తాడేపల్లిగూడెం మురిసింది | YS jagan Praja Sankalpa Yatra Special Story in West Godavari | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెం మురిసింది

Published Tue, Nov 6 2018 7:28 AM | Last Updated on Tue, Nov 6 2018 7:28 AM

YS jagan Praja Sankalpa Yatra Special Story in West Godavari - Sakshi

గణపవరంలో

ఆయన జన హృదయ విజేత..  ప్రజల సంక్షేమమే ధ్యేయం... బడుగుల బతుకులు బాగుచేయాలనేది ఆయన ధ్యాస.. అందుకే మురికివాడల బాట పట్టాడు.. గోతుల రోడ్లు.. ముళ్ల దారిలో నడిచాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించాడు. మన కోసం జన నాయకుడు వచ్చాడని ప్రజలు పొంగిపోయారు. ఆయనతో కలిసి అడుగులో అడుగేశారు. సమస్యలుచెప్పుకున్నారు.. తమ రాతలు మార్చే నాయకుడితడేనని మురిసిపోయారు. జననేతకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పాలకులు ఆయనను హతమార్చేందుకు యత్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కుటిల పాలకులపై ధ్వజమెత్తుతున్నారు. ఖబడ్దార్‌.. అంటూ హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో జననేత అడుగు జాడలను స్పృశించే ప్రయత్నం..

ఏలూరు టౌన్‌: ఏలూరు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు  మండలం సుంకరవారితోటలో జగన్‌ 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో  2వేల కిలోమీటర్ల మైలురాయి పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహం ఆయనతో అడుగులు వేస్తూ ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు.  సభలో ఆటోడ్రైవర్లకు వరాలను ప్రకటించారు. సొంతంగా ఆటో నడుపుకునే ఆటోవాలాలకు ఏడాదికి రూ.10వేలు అందజేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆటోడ్రైవర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆటోడ్రైవర్లు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఏవిధంగా నష్టపోతుందీ వివరించారు. ఇన్సూరెన్స్, ట్యాక్స్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము ట్యాక్స్‌లు కట్టడానికే సరిపోతుందని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఆటోడ్రైవర్‌కు రూ.10వేలు అందజేసి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఆటోవాలాల కోరిక మేరకు స్వయంగా ఆటోను నడిపారు.

భీమవరం: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరానికి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో మూడురోజులపాటు ప్రజాసంకల్ప పాదయాత్ర జరిగింది. మండుటెండలు, జోరువానను సైతం లెక్కచేయకుండా జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. భీమవరం బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాదిరాజు సుబ్బరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఏఎస్‌ రాజు, టీడీపీ నాయకులు ఎన్‌వీఆర్‌ దాసు, మాజీ కౌన్సిలర్‌ నల్లం రత్నకుమారి వంటి నేతలతో సుమారు 200 మంది వరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌           పార్టీలో చేరారు. ప్రజలతో మమేకమైన జననేత జగన్‌పై ఇప్పుడు హత్యాయత్నం జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆయనపై హత్యాయత్నాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.  

ఆక్వాకు వరాలు
గణపవరం: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో మూడు రోజుల పాటు వైఎస్‌ జగన్‌ యాత్ర జరిగింది.  ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేని ఎండ తీవ్రతను లెక్కచేయకుండా వేలాదిగా జనం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులో అడుగేస్తూ.. ముందుకు సాగారు. ఆయనతో కష్టసుఖాలు పంచుకున్నారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఫలితంగా నష్టాల బాటపట్టామని  ఆక్వా రైతులు వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. అనంతరం గణపవరంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో ఆక్వా రైతులపై జగన్‌ వరాల జల్లు కురిపించారు.  విద్యుత్‌ చార్జీలకు రాయితీ ప్రకటించారు. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 కే అందిస్తామని రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రైతులకు నాణ్యమైన సీడ్‌ అందించడానికి కేంద్రాలతోపాటు, సరకును నిల్వ చేసుకోవడానికి మండలానికో శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం, నామమాత్ర ఫీజులతో చేప, రొయ్యల వ్యాధులను పరీక్షించే ల్యాబ్‌లు ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జగన్‌ హామీలతో తేలుకుట్టిన దొంగలా రాష్ట్ర ప్రభుత్వం విలవిల్లాడింది. తామూ ఆక్వా రైతులకు అండగా ఉంటామని యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తామంటూ హడావుడిగా ప్రకటించింది. అయితే ఆ హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు.  
వరి రైతులకూ భరోసావరి రైతులకు కూడా అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటుధర, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇస్తామని ప్రకటించారు. పెట్టుబడి రుణం ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని హామీఇచ్చారు.

మత్స్యకారులకు జననేత బాసట..
నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో రెండురోజులపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జరిగింది. ఈ రెండురోజులూ తీరం జనసంద్రమైంది. నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల మేర జననేత ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఆయనపై ఇప్పుడు హత్యాయత్నం జరగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టణంలోని స్టీమర్‌రోడ్డులో జరిగిన భారీ బహిరంగ సభలో దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలపై ఆయన విస్పష్టమైన హామీలు ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం చేపడతామన్నారు.

మత్స్యకారులకు వరాలు
తీరంలోని మత్స్యకారులకు ఆయన వరాలు ఇచ్చారు. మత్స్యకారులు వేటసాగిస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని, వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉండే మత్స్యకారులకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు.  లేసు అల్లిక కార్మికుల కష్టాలూ తీరుస్తానని భరోసా ఇచ్చారు.    తీరంలో సాగు, తాగునీటి సమస్య తీరుస్తామని, నల్లీక్రీక్‌ పూడికతీత పనులు  చేస్తామన్నారు.

ఆటో డ్రైవర్లకు ఆదరణ
ఏలూరు టౌన్‌: ఏలూరు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు  మండలం సుంకరవారితోటలో జగన్‌ 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో  2వేల కిలోమీటర్ల మైలురాయి పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహం ఆయనతో అడుగులు వేస్తూ ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు.  సభలో ఆటోడ్రైవర్లకు వరాలను ప్రకటించారు. సొంతంగా ఆటో నడుపుకునే ఆటోవాలాలకు ఏడాదికి రూ.10వేలు అందజేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆటోడ్రైవర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆటోడ్రైవర్లు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఏవిధంగా నష్టపోతుందీ వివరించారు. ఇన్సూరెన్స్, ట్యాక్స్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము ట్యాక్స్‌లు కట్టడానికే సరిపోతుందని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఆటోడ్రైవర్‌కు రూ.10వేలు అందజేసి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఆటోవాలాల కోరిక మేరకు స్వయంగా ఆటోను నడిపారు.

దెందులూరు ఘన స్వాగతం
దెందులూరు : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో తొలి అడుగు వేశారు. ఏలూరు రూరల్‌ మండలం పెదయడ్లగాడిలో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. శ్రీరామవరం గ్రామంలో జననేతను కలిసిన సీతంపేట గ్రామానికి చెందిన బాలుడు నాగమణికంఠకు తలలో రక్తం గడ్డకట్టడంతో అతని తల్లిదండ్రులు జననేతకు వివరించారు. దీనికి స్పందించిన జననేత రూ.ఐదు లక్షలతో తిరుపతిలోని ఆస్పత్రిలో బాలుడికి ఆపరేషన్‌ చేయించారు. దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రైతు సదస్సులో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు ఏటా మేనెలలో రూ.50 వేలు నేరుగా రైతులకు అందిస్తామని పేర్కొన్నారు. పావలా వడ్డీ రుణాలను అందిస్తామని వెల్లడించారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.2 వేల కోట్ల రూపాయలతో కెలామిటి రీలీఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

దేవుడు జగన్‌ పక్షాన ఉన్నాడు
అనునిత్యం ప్రజల కోసం తపించే జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా బయటపడ్డారు. లేకపోతే మళ్లీ టీడీపీ పాలకుల చేతుల్లో ప్రజలు దగాపడేవారు. జననేతపై హత్యాయత్నం కలచివేసింది. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి ఆయనను గెలిపించుకుంటాం.– ముసునూరి సీతారామయ్య, వృద్ధుడు, గాలాయగూడెం

తాడేపల్లిగూడెం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మూడురోజులపాటు పర్యటించారు. తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరిగింది. అడుగడుగునా.. ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అశేష జనవాహని జననేత వెంట అడుగులేశారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి జగన్‌ హామీ ఇచ్చారు.   

పాదయాత్ర అభినందనీయం
రాష్ట్ర ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం గత ఏడాది కాలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర చేపట్టడం అభినందనీయం. ఏడాది కాలంగా భార్యా పిల్లలను, కుటుంబాన్ని వదిలి ప్రజాసమస్యలపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. అటువంటి వ్యక్తిపై హత్యాయత్నం చేయడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ దాడి కుట్రపూరితంగానే జరిగినట్లు తెలుస్తోంది.  
– రేవిడి సన్యాసిరావు, తాడేపల్లిగూడెం

సంకల్ప బలానికి సలాం
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో మొక్కవోని ధైర్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. నియోజకవర్గంలో మూడురోజలపాటు పాదయాత్ర సాగింది. పెరవలి మండలం కానూరు కొండలమ్మ గుడి సమీపంలో తేనెటీగలు ఒక్కసారిగా చుట్టిముట్టినా చలించకుండా ఆయన ముందుకు సాగారు. చుట్టూ ఉన్న ప్రజలు పరుగులు తీసినా.. ఆయన మాత్రం ధైర్యంగా ముందుకు కదిలారు. ఆయన సంకల్ప బలం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సలాం కొట్టారు. నిడదవోలులోజరిగిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement