వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండల పరిధిలోని కే.బ్రాహ్మణపల్లిలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. గ్రామానికి చెందిన కుళ్లాయప్ప దుస్తుల వ్యాపారి. ఏడాదిగా ఊళ్లో లేడు. అయితే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశాడనే కక్షతో గురువారం రాత్రి ఊరికి వచ్చిన తనపై టీడీపీ నాయకులు కెంపయ్య, ,ముత్తిగాడు, శంకరయ్యతో పాటు మరికొందరు తమ ఇంటికి వచ్చి విచక్షణారహితంగా తనపై దాడి చేసినట్లు బాధితుడు వాపోయాడు.
అడ్డు వచ్చిన తన బంధువులు క్రిష్ణ, మారెప్ప, రాజు, అశ్వర్థామ, దొడ్డెమ్మ,గంగన్న,కళ్యాణ్‌లపై కూడా దాడి చేశారన్నాడు. గతంలో వారు చేయాలనుకునే మేనరికపు వివాహాన్ని తాను అడ్డుకున్నాననే దాడికి పాల్పడినట్లు చెప్పాడు. ఈ మేరకు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. కాగా మరో వర్గం కూడా తమపై కుళ్లాయప్ప, ఆయన బంధువులు దాడి కి పాల్పడ్డారని కేసు పెట్టినట్లు ఏఎస్‌ఐ రాము చెప్పారు.
కదిరి రూరల్ మండల పరిధిలోని కే.బ్రాహ్మణపల్లిలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. గ్రామానికి చెందిన కుళ్లాయప్ప దుస్తుల వ్యాపారి. ఏడాదిగా ఊళ్లో లేడు. అయితే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశాడనే కక్షతో గురువారం రాత్రి ఊరికి వచ్చిన తనపై టీడీపీ నాయకులు కెంపయ్య, ,ముత్తిగాడు, శంకరయ్యతో పాటు మరికొందరు తమ ఇంటికి వచ్చి విచక్షణారహితంగా తనపై దాడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. అడ్డు వచ్చిన తన బంధువులు క్రిష్ణ, మారెప్ప, రాజు, అశ్వర్థామ, దొడ్డెమ్మ,గంగన్న,కళ్యాణ్‌లపై కూడా దాడి చేశారన్నాడు. గతంలో వారు చేయాలనుకునే మేనరికపు వివాహాన్ని తాను అడ్డుకున్నాననే దాడికి పాల్పడినట్లు చెప్పాడు. ఈ మేరకు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. కాగా మరో వర్గం కూడా తమపై కుళ్లాయప్ప, ఆయన బంధువులు దాడి కి పాల్పడ్డారని కేసు పెట్టినట్లు ఏఎస్‌ఐ రాము చెప్పారు.