సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఉపాధ్యాయులకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. గురువారం జరగనున్న సీమాంధ్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి విజ్ఞప్తి చేశారు.