
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు ఊహించని షాక్ తగిలింది. తొలి రౌండ్ కౌంటింగ్‌లో మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు వెనుకంజలో పడ్డారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ 1814 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. సోమిరెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కాకాణి గోవర్ధర్ రెడ్డి 1750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్ ముందంజలో ఉన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని, పోలీసులకు వారంతపు సెలవు ప్రకటిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. ఈ విషయం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలతో స్పష్టమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో అధిక స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో ఫ్యాన్ 101 సీట్ల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment