ప్రజాసంకల్పయాత్రలో ప్రజలను పలకరిస్తున్న జననేత వైఎస్ జగన్
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు.
నాడు... ప్రజాప్రస్థానం పేరుతో రాజన్న చేపట్టిన పాదయాత్ర 1,470 కిలోమీటర్లు కొనసాగింది.. ఆ యాత్ర నుంచే ‘ప్రజా మానిఫెస్టో’ రూపుదిద్దుకుని... రైతును రాజు చేసింది... నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించింది... అన్నివర్గాల ప్రజలకు మేలు చేసి కోట్లాది మంది గుండెల్లో ‘మహానేత’ను కొలువుదీరేలా చేసింది... ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇప్పటికే 3200 కిలోమీటర్లుకు పైగా కొనసాగింది... ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది.. స్వార్థ రాజకీయాల కుట్రలకు బలై కాస్త విరామం తీసుకుంది.. అంతేకానీ ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఇసుమంత కూడా తగ్గించలేకపోయిందంటూ భావోద్వేగానికి లోనైన ఓ అభిమాని పంచుకున్న భావాలివి..
అన్నా,
ప్రజాసంకల్ప పాదయాత్రలో నువు నడవడం మొదలు పెట్టి 1 సంవత్సరం అయ్యింది. మాకోసం రాళ్లూ, రప్పలు లెక్క చేయకుండా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నావ్. నాకు తెలుసన్నా. ఈ నడక ఎంత కష్టమో? నాకు తెలుసన్నా ఈ యాత్ర ఎట్టాంటి యాతనో? ఎందుకంటే పేదోడికి ఏది కావాలన్నా ఈ కాళ్లను నమ్ముకునే పోవాలి గదన్నా? అందుకే నీ కష్టం మాకు తెలుసు. మైళ్లకు మైళ్లు నడిచి ఎళ్లి పింఛన్ కోసం పడిగాపులు కాచిన ముసలయ్య కాళ్లకు నీ కష్టం తెలుసు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక టాంకర్ల దగ్గర బిందెలు మోసే చెల్లెమ్మలకు తెలుసు నీ పాదాలు మోసే బరువెంతో. ఒక్క సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగే కుర్రోళ్లకు తెలుసు కాళ్లరిగిపోవడం అంటే ఏమిటో? లక్షల ఫీజులు కట్టలేక ప్రైవేటు బళ్లలో బెంచెక్కి నిలబడే పిల్లగాళ్లకు తెలుసు ఆ కాళ్లకెంత కష్టమో? అందుకే అన్నా నువ్వొచ్చే ప్రతి చోటా మేము పూలు జల్లుతున్నాము.
తాహతు ఉంటే పట్టుచీరలే పరవాలనుకుంటున్నాము. ఎందుకంటే మా కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు అప్పుడు మీ అయ్య వచ్చాడు...ఇలాగే..అచ్చం ఇలాగే.. గడపగడపకూ వచ్చి పలకరించాడు. గుండె గుండెనూ తాకి ధైర్యమిచ్చాడు. ఇప్పుడు నువ్వూ అంతే. నా వాళ్లంటూ ఆదరిస్తున్నావు. నీ సంగతి మరచి మాకోసమే పరితపిస్తున్నావు. మా కన్నీళ్లు తుడుస్తున్నావు. మా చెమటను తాకుతున్నావు. మా కష్టాన్ని వింటున్నావు. మాకు ఓదార్పు అవుతున్నావు. అందుకే అన్నా నీ కష్టం మా కష్టంగా ఉంది. నీ భుజానికి గాయమైతే మా గుండెకు నొప్పేసింది. నీ అడుగులు నువు కోరిన గమ్యం వైపు సాగాలన్నా? అందుకు మా అందరి సహకారం ఉంటుంది. నీ గెలుపే మా కష్టాలను తీర్చే మలుపు అని నమ్ముతున్నాం అన్నా. మాకై నడిచి వస్తున్న నీ పాదాలకు పట్టాభిషేకం చేస్తామన్నా... జగనన్నా నువ్వే మా ధైర్యం. నువ్వే మా ఆశాకిరణం.
ఇట్లు
నీ ప్రియమైన అభిమాని
Comments
Please login to add a commentAdd a comment