
సీపీఐ నారాయణకు 'సమైక్య సెగ'
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సమైక్య సెగ తగిలింది. సోమవారం అనంతపురం వచ్చిన ఆయన్ని నందిని హోటల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద పెట్టున్న నినాదాల చేశారు. దాంతో సీపీఐ కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను దౌర్జన్యానికి దిగారు.
దాంతో ఇరుపార్టీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారిని శాంతింప చేశారు.