంటనే వెంకయ్య వయ్యేరు కాలువ కాలుష్యం నుండి ప్రజల్ని రక్షించేందుకు రూ.30 కోట్ల పైప్‌లైన్ నిర్మాణానికి మంజూరు చేశారు. పనులు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. వైఎస్.జగన్ దృష్టికి ఇదే విషయాన్ని తీసుకువెళ్లగా తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మంచినీటి వ్యవస్థను మెరుగు పరుస్తామని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నం జరగడం దారుణం. – మోటుపల్లి గంగాధరరావు, సీనియర్ నాయకుడు, ఆకివీడు -
తాడేపల్లిగూడెం మురిసింది
ఆయన జన హృదయ విజేత.. ప్రజల సంక్షేమమే ధ్యేయం... బడుగుల బతుకులు బాగుచేయాలనేది ఆయన ధ్యాస.. అందుకే మురికివాడల బాట పట్టాడు.. గోతుల రోడ్లు.. ముళ్ల దారిలో నడిచాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించాడు. మన కోసం జన నాయకుడు వచ్చాడని ప్రజలు పొంగిపోయారు. ఆయనతో కలిసి అడుగులో అడుగేశారు. సమస్యలుచెప్పుకున్నారు.. తమ రాతలు మార్చే నాయకుడితడేనని మురిసిపోయారు. జననేతకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పాలకులు ఆయనను హతమార్చేందుకు యత్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కుటిల పాలకులపై ధ్వజమెత్తుతున్నారు. ఖబడ్దార్.. అంటూ హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో జననేత అడుగు జాడలను స్పృశించే ప్రయత్నం.. ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు మండలం సుంకరవారితోటలో జగన్ 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో 2వేల కిలోమీటర్ల మైలురాయి పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహం ఆయనతో అడుగులు వేస్తూ ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. సభలో ఆటోడ్రైవర్లకు వరాలను ప్రకటించారు. సొంతంగా ఆటో నడుపుకునే ఆటోవాలాలకు ఏడాదికి రూ.10వేలు అందజేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆటోడ్రైవర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆటోడ్రైవర్లు జగన్మోహన్రెడ్డిని కలిసి టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఏవిధంగా నష్టపోతుందీ వివరించారు. ఇన్సూరెన్స్, ట్యాక్స్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము ట్యాక్స్‌లు కట్టడానికే సరిపోతుందని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఆటోడ్రైవర్‌కు రూ.10వేలు అందజేసి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఆటోవాలాల కోరిక మేరకు స్వయంగా ఆటోను నడిపారు. భీమవరం: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరానికి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో మూడురోజులపాటు ప్రజాసంకల్ప పాదయాత్ర జరిగింది. మండుటెండలు, జోరువానను సైతం లెక్కచేయకుండా జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. భీమవరం బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాదిరాజు సుబ్బరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, టీడీపీ నాయకులు ఎన్వీఆర్ దాసు, మాజీ కౌన్సిలర్ నల్లం రత్నకుమారి వంటి నేతలతో సుమారు 200 మంది వరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజలతో మమేకమైన జననేత జగన్‌పై ఇప్పుడు హత్యాయత్నం జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆయనపై హత్యాయత్నాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆక్వాకు వరాలు గణపవరం: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ యాత్ర జరిగింది. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేని ఎండ తీవ్రతను లెక్కచేయకుండా వేలాదిగా జనం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులో అడుగేస్తూ.. ముందుకు సాగారు. ఆయనతో కష్టసుఖాలు పంచుకున్నారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫలితంగా నష్టాల బాటపట్టామని ఆక్వా రైతులు వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు. అనంతరం గణపవరంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో ఆక్వా రైతులపై జగన్ వరాల జల్లు కురిపించారు. విద్యుత్ చార్జీలకు రాయితీ ప్రకటించారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50 కే అందిస్తామని రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రైతులకు నాణ్యమైన సీడ్ అందించడానికి కేంద్రాలతోపాటు, సరకును నిల్వ చేసుకోవడానికి మండలానికో శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం, నామమాత్ర ఫీజులతో చేప, రొయ్యల వ్యాధులను పరీక్షించే ల్యాబ్‌లు ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జగన్ హామీలతో తేలుకుట్టిన దొంగలా రాష్ట్ర ప్రభుత్వం విలవిల్లాడింది. తామూ ఆక్వా రైతులకు అండగా ఉంటామని యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామంటూ హడావుడిగా ప్రకటించింది. అయితే ఆ హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు. వరి రైతులకూ భరోసావరి రైతులకు కూడా అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటుధర, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇస్తామని ప్రకటించారు. పెట్టుబడి రుణం ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని హామీఇచ్చారు. మత్స్యకారులకు జననేత బాసట.. నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో రెండురోజులపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జరిగింది. ఈ రెండురోజులూ తీరం జనసంద్రమైంది. నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల మేర జననేత ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఆయనపై ఇప్పుడు హత్యాయత్నం జరగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టణంలోని స్టీమర్‌రోడ్డులో జరిగిన భారీ బహిరంగ సభలో దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలపై ఆయన విస్పష్టమైన హామీలు ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం చేపడతామన్నారు. మత్స్యకారులకు వరాలు తీరంలోని మత్స్యకారులకు ఆయన వరాలు ఇచ్చారు. మత్స్యకారులు వేటసాగిస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని, వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉండే మత్స్యకారులకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. లేసు అల్లిక కార్మికుల కష్టాలూ తీరుస్తానని భరోసా ఇచ్చారు. తీరంలో సాగు, తాగునీటి సమస్య తీరుస్తామని, నల్లీక్రీక్ పూడికతీత పనులు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ఆదరణ ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు మండలం సుంకరవారితోటలో జగన్ 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో 2వేల కిలోమీటర్ల మైలురాయి పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహం ఆయనతో అడుగులు వేస్తూ ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. సభలో ఆటోడ్రైవర్లకు వరాలను ప్రకటించారు. సొంతంగా ఆటో నడుపుకునే ఆటోవాలాలకు ఏడాదికి రూ.10వేలు అందజేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆటోడ్రైవర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆటోడ్రైవర్లు జగన్మోహన్రెడ్డిని కలిసి టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఏవిధంగా నష్టపోతుందీ వివరించారు. ఇన్సూరెన్స్, ట్యాక్స్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము ట్యాక్స్‌లు కట్టడానికే సరిపోతుందని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఆటోడ్రైవర్‌కు రూ.10వేలు అందజేసి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఆటోవాలాల కోరిక మేరకు స్వయంగా ఆటోను నడిపారు. దెందులూరు ఘన స్వాగతం దెందులూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో తొలి అడుగు వేశారు. ఏలూరు రూరల్ మండలం పెదయడ్లగాడిలో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. శ్రీరామవరం గ్రామంలో జననేతను కలిసిన సీతంపేట గ్రామానికి చెందిన బాలుడు నాగమణికంఠకు తలలో రక్తం గడ్డకట్టడంతో అతని తల్లిదండ్రులు జననేతకు వివరించారు. దీనికి స్పందించిన జననేత రూ.ఐదు లక్షలతో తిరుపతిలోని ఆస్పత్రిలో బాలుడికి ఆపరేషన్ చేయించారు. దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రైతు సదస్సులో వైఎస్ జగన్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు ఏటా మేనెలలో రూ.50 వేలు నేరుగా రైతులకు అందిస్తామని పేర్కొన్నారు. పావలా వడ్డీ రుణాలను అందిస్తామని వెల్లడించారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.2 వేల కోట్ల రూపాయలతో కెలామిటి రీలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేవుడు జగన్ పక్షాన ఉన్నాడు అనునిత్యం ప్రజల కోసం తపించే జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా బయటపడ్డారు. లేకపోతే మళ్లీ టీడీపీ పాలకుల చేతుల్లో ప్రజలు దగాపడేవారు. జననేతపై హత్యాయత్నం కలచివేసింది. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి ఆయనను గెలిపించుకుంటాం.– ముసునూరి సీతారామయ్య, వృద్ధుడు, గాలాయగూడెం తాడేపల్లిగూడెం: వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మూడురోజులపాటు పర్యటించారు. తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరిగింది. అడుగడుగునా.. ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అశేష జనవాహని జననేత వెంట అడుగులేశారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి జగన్ హామీ ఇచ్చారు. పాదయాత్ర అభినందనీయం రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం గత ఏడాది కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయం. ఏడాది కాలంగా భార్యా పిల్లలను, కుటుంబాన్ని వదిలి ప్రజాసమస్యలపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. అటువంటి వ్యక్తిపై హత్యాయత్నం చేయడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ దాడి కుట్రపూరితంగానే జరిగినట్లు తెలుస్తోంది. – రేవిడి సన్యాసిరావు, తాడేపల్లిగూడెం సంకల్ప బలానికి సలాం నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో మొక్కవోని ధైర్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగారు. నియోజకవర్గంలో మూడురోజలపాటు పాదయాత్ర సాగింది. పెరవలి మండలం కానూరు కొండలమ్మ గుడి సమీపంలో తేనెటీగలు ఒక్కసారిగా చుట్టిముట్టినా చలించకుండా ఆయన ముందుకు సాగారు. చుట్టూ ఉన్న ప్రజలు పరుగులు తీసినా.. ఆయన మాత్రం ధైర్యంగా ముందుకు కదిలారు. ఆయన సంకల్ప బలం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సలాం కొట్టారు. నిడదవోలులోజరిగిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. -
జననేతపై కక్ష.. జనాదరణే రక్ష
ఒక్క అడుగు.. బడుగుల కష్టాలు తెలుసుకునేందుకు.. వారి కన్నీళ్లు తుడిచేందుకు.. నేనున్నానని భరోసా ఇచ్చేందుకు జనక్షేత్రంలో మోపిన ఆ అడుగు.. వందలు, వేలు, లక్షల అడుగులు వేసింది.. రోజు.. పది రోజులు.. నెల.. ఇలా నిరంతరాయంగా సాగుతున్న ఆ యాత్రకు నేటితో సరిగ్గా ఏడాది.. 365 రోజులు.. 3200 కిలోమీటర్లు.. ఎన్నో మైలురాళ్లు.. ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ.. జనపదాలను స్పృశిస్తూ.. జనం గుండెల్లోని బాధను దించేస్తూ.. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ సాగుతున్న ఆ సుదీర్ఘయాత్ర ప్రత్యర్థుల గుండెల్లో గునపాలు దించించి.. జననేతకు లభిస్తున్న అపూర్వ ఆదరణ చూసి వారి కన్ను కుట్టింది. కుతంత్రం కన్ను తెరిచింది.. వారిలోని కుత్సితం బయటకొచ్చింది. రాష్ట్రంలో 11వ జిల్లా విశాఖలో అపూర్వరీతిలో జనాదరణ అందుకొని.. 12వ జిల్లా అయిన విజయనగరంలో అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్రకు బ్రేక్ వేయాలనో.. అసలు జననేతనే అంతం చేయాలన్న భయంకరమైన కుట్రతోనో ప్రణాళిక రచించారు. సాక్షి, విశాఖపట్నం :విశాఖ ఎయిర్‌పోర్టు మీదుగా ప్రతివారం రాకపోకలు సాగిస్తున్న ప్రజానేత వై.ఎస్.జగన్‌పై ఎయిర్‌పోర్టులోనే హత్యాయత్నానికి తెగబడ్డారు.అయితే భగవంతుని ఆశీసులు మెండుగా ఉన్న.. జనాదరణే రక్షణ కవచంగా మలచుకున్న జగన్మోహన్రెడ్డి తీవ్ర గాయంతో బయటపడ్డారు.తమ కష్టాలు కన్నీళ్లు తుడిచేందుకు ఎండావానల్లోనూ.. అనారోగ్యాన్నీ లెక్కచేయకుండా తిరుగుతున్న అభిమాన నేతపై జరిగిన ఈ హత్యాయత్నం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. కన్నీరు పెట్టించింది.. పాదయాత్ర కొనసాగి ఉంటే ఏడాది పండుగ అంబరాన్ని తాకేదని.. ప్రత్యుర్థుల కుట్రల కారణంగా.. యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడినా.. త్వరలోనే ఆ అడుగులు.. ఆ భరోసా.. ఆ ధైర్యం.. తమ ముందుకు రావాలని.. అందుకు దేవుడు జగన్మోహన్రెడ్డికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని.. ఆయన త్వరగా కోలుకొని రెట్టింపు సంకల్ప బలంతో తమ మధ్యకు మళ్లీ రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. నవంబర్ 6.. 2017.. ఓ చారిత్రక ఘట్టానికి నాంది పలికిన రోజు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడి వారసునిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జగన్మోహన్రెడ్డి అదే శైలినీ, ఒరవడినీ అనుసరించడమే కాదు అంతకు మించి ప్రజలకు సంక్షేమాన్ని అందజేయాలన్న తపనతో ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన రోజు.. తండ్రి స్ఫూర్తితో, తల్లి ఆశీస్సులతో ఇడుపులపాయ వద్ద ప్రారంభమైన యాత్ర ఎండావానలను సైతం లెక్కచేయక, అనారోగ్యాన్ని ఖాతరు చేయక అప్రతిహతంగా సాగిపోయింది. ఒకటా.. రెండా.. పదులా.. వందలా 3,200 కిలోమీటర్ల మైలురాయినీ దాటేసింది. అదే సమయంలో సంకల్పయాత్రకు హాజరవుతున్న జన ప్రభంజనాన్ని చూసి అధికారపక్షానికి వెన్నులో వణుకు పుట్టింది. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలను, సాధకబాధకాలను ఓపిగ్గా వింటూ.. భరోసా ఇస్తూ సాగిపోతున్న జన నాయకుని చూసి కలవరం మొదలైంది. ఈ తరుణంలో.. ఓర్వలేని ఏ కన్నుకుట్టిందో.. హత్యకు కుట్ర పన్నింది. పటిష్టమైన భద్రతావలయంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోనే జనసంక్షేమ సారథిపై హత్యాయత్నం జరిగింది. తాము ఎంతో ఆరాధించే నాయకునికి తమ జిల్లాలోనే ఇంతటి కష్టం రావడంపై విశాఖ తల్లడిల్లింది. తమ కన్నీటిని తుడిచే ఆప్తుడు.. కష్టాలు తీర్చే జనబాంధవుడు తిరిగి ప్రజల్లోకి రావాలని దేవుని ప్రార్థిస్తోంది. అనితర సాధ్యమైన మీ సంకల్పం అపూర్వమని కీర్తిస్తూ.. మీ అడుగులు మళ్లీ వడివడిగా సాగాలన్నది ప్రజావాహిని ఆకాంక్ష. విశాఖలో 277.1 కిలోమీటర్ల పాదయాత్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలో అడుగుపెట్టింది మొదలు అన్నీ సంచలనాలే చోటు చేసుకుంటున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాలను దాటుకుని విశాఖలో అడుగిడిన బహుదూరపు బాటసారికి విశాఖ జిల్లాలో జన నీరాజనాలుపలికారు. గన్నవరం మెట్ట వద్ద ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన జననేత పాదయాత్ర 32రోజుల పాటు 277.1 కిలోమీటర్ల మేర సాగింది. 12 నియోజకవర్గాల్లోని 20మండలాలు, జీవీఎంసీతో సహా నర్సీపట్నం, యలమంచలి, అనకాపల్లి పట్టణాల్లో యాత్ర సాగింది. నభూతో న భవిష్యతి అన్నట్లుసాగిన కంచరపాలెం సభతో సహా జిల్లాలో తొమ్మిది చోట్ల బహిరంగ సభలు, రెండుచోట్ల ఆత్మీయ సదస్సులు జరిగాయి. తడిసి ముద్దయినా ఆగని అడుగు నర్సీపట్నం, యలమంచిలి, అడవివరం, ఆనందపురం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షంలో తడిసి ముద్దయినా లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగించారు జగన్. జిల్లా పర్యటనలో పలుమార్లు జలుబు, జ్వరంతో ఇబ్బందిపడ్డారు. పాదయాత్ర సాగినంత సేపు డస్ట్ ఎలర్జీతో సతమతమయ్యారు. కానీ ఎక్కడా యాత్రను ఆపలేదు. ప్రజలతో మమేకమయ్యేందుకు వజ్ర సంకల్పంతో ముందుకు సాగారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి కష్టాలు వింటూ కన్నీళ్లు తుడిచారు. వివిధ వర్గాల ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి భరోసా ఇచ్చారు. విశాఖలోనే ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. 2737.1 కిలోమీటర్ల వద్ద విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన జననేత 2,800కిలోమీటర్ల మైలురాయిని యలమంచిలి పట్టణం కోర్టు సెంటర్లోనూ, 2,900 కిలోమీటర్ల మైలురాయిని సబ్బవరం కొత్తరోడ్డు వద్ద దాటారు. 3 వేల కిలోమీటర్లను విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎస్.కోట మండలం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద అధిగమించారు. హత్యాయత్నంపై తల్లడిల్లుతున్న విశాఖ పాదయాత్రలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన విశాఖలోనే ఆయనపై హత్యాయత్నం జరగడాన్ని విశాఖవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత భద్రత కలిగిన ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఈ దుశ్చర్యకు పాల్పడడంతో నివ్వెరపోయారు. తనపై హత్యాయత్నం జరిగినా.. కార్యకర్తల్లో ఆగ్రహం వెల్లువెత్తకుండా.. ఉద్రిక్తతను నివారించే యోచనతో అంతటి బాధను పంటి కింద అదిమిపట్టి మరీ హైదరాబాద్ వెళ్లిపోవడాన్ని చూసి ఆయన స్థైర్యాన్ని అభినందిస్తున్నారు. ఏనాడూ అనారోగ్యమన్నది ఎరుగని జననేత హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి పడుతున్న బాధను చూసి తల్లడిల్లిపోతున్నారు. త్వరగా కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ యాత్రను ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఆ బాబుకి ప్రజల ఆశీస్సులుఉంటాయయ్యా.. జగన్ బాబు ప్రజల సమస్యలు, బాగోగులు తెలుసుకునేందుకు తన కుటుంబాన్నే వదిలేశాడయ్యా. ఏడాదిగా రాష్ట్రం అంతా తిరుగుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు. మాలాంటి వారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అది చూడలేకే .. ప్రజల్లో లేకుండా చేద్దామనే చంపుదామని చూశారు. ఆ బాబుకు ఏమీ జరగదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయయ్యా. ఆ బాబుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.– చుక్కల ధర్మయ్య, చేనేత కార్మికుడు,పైడిపాల, మాకవరపాలెం మండలం నా బిడ్డకు గాయమైనంతబాధగా ఉంది జగన్ భుజానికి దెబ్బ తగిలిందంటే నా బిడ్డకు గాయమైనట్లుగా అనిపిస్తుంది. త్వరగా కోలుకోవాలని క్రమం తప్పకుండా మసీదుకు వెళ్లి నమాజు చేస్తున్నాను. జగన్‌పై హత్యాయత్నం నీచ రాజకీయాలకు ఉదాహరణ. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఇలా చేశారు. భుజానికి తీవ్ర గాయమైనా పాదయాత్రకు సిద్ధమవ్వడం జగన్ వంటి నాయకుడికి మాత్రమే సాధ్యం. నా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తొందర్లోనే రావాలి.– షేక్ అబ్దుల్, కోటవీధి కత్తితో పొడిచారని తెలిసినివ్వెరపోయాం జగన్ ప్రజలతో కలసిపోయి తిరుగుతుంటే ఆయన తండ్రిలానే మా బాగోగులు చూస్తారనుకున్నాం. ఆయనను కత్తితో పొడిచారని తెలిసి నివ్వెరపోయాం. త్వరగా కోలుకోవాలి. – పీల కృష్ణవేణి, గృహిణి, నాలుగో సెక్టార్, ఆరిలోవ -
బాధిత జన బాంధవుడు
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు వింటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ.. భవిష్యత్తుపై వారికి భరోసానిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారానికి ఏడాదికాలం పూర్తిచేసుకుంది. ఈ ఏడాదికాలంగా ఎండనకా.. వాననకా.. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ అలుపెరుగని బాటసారిలా ముందుకుసాగారు. పాదయాత్ర మార్గంలో అవ్వలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు ఇలా ఒక్కరేంటి.. అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకొన్నారు. చంద్రబాబు పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను, నష్టాలను జననేత వద్ద మొరపెట్టుకున్నారు.. లక్షలాది మంది ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలిచ్చారు. ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలంటూ వేడుకున్నారు. ఎన్నెన్ని విన్నపాలో.. వాటిలో కొన్ని.. - ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని, ప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక తమను మోసగించారని నిరుద్యోగ యువత జననేత వద్ద మొరపెట్టుకున్నారు. - వ్యవసాయ రుణాల మాఫీ అని ప్రకటించి చివరకు తమను వంచించారని.. రుణమాఫీ కాకపోగా, చంద్రబాబు నిర్వాకం కారణంగా వడ్డీలు పెరిగిపోయి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. - బేషరతుగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. నయాపైసా కూడా మాఫీ చేయలేదని మహిళలు విన్నవించారు. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని తానే తెప్పించి ఇస్తానని చెప్పి.. తీరా ఇప్పుడు ముఖం చాటేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. తాకట్టు బంగారాన్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకుల నుంచి నోటీసులొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. - అనారోగ్యంతో ఉన్న తమ బిడ్డలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందక నానా అగచాట్లుపడుతున్నామంటూ పలువురు తల్లిదండ్రులు జగన్ వద్ద వాపోయారు. - తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామన్న హామీతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్న ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండాపోయిందని, అన్యాయంగా పలువుర్ని తొలగించారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. - తమకు, తమ కుటుంబాలకు భరోసాగా ఉన్న పాత పెన్షన్ విధానాన్ని ఎత్తేయించి.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెచ్చారని సీపీఎస్ ఉద్యోగులు ప్రతిపక్ష నేతకు విన్నవించారు. - తమకు పింఛన్లు రావడం లేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ పింఛన్లు తొలగించారని, పార్టీ వివక్ష చూపుతూ జన్మభూమి కమిటీలు తమకు పింఛన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని వేలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గోడు వెళ్లబోసుకున్నారు. - అర్హులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను ఇవ్వడం లేదంటూ వేలాది గ్రామాల్లో ప్రజలు జగన్‌కు మొరపెట్టుకున్నారు. - ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని బాబు నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. - సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వైఎస్ హయాంలో దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిన పనులు కూడా పూర్తి చేయించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. - ఆటోకార్మికులు, వివిధ వర్గాల వారు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. అందరి కష్టాలను సావధానంగా వింటూ.. మన ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ.. నవరత్నాల పథకంతో వారి భవిష్యత్తుకు భరోసా కల్పి స్తూ జననేత ముందుకు సాగుతున్నారు. -
ప్రజా సంకల్పానికి ఏడాది
‘రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్లో.. సీఎం చంద్రబాబునాయుడు తీరుతో పూర్తిగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇస్తూ ముందడుగు వేస్తున్నా’.. అంటూ వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ వద్ద 2017 నవంబరు 6న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు మంగళవారంతో ఒక ఏడాది పూర్తికానుంది. ఈ 12నెలల కాలంలో జగన్ 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12వ జిల్లాలో యాత్రను కొనసాగిస్తూ జనంతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకోవడంలోనూ.. ప్రజలను కలుసుకోవడంలోనూ ఆయన చూపుతున్న చొరవ ప్రదర్శిస్తున్న ఓర్పు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. కేసులకు భయపడే ప్రసక్తి లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. అది నేను చనిపోయిన తరువాతా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి, ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పంచాలన్నదే నా కసి, ఆ కసి నాలో ఉంది కాబట్టే ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే నా కసి’.. అని పాదయాత్ర తొలి రోజున వ్యక్తీకరించిన సంకల్పం అడుగడుగునా ప్రస్ఫుటిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ప్రారంభమైన యాత్రను కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్ జగన్ ముగించుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25న హైదరాబాద్‌కు బయల్దేరగా విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీని నుంచి తృటిలో తప్పించుకున్నప్పటికీ భుజానికి లోతైన గాయం కావడంతో జగన్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ ప్రజల చెంతకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. ‘నవరత్నాల’పై ప్రజల్లో అవగాహన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, గృహ నిర్మాణం, 108 వంటి అనేక సంక్షేమ పథకాలకు ఊపిరులూది దేశంలోనే సంక్షేమ విప్లవానికి నాంది పలికిన తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కంటే రెండడుగులు ముందుకు వేయాలనే కృతనిశ్చయంతో ఉన్న జగన్ తన ఆశయాలకు అనుగుణంగా ‘నవరత్నాలు’ను రూపొందించారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. జనప్రభంజనంతో ఆలస్యం వాస్తవానికి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ తలపెట్టిన పాదయాత్రను ఆరేడు నెలల్లోపు పూర్తిచేయాలని జగన్ తొలుత సంకల్పించారు. కానీ, యాత్ర ప్రారంభమైన నాటి నుంచీ రోజు రోజుకూ వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో అడుగుతీసి అడుగువేయడం కష్టమైపోతోంది. అందుకే 12 జిల్లాలు పూర్తికాకుండానే ఏడాది గడిచిపోయింది. మరో నెలన్నర దాకా యాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఏ ఊరికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. బహిరంగ సభలకైతే ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివస్తున్నారు. అందువల్లే అనుకున్న దానికంటే యాత్ర ఆలస్యమవుతోంది. తీర్చగలిగే వాటిపైనే హామీలు జగన్ ఇప్పటికే 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇబ్బడి ముబ్బడిగా తనను కలుసుకోవడానికి వస్తున్న ప్రజాసంఘాలు, తటస్థులతో భేటీ అవుతూ తీర్చగలిగిన వారి సమస్యలపై ఆయన విస్పష్టమైన హామీలిస్తున్నారు. జగన్ మాట ఇస్తే తప్పరన్న నమ్మకం కలుగుతుండడంతో వారంతా ఆనందంతో వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎక్కడికెళ్లినా జనం పోటెత్తుతున్న తీరు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మహిళలు, యువకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది సెల్ఫీలు తీసుకున్నారు. ఇక అవ్వాతాతలు తమ సొంత మనవడే తమ వద్దకు వచ్చినట్లుగా ఆనందిస్తూ జగన్‌ను ఆశీర్వదిస్తున్నారు. -
రాజన్న బిడ్డ ఎట్టున్నడో!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగి దాదాపు రెండు వారాలవుతోంది. వివిధ ప్రాంతాల ప్రజలు జననేత ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. నిన్నటి దాకా తమ మధ్య తిరిగిన వ్యక్తికేనా ఇటువంటి హాని తలపెట్టింది.. అంటూ కుమిలిపోతున్నారు. నలుగురు గుమికూడిన ప్రతి చోటా ఇదే చర్చ. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఇప్పటి వరకు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని 12వ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత నెల 25న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం చప్పబుచ్చమ్మ పేట నుంచి పేకపాడు వరకు పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లారు వైఎస్ జగన్. విమానాశ్రయంలోని హోటల్లో పనిచేసే శ్రీనివాసరావు కత్తితో జననేతపై హత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో గాయపడిన జగన్ తన భుజం నుంచి రక్తస్రావం అవుతున్నా ధీరోదాత్తునిగా నిలిచి.. తనకు ఏమీ కాలేదని.. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ విమానం ఎక్కారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మంగళవారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే.. అయ్యో.. ఆ బాబుకేటి ఇలా జరిగింది? పగస్తుడికైనా పాపం తలపెట్టని బిడ్డపై ఇలా సేత్తారా ఓరైనా.. పానం తీస్తరా. ఓటు కోసం ఇలా పొడిసేయడమేటి? – విజయనగరం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన ఓ అవ్వ ఆందోళన ఏడుపొచ్చేత్తాంది .. ఆ గుంటడెవడో కత్తితో పొడిసేసిండంట.. బాబు పానానికి పర్వాలేదు కదా.. దేవుడున్నడు. మంచోళ్లకు ఎప్పుడూ మంచే జరుగుద్ది మరి.. – గడివలస గ్రామానికి చెందిన ఓ మహిళ కుట్రలు పన్ని చంపేయత్నం చేశారు రాజన్న బిడ్డపై కుట్రలు పన్ని చంపేయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. అదే ఆ కత్తి మెడకు తగిలుంటే అమ్మో.. ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇదంతా టీడీపీ వాళ్ల పనేనని అందరికీ తెలుసు. జగన్ త్వరగా కోలుకుని పాదయాత్ర మొదలెట్టాలని అల్లాను ప్రార్థిస్తున్నా. – మౌలాన్‌బీ, కడప. ఇంతకంటే దారుణం ఉంటుందా? ప్రజలకు మేలు చేయాలని వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న జగన్‌పై హత్యాయత్నం దారుణం. రాష్ట్రానికి మేలు చేసేందుకు ముందుకొచ్చిన ప్రజా నాయకుడికి కూడా ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం అన్యాయం. ఇంతకంటే దారుణం ఉంటుందా? దేవుడి దయ వల్లే జగన్ ప్రాణాలతో బయటపడ్డాడు. – కొమ్ము సావిత్రి, గృహిణి, లక్కవరం.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయంగా ఎదుర్కోలేకే.. జననేతను అంతమొందించేందుకు యత్నించడాన్ని తట్టుకోలేకపోతున్నా. కన్నీళ్లు ఆగడం లేదు. కుటుంబాన్ని సైతం వదిలి ప్రజల కోసం తపన పడుతున్న నేతను చంపాలనుకోవడం దారుణం. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా మట్టుబెట్టాలని చూడటం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. – మారూరి నరేంద్రరెడ్డి, ముప్పాళ్ల మండలం, గుంటూరు జిల్లా జగన్‌ను కాపాడుకుందాం.. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించే నాయకుడని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి నాయకుడిపై కక్షగట్టి.. పథకం ప్రకారం హత్యచేసే ప్రయత్నం జరిగింది. పక్కా ప్రణాళికతో తెలుగుదేశం నాయకులు ఈ కుట్ర పన్నారు. ఇప్పుడు దానిని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జననేతను ప్రజలే కాపాడుకోవాలి. ఆయన సీఎం అయ్యాక అద్భుతమైన పాలన అందిస్తారని జనం నమ్ముతున్నారు. – ప్రొఫెసర్ కె.రత్నయ్య, ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ, తిరుపతి ఇంతలా దిగజారిపోయాయా? సింగపూర్, మలేసియా, జపాన్ అన్నీ కలిస్తే ఎలా ఉంటుందో.. రాజధాని అమరావతిని అలా నిర్మిస్తామని బాబుగారు అరచేతిలో స్వర్గం చూపారు. ఆయన మాటలు నమ్మి మా భూములిచ్చాం. నాలుగున్నరేళ్లుగా ఆ భూములు బీడుగానే ఉన్నాయి. ఒక్క ఇటుకా పడింది లేదు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలు దోచుకోవడమే తప్ప మరోటి ఆలోచించడం లేదు. మా కష్టాలు, బాధలు వైఎస్ జగన్‌గారు అర్థం చేసుకున్నారు. అండగా నిలిచారు. ఆయన వస్తేనే.. మాకు న్యాయం జరుగుతుంది. ఆయన పోరుబాట గిట్టని పాలకపార్టీ పెద్దలు కుట్రపన్ని ఆయనను అంతమొందించాలనుకోవడం దారుణం. రాజకీయాలు ఇంతగా దిగజారిపోయినందుకు సిగ్గుపడాల్సి వస్తోంది. – ఆలూరి శ్రీను, రాజధాని రైతు, మందడం. ఓర్వలేకనే హత్యాయత్నం పాదయాత్రతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది జీర్ణించుకోలేకనే ఆయనను హత్య చేయాలనుకున్నారు. దేవుడి దయ వల్లే ఆయన బతికారు. – తాతిరెడ్డి, రైతు, మర్తాడు, అనంతపురం జిల్లా జనం దీవెనలే ఆయనకు శ్రీరామరక్ష రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిపై జరిగిన ఈ కుట్ర వెనుక కథ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. జనం దీవెనలే ఆయనకు శ్రీరామరక్ష. అవి ఉన్నంత వరకు ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. – ఎన్.రమేష్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ వీఎస్ఈయు నాయకుడు టీవీల్లో చూడగానే గుండె నీరైపోయింది.. జగన్‌పై హత్యాయత్నం చేశారంటూ టీవీల్లో వార్త చూడగానే గుండె నీరైపోయింది. ఆయనకు ఏమవుతుందోనని భయమేసింది. భగవంతుని దయ వల్ల ఆయనకు ప్రాణాపాయం లేదని కుదుటపడ్డా. జగన్ జొన్నల్లంక వచ్చినప్పుడు అగ్నికుల క్షత్రియులంఆయనను కలిశాం. మాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. – సందాడి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు, అగ్నికుల క్షత్రియ యువజన సేవా సంఘం, తూర్పుగోదావరి జిల్లా ఆయన ఓపికకు మొక్కాలనిపించింది.. జగన్ ఓపికకు మొక్కాలనిపిస్తోంది. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా అలుపూ సొలుపూ లేకుండా నడుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న మనిషిపై హత్యాయత్నం జరగడం విస్మయం కలిగించింది. పాదయాత్రగా వచ్చినప్పుడు గంటిపెదపూడిలో నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులం కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. మా బాధలు ఓపికగా విని న్యాయం చేస్తానన్నారు. – కాజులూరి రామారావు, గౌరవాధ్యక్షుడు, శ్రీబాలబాలాజీ దేవస్థానం కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, తూర్పుగోదావరి జిల్లా ఆ మాటలింకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయ్.. ప్రజల కోసం పరితపిస్తున్న మనిషిని చంపాలని చూస్తారా? వాళ్లసలు మనుషులేనా.. కుట్రకాకపోతే ఏంటిది? ఆయన మా ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేకించి మా గనికార్మికుల సమస్యలపై ఇచ్చిన హామీ ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. క్వారీలకు విద్యుత్‌లో 50 శాతం రాయితీ ఇవ్వడమే కాకుండా.. రాయల్టీ ఫీజును కూడా తగ్గిస్తానన్నాడు రాజన్న బిడ్డ. – వెంకటేశ్వర్లు, గని కార్మికుడు, కర్నూలు జిల్లా ప్రజాదరణను చూడలేకే.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో తీవ్రంగా కలత చెందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి చేనేత కుటుంబం భగవంతుడిని ప్రార్థిస్తోంది. జననేతకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే స్వార్థపర శక్తులు ఆయనను మట్టుబెట్టాలనుకున్నాయి. ఎన్ని కుట్రలు పన్నినా జగనే సీఎం అని ప్రజలు నిర్ణయించుకున్నారు. – మల్లికార్జున్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నెల్లూరు జిల్లా మా కొట్లో టీ తాగాడు ప్రజా సంకల్ప యాత్ర ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఆయప్ప (జగన్) మా టీ స్టాల్‌కు వచ్చి టీ తాగాడు. నాతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. జనం కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతుంటే.. తట్టుకోలేక దుష్టులు చంపాలనుకున్నారు. నిత్యం ప్రజల కోసం పరితపించే ఆ బిడ్డకు ఇలా జరిగిందంటే చాలా బాధగా ఉంది. అల్లా మేలు చేస్తాడు.. తొందరగా కోలుకుని మళ్లీ పాదయాత్ర చేస్తాడు. – యాసిన్, టీ స్టాల్ యజమాని, వైఎస్సార్ జిల్లా రాజన్న బిడ్డ కోసం రోజూ అల్లాను ప్రార్థిస్తున్నా.. రాజన్న బిడ్డను చంపేందుకు ప్రయత్నించారని తెలిసి ఎంతో బాధపడ్డా. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందా. ఇప్పటికీ ఆయన పరిస్థితి ఎలా ఉందోనని నిత్యం టీవీలో చూస్తున్నా.. ఆయన కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నా. దేవుడు గొప్పోడు.. మా ప్రార్థన తప్పక వింటాడు. – షేక్ మహుబూబీ, ఎర్రగుంట్ల, వైఎస్సార్ జిల్లా ఆయన మళ్లీ మా పల్లెలకు రావాల.. రాజన్న బిడ్డ వస్తున్నాడని మా ఊరు రోడ్డుకు వెళ్లాను. అందరినీ ప్రేమతో పలకరించాడు. నా తల నిమిరాడు.. తాతా బాగున్నావా.. అన్నాడు. ఎంతో సంబరమేసింది. ఇంటికి వెళుతుంటే ఎవరో కత్తితో పొడిచారని విని కంగారుపడ్డా. ఆ బిడ్డను టీవీలో చూశాకగానీ మనసు కుదుటపడలేదు. మళ్లీ ఆ బిడ్డ మా జిల్లా రావాలా.. మా పల్లెల్లో తిరగాలా.. మేం సూడాల. – అంబటి నారాయణ, చిన భీమవరం, విజయనగరం జిల్లా వాళ్లే నాశనమైపోతారు.. పాదయాత్రలో జగన్ బాబు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త అవ్వా.. మనమొచ్చాక అంతా బాగుంటుందన్నాడు. నా మనసుకు చాలా హాయిగా అనిపించింది. అంత మంచి మనిషిని చంపాలనుకున్నారని తెలిసి తల్లడిల్లిపోయాను. మా మనవడ్ని నాశనం చేయాలనుకున్న వారే నాశనమైపోతారు. మా రాజన్నలా.. ఈ బిడ్డ కూడా సీఎం కావాల. – చొక్కాపు సూరమ్మ, విజయనగరం జిల్లా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం.. రాజన్న బిడ్డ శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు మత్స్యకారుల సమస్యలను చెప్పాలనుకుంటున్నాం. విశాఖలో ఆయనపై హత్యాయత్నం జరిగిందని తెలిసి కంగారుపడ్డాం. మళ్లీ ఆయన మా మధ్యకు ఎప్పుడు వస్తాడా.. అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం. రాజన్నలాగే ఆయన బిడ్డ కూడా మత్స్యకారులకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాం. – కొమర నారాయణరావు, మత్స్యకారుడు, శ్రీకాకుళం జిల్లా ప్రజానాయకుడిపై కుట్రలా! జగనన్నపై హత్యాయత్నం దారుణం. ప్రజల మధ్యనే ఉంటూ.. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడిని మట్టుబెట్టాలనుకోవడం అత్యంత హేయం. ఇంత జరిగినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. తనే చేయించుకున్నాడని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేయడం హాస్యాస్పదం. కుట్ర వెనుక సూత్రధారులను వెలికితీయాలి. – వాక యశోద, శాంభవి మహిళా మండలి గ్రూపు సభ్యురాలు, మర్రిపూడి, ప్రకాశం జిల్లా ఇంత ఘోరం చేస్తారని అనుకోలేదయ్యా.. జగన్‌పై ఇంత ఘోరానికి ఒడిగడతారని నేననుకోలేదయ్యా.. పాదయాత్రప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడాడో. ఎవరికి ఏం అన్యాయం చేశాడని ఆ బిడ్డను చంపాలనుకున్నారు? కుట్ర చేసిన వాళ్లను పట్టుకోవాలి. ఆ బిడ్డ త్వరగా కోలుకుని మళ్లీ జనం మధ్యకు రావాలని దేవుడిని వేడుకుంటున్నా. – గొల్లపల్లి నాగమ్మ,, రైతు కూలీ, ప్రకాశం జిల్లా ఆయన మా మధ్యకు వచ్చే రోజుకోసం ఎదురు చూస్తున్నాం.. ఎప్పుడూ ప్రజల్లో ఉండే జగన్‌ను చంపే ప్రయత్నం చేయడానికి వాళ్లకు మనసెలా వచ్చింది? గాయం నుంచి కోలుకుని మళ్లీ మా మధ్యకు వచ్చే రోజు కోసం మేం ఎదురు చూస్తున్నాం. ఆయనకు మంచి పేరొస్తుందనే ఇలా చేశారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా మేమంతా జగన్ వెంటే.. – వీరమ్మ, వైఎస్సార్ జిల్లా రాక్షస క్రీడ రాజకీయం.. రాక్షస క్రీడయింది రాబందుల రెక్కల చప్పుడయింది క్రౌర్యం పెద్దపులి పంజా విసురుతోంది గోముఖ వ్యాఘ్రం జాతి గోవునంటూ.. ‘పచ్చ’దనంతో పళ్లికిలిస్తూ పరిహాసం చేస్తోంది తంత్రాలు, కుతంత్రాలు, ద్వేషాలు మాయాజాలాల మహా మంత్ర క్రీడలాడుతోంది అరచేతిలో వైకుంఠాన్ని చూపుతోంది అపురూపాల అద్భుతాలంటూ అభినయాలు చేస్తోంది, హాలాహలం చిమ్ముతోంది!! అప్పుడు.. అప్పుడే.. అసలైన సిసలైన అసలుసిసల నికార్సైన ఓ కాంతి పుంజం దూసుకొచ్చింది వెలుగుని తీసుకొస్తూ, వెలుతురు తోసుకొస్తూ నువ్వు నేనై, నువ్వూ నేనూ మనమై మనం మనం జనమై జనం జనం ప్రభంజనమై ప్రచంఢమై ప్రజ్వలితమై హితమై సహితమై సమ్మోహితమై, జన నినాదమై జగన్నినాదమై నాదంగా నిదానంగా.. ఓ నినాదంగా జన శ్వాసే తన శ్వాసగా ధ్యాసగా తనలోని ఘోషగా.. మనసు మనసుని తడుముకుంటూ భుజం భుజం కలుపుకుంటూ ప్రతి మనిషినీ కలుసుకుంటూ ప్రతి మనసునీ హత్తుకుంటూ రాజన్న కలల్ని నెమరేసుకుంటూ నవరత్నాల్ని మోసుకుంటూ భవిష్యత్ ద్వారాలు తెరుస్తున్నాడతడు అదేఅదే జగనన్న ప్రజా సంకల్పయాత్ర భావి బాధలను తొలగించే మహాద్భుతాల మాత్ర అతడికి తోడవుదాం, నీడవుదాం అక్కున చేర్చుకుందాం అతణ్ణి ఆదరిద్దాం అతణ్ణి అనుసరిద్దాం ఆశీస్సులందిద్దాం ఆశీర్వదిద్దాం... అందాలని, ఆనందాలని సంతోషాలను సంరంభాలను అందించే రేపటి అందాలను ఆవిష్కరిద్దాం ఆగామి కాలాల ఆమని కోయిలల్ని ఆహ్వానిద్దాం –ప్రొఫెసర్ రమాప్రసాద్ ఆదిభట్ల, విశాఖపట్నం -
తలవంచని ధీరుడు
ఎవరికీ తలవంచని ధైర్యం..కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. మేరువు లాంటి తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన క్షణం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గత తొమ్మిదేళ్లుగా జరిగిన కుట్రలు అన్నీఇన్నీ కావు. రాజీలేని పోరాటం చేస్తున్నందుకు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నెన్నో. మహానేత అయిన తండ్రి మరణం జగన్‌కు రాజకీయంగా తొలి దెబ్బ అయితే.. భౌతికంగా తననే అంతం చేయాలని తాజాగా జరిగిన కుట్ర మలి దెబ్బ. ఈ రెండింటికీ మధ్య ఆయన కుట్రదారుల నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. నిరంకుశ కాంగ్రెస్ నేతలతో రాజీపడనందుకే జగన్ ఆర్థిక మూలాలనే దారుణంగా దెబ్బతీయాలనే కుట్ర జరిగింది. ఇదే క్రమంలో ఆయనపై అనేకానేక నిరాధారమైన ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి పదహారు నెలలపాటు జైలుపాల్జేశారు. ఈ తొమ్మిదేళ్లలో వ్యతిరేక శక్తులు జగన్‌ను అణగదొక్కాలని చూసేకొద్దీ ఆయన రెట్టించిన ఉత్సాహంతో బలపడుతూ వచ్చారు. తండ్రి ఆశయాలను సాధించాలనే బృహత్తర ఆశయంతో, ఆయన చూపిన ప్రజా సంక్షేమ వెలుగులో ప్రజలకు మరింత చేరువై వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జగన్ జైల్లో ఉన్న 16 నెలల కాలం మినహా మిగతా సమయమంతా జనం మధ్యనే ఉంటూ వచ్చారు. తనను అణగదొక్కాలని, రాజకీయ ముఖ చిత్రంలోనే లేకుండా చేయాలని వ్యతిరేక శక్తులు అనేకానేక కుట్రలు పన్నినా ఇనుమడించిన ఉత్సాహం, పట్టుదలతోనే ఆయన ప్రజాక్షేత్రంలో ఎదురొడ్డి పోరాడుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఇంత సుదీర్ఘకాలం పాటు పోరాట మార్గంలో సాగిన రాజకీయవేత్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. 2009లోనే ఎంపీగా గెలిచినప్పటికీ తండ్రి మరణం తరువాతే వైఎస్ జగన్ రాజకీయంగా క్రియాశీలకమయ్యారు. నల్లకాలువ వద్ద ఇచ్చిన మాట కోసం.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్‌ను బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. మూడు వారాలైనా తిరక్కముందే ఆయన అదే నెల 25న వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న జగన్.. 2010, ఏప్రిల్ 9 నుంచి తొలి విడత ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. జనం నుంచి తిరుగులేని స్పందన రావడం కాంగ్రెస్ పెద్దలకు కంటగింపుగా మారింది. రోజురోజుకూ జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన వారు దీనిని ఆపాలని తాఖీదు జారీచేశారు. ఫలితంగా కొంతకాలం యాత్ర ఆగినా వారి అనుమతితోనే పునఃప్రారంభించేందుకు జగన్ చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్రతో ముందుకే వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఏమీ చేయలేమని గ్రహించిన జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ.. 2010 నవంబరు 29న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. అనంతరం 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్ కనీవినీ ఎరుగని రీతిలో 5.45లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో, విజయమ్మ పులివెందుల నుంచి 75వేల ఓట్ల భారీ ఆధిక్యతతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని గ్రహించి, సరిగ్గా అప్పటి నుంచే ఢిల్లీలో సోనియా, రాహుల్, రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుమ్మక్కై జగన్‌పై కుట్రలకు తెరలేపారు. ఆ తర్వాత జగన్‌పై కేసులు వేయడం.. సీబీఐ దాడులు.. జైలులో పెట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. జైల్లో పెట్టి మానసికంగా జగన్ స్థైర్యాన్ని దెబ్బతీసి తమ దారికి తెచ్చుకోవచ్చన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి అణగదొక్కవచ్చనుకున్న ప్రయత్నాలూ ఫలించలేదు. మరోవైపు.. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన మీడియా జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఓ ఆర్థిక ఉగ్రవాది అంటూ ఇష్టారాజ్యంగా చిత్రీకరించింది. ఈలోపు చంద్రబాబు మద్దతుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జగన్ జైలులోనూ.. విజయమ్మ గుంటూరులోనూ నిరవధిక నిరాహారదీక్ష చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు, టీడీపీ కూటమికి మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. కష్టాల్లో కూడా వీడని విలువలు ఈ ఎన్నికల్లో రైతు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీ ఇచ్చారు. దాంతో మనం కూడా రుణ మాఫీపై హామీ ఇద్దామని పార్టీలో ఎంతగా ఒత్తిడి వచ్చినప్పటికీ జగన్ లొంగలేదు. సాధ్యం కాని హామీలు నేనివ్వలేనని నిజాయితీగా తేల్చి చెప్పారు. అలాగే.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ వక్రమార్గాల్లో వెళ్లకుండా విలువలు పాటించారు. ఎవరైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే అధికార పదవికి రాజీనామా చేసి రావల్సిందేనన్న షరతును విధించి రాజకీయాల్లో ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. నిన్న మొన్నటి వరకూ వైఎస్ జగన్‌కు చాలా సన్నిహితంగా మెలిగి, ఇటీవలే దివంగతులైన డీఏ సోమయాజులు అన్నట్టు.. ‘జగన్ మాదిరిగా ఇన్ని కష్టాలుపడిన నేతను, ఇన్ని కుట్రలకు గురైన నేతను నా జీవితంలో చూడలేదు’ అన్నది అక్షర సత్యం. సడలని ధైర్యంతో.. 2014ఎన్నికల్లో చంద్రబాబు.. నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్ సహకారంతో కేవలం 1.6 శాతం ఓట్లతో గట్టెక్కారు. ఎన్నికల అనంతరం హుందాగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలను తిరుగులేని రీతిలో స్పందిస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు వందల కోట్ల రూపాయలతో ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. అయినా, జగన్ స్థైర్యం కోల్పోలేదు. చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలు నెరవేరక కష్టాల్లో కునారిల్లుతున్న ప్రజలను కలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు నవరత్నాలు కార్యక్రమం అమలు ఆలంబనగా 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. చట్టం పేరు చెప్పి దీనికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినా వెరవకుండా ముందుకే సాగారు. ఆయనపై చేసిన కుట్రలు సాగలేదన్న దుగ్ధతో ఇక భౌతికంగానే అంతం చేయాలన్న దుస్సాహసానికి ఇటీవల తెగబడిన విషయం తెలిసిందే. అసాధారణ పరిణతి చూపిన నేత ఎప్పటిలాగే.. పాదయాత్ర నుంచి హైదరాబాద్‌లో కోర్టుకు హాజరయ్యేందుకు విజయనగరం జిల్లా నుంచి బయల్దేరిన జగన్‌పై గతనెల 25న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ఈ హఠాత్ పరిణామం నుంచి వెంటనే తేరుకుని జగన్ వ్యవహరించిన తీరు పరిశీలకుల ప్రశంసలను చూరగొన్నది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా తనపై జరిగిన దాడిని పెద్దదిగా చేయకుండా గాయం రక్తం ఓడుతున్నా.. ప్రథమ చికిత్స చేయించుకుని హైదరాబాద్‌కు బయలుదేరడం సరైన నిర్ణయంగానే వారు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా ఈ సంఘటనను ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూసి ఉంటే ఏమీ జరగనట్లుగా ఉండే వారే కాదని వారు భావిస్తున్నారు. ఇంత కష్టంలోనూ పాదయాత్రను పునఃప్రారంభించాలని వైఎస్ జగన్ పట్టుదలతో ఉండటం ఆయన ధృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి, అమరావతి -
అదే నా సంకల్పం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలిగించాలన్నదే తన సంకల్పం, తపన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పే ర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశా రు. ‘‘గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతి త్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చెడు మీద విజయానికి దీపావళి ప్రతీక దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కాంతులు నింపాలని వైఎస్ జగన్ అభిలషించారు. గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతిత్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన. — YS Jagan Mohan Reddy (@ysjagan) 5 November 2018