వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. తిరపతి సమీపంలోని దుర్గసముద్రం ధర్మరాజుల గుడి వద్ద జరిగిన సమావేశానికి వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారెడ్డి..
తిరుపతి అర్బన్: వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. తిరపతి సమీపంలోని దుర్గసముద్రం ధర్మరాజుల గుడి వద్ద జరిగిన సమావేశానికి వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాండురంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఎనిమిది జిల్లాలకు సంబంధించి డిస్కం అధ్యక్షులుగా తిరుపతి ఈఆర్వో-టి2 సీనియర్ అసిస్టెంట్ ఆర్.రమేష్‌బాబు, తిరుపతి కన్‌స్ట్రక్షన్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్ బి.బాలాజి కార్యదర్శిగా ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు. రాబోయే డిస్కం ఎన్నికల వరకు వీరు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌బేరర్లుగా పనిచేస్తారని, డిస్కం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తారని పాండురంగారెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం రీజినల్ కార్యవర్గాన్ని ఎన్నుకుంది.
చిత్తూరు ఈఆర్వో-టి సీనియర్ అసిస్టెంట్ బి.వెంకోబరావు రీజనల్ అధ్యక్షులుగా, తిరుపతి రూరల్ సెక్షన్ లైన్‌మేన్ ఎస్.జయప్రకాష్‌ను రీజనల్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వీరు జరగబోవు రీజనల్ ఎన్నికల వరకు పై పదవులలో కొనసాగుతారని వైఎస్సార్‌సీపీ డిస్కం అధ్యక్షులు రమేష్‌బాబు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుంణంగా పనిచేస్తూ, విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు చిత్తశుద్ధితో పోరాడుతామని నూతన కార్యవర్గం వెల్లడించింది.