
సాక్షి, వైఎస్సార్ కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లుండి కడప విమానాశ్రయానికి చేరుకుంటారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం కడపలోని అమీర్ పీర్ దర్గాను వైఎస్ జగన్ సందర్శిస్తారని తెలిపారు. అనంతరం ఆయన దర్గానుంచి తిరిగి విమానశ్రయానికి చేరుకుంటారని, అక్కడినుంచి ప్రత్యేక చాపర్ ద్వారా పులివెందులకు చేరుకుంటారన్నారు.
అక్కడ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారని వెల్లడించారు. ఇడుపులపాయలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని ఆయన మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment