పాలకుల్లో సమన్యాయం లోపించింది. కుట్రలుకుతంత్రాలకు పాల్పడుతున్నారు. అడుగడుగునాఅన్యాయానిదే పైచేయి అవుతోంది. అణగారినవర్గాలకు రిక్తహస్తం ఎదురవుతోంది. రైతులకుభరోసా లేదు, అర్హతతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల పక్షానప్రభుత్వానికి విన్నవిస్తే హేళనే ప్రధాన భూమికైంది.ఎంత కష్టమొచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినాప్రజలకు అండగా నిలవాలనే ‘సంకల్పం’ మొలచింది.వెరసి ఇడుపులపాయ నుంచి తొలి అడుగు పడింది.3,211 కిలోమీటర్లు అలుపుసొలుపు లేకుండా‘ప్రజాసంకల్ప యాత్ర’ సాగింది. కనీవిని ఎరుగని రీతిలోప్రజాభిమానంతో తడిసిముద్దవుతున్న ప్రతిపక్షనేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రకు చేరువలో ఉన్నారు.ఈక్రమంలో అసూయ, ద్వేషం, పుట్టుకొచ్చాయి.ఏకంగా అంతమొందించే పథక రచన తెరపైకి వచ్చింది.
సాక్షి ప్రతినిధి కడప: ఆంధ్రావని అభివృద్ధే లక్ష్యంగా... ప్రజా హితమే ధ్యేయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరిగ్గా ఇదే రోజున గత ఏడాది నబంబరు 6న జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. తొలి అడుగుతో ప్రారంభమైన ‘ప్రజాసంకల్పయాత్ర’ 3,211 కిలోమీటర్లు నిర్విరామంగా కొనసాగింది. లక్షలాది మందితో మమేకమౌతూ... వారి కష్టాలు తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ...దగా పడ్డ జనానికి భరోసా కల్పిస్పూ.. ముందుకు సాగారు. 12జిల్లాల్లో ప్రజల ఆదరణ రోజురోజుకు రెట్టింపు అవుతూ వచ్చింది. రాబోవు రోజుల్లో ప్రజలు అగ్రపీఠం వేస్తారనే భావన పాలకపక్షంలో పడింది. ఈక్రమంలో కుట్ర కోణం తెరపైకి వచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గతనెల 25న హత్యాయత్నం చోటుచేసుకుంది. యావత్తు తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. ఊహించనిపరిణామాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఆపై మరో కపట నాటకాన్ని సృష్టించడం పాలకుల వంతు అయిందని పరిశీలకులు వివరిస్తున్నారు.
పేద ప్రజలకు తోడు నీడగా....
2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా సాగింది. గత అక్టోబర్ 25 నాటికి 294రోజులు చేపట్టిన పాదయాత్రలో 3211.5 కిలోమీటర్లు నడిచారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా... ఆత్మబంధువుగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ప్రభుత్వం ఆసరాగా నిలివాల్సి ఉండగా నామమాత్రపు చర్యలుండడంతో బాధితులకు కొండంత ధైర్యం నింపుతూ... బడుగు, బలహీన వర్గాల్లో నేనున్నానని.. మీకేం కాదని భరోసా కల్పిస్తూ ఎక్కడికక్కడ ముందుకు కొనసాగింది. ఇంటి బిడ్డలా...కష్టంలో ఇంటికి పెద్దన్నలా ఉంటానం టూ హామీ ఇçస్తూనే భవిష్యత్‌పై భరోసా కల్పించారు. ఇబ్బడి ముబ్బడి ప్రజా సమస్యలు తెరపైకి వస్తుండడంతో అలుపెరగని బాటసారిగా ప్రతిపక్షనేత ప్రజాసంకల్పయాత్రను కొనసాగించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వం తత్తరపాటు...
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు విన్నపాలు అధికమయ్యాయి. ప్రభుత్వ డొల్లతనాన్ని ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువస్తున్నారు. ఈక్రమంలో ప్రజా విన్నపాలపై ప్రజానేత స్పందిస్తూ తక్షణమే హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ తత్తరపాటు తెరపైకి వచ్చిందని పలువురు వెల్లడిస్తున్నారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడికక్కడ వారి సమస్యలకు అండగా నిలుస్తుండడమే అందుకు కారణంగా పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. సంక్షేమ పథకాల్లో ఏకపక్ష నిర్ణయాల కారణంగా రాజన్న రాజ్యం కోసం ప్రజానీకం ఎదురుచూస్తోందని నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దల్ని అదిలించినట్లు తెలుస్తోంది. ఇక ఉన్న ఏకైక మార్గం కుట్రలు కుతంత్రాలేనని గ్రహించి పక్కా ప్రణాళిక బద్ధంగా పథక రచన చేసినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆపై హత్యాయత్నం ఘటన తెరపైకి రావడంతో తాత్కాలికంగా సంకల్పానికి విరామం పడింది. సంకల్పధీరుడు ప్రజల కోసం మరింత పట్టుదలతో ప్రజాముంగిటకు చేరుకోవాలని తెలుగు ప్రజలు ఆకాంక్షిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment