
గోసుల కృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్
అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన గోసుల కృష్ణారెడ్డిని
హైదరాబాద్: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన గోసుల కృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. కృష్ణారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి స్నేహితుడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు గంట సేపు ఆసుపత్రిలో గడిపారు.
కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు కూడా పరామర్శించారు.