ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథరాజు
అభ్యర్థి పేరు: చెరుకువాడ శ్రీరంగనాథరాజు
వయసు : 69, కులం : క్షత్రియ
ఆచంట: శ్రీరంగనాథరాజు రైస్ మిల్లర్‌గా పేర్గాంచారు. 24 ఏళ్లుగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. మొదటి సారి 2004లో అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉద్దండుడైన దండు శివరామరాజు మీద విజయం సాధించారు. భారతీయ విద్యా భవన్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వరిస్తున్నారు. పలు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తునారు.
కొవ్వూరు - తానేటి వనిత
అభ్యర్థి పేరు : తానేటి వనిత
వయసు : 45 ఏళ్లు, కులం : మాదిగ (ఎస్సీ)
వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయిని. భర్త శ్రీనివాసరావు వైద్యుడు (ఎండీ జనరల్). తాడేపల్లిగూడెంలో ఆస్పత్రి నిర్వíßహిæస్తున్నారు. వనిత 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 నవంబర్ 4న వైఎస్సార్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
నరసాపురం - ముదునూరి ప్రసాదరాజు
అభ్యర్ధి పేరు : ముదునూరి ప్రసాదరాజు
వయసు : 45 ఏళ్లు, కులం : క్షత్రియ
తన 29 ఏళ్ల వయసులో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే పదవి వదులుకున్నారు. ఈ కారణంగా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆచంటలో పోటీచేసి అతితక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా ఉన్నారు.
నిడదవోలు - జి.శ్రీనివాసనాయుడు
అభ్యర్థి : జి.శ్రీనివాసనాయుడు
వయసు : 51 ఏళ్లు, కులం : కాపు
శ్రీనివాసనాయుడుది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈయన తండ్రి జీఎస్ రావు పీసీపీ అధ్యక్షునిగా, కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీనివాసనాయుడు ఉన్నత విద్యావంతుడు, పారిశ్రామికవేత్త. బిఈ (మెకానికల్), ఎంబీఏ (అమెరికా) చదివారు. 1994 నుంచి 2004 వరకు కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తండ్రికి సహాయం పడ్డారు. మొదటి సారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశాసి స్వల్ప తేడాతో ఒటమి చెందారు.
ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)
అభ్యర్థి : పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)
వయసు : 51ఏళ్లు, కులం : కాపు
వాసుబాబు స్వగ్రామం నిడమర్రు మండలం బువ్వనపల్లి. ఆయన గ్రామ సర్పంచ్‌గా చేశారు. తండ్రి ఏసుబాబు 1981లో గణపవరం సమితి అధ్యక్ష ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. వాసుబాబు 2006లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2004లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వైఎస్సార్ సీసీ ఆవిర్భావంతో పార్టీలో చేరారు.
చింతలపూడి - వీఆర్ ఎలీజ
అభ్యర్థి : వీఆర్ ఎలీజ
వయసు: 58 ఏళ్లు , కులం : మాల
ఐఆర్‌ఎస్ కేడర్‌కు చెందిన ఎలీజా అడిషనల్ కమీషనర్ (జీఎస్టీ)గా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990లో సివిల్ సర్వీసెస్‌లో ఐఆర్‌ఎస్ కు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం తరుఫున పలు దేశాల్లో శిక్షణ కూడా పొందారు. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించారు. స్వస్థలం చింతలపూడి. భార్య ఝాన్సీలక్ష్మీబాయి. పెద్ద కుమారుడు డాక్టర్ కమల్ దీప్. ద్వితీయ కుమారుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
అభ్యర్థి : కొట్టు సత్యనారాయణ
వయసు : 64 ఏళ్లు, కులం : కాపు
సత్యనారాయణ 1994లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994, 1999 కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో నియోజకవర్గ రూపురేఖలను మార్చారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో రూ. 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
గోపాలపురం - తలారి వెంకట్రావు
అభ్యర్థి: తలారి వెంకట్రావు
వయసు : 50 ఏళ్లు, కులం : మాల (ఎస్సీ)
తలారి వెంకట్రావు గతంలో లిడ్ క్యాప్ డైరెక్టర్‌గా, భారత టెలికాం బోర్డు సభ్యులు, రైల్వే బోర్డు సభ్యుడుగా పదవులు నిర్వహించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశించారు. 20014లో గోపాలపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చేసిన తరువాత బీఎస్సీ డిగ్రీ కూడా చేశారు. వ్యవసాయం చేస్తారు. పౌల్ట్రీ ఫాంలు ఉన్నాయి. భ్యార్య పరంజ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.
తణుకు - కారుమూరి వెంకటనాగేశ్వరరావు
అభ్యర్థి: కారుమూరి వెంకటనాగేశ్వరరావు
వయసు : 55 ఏళ్లు, కులం : యాదవ (బీసీ–డి)
కారుమూరి నాగేశ్వరరావు 1990లో కాంగ్రెస్‌లో చేరారు. 2006లో ద్వారకాతిరుమల జెడ్పీటీసీ సభ్యునిగా విజయం సాధించి జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. అనంతరం తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడంతో జెడ్పీ చైర్మన్ పదవికి 2009లో రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 2014లో వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఏలూరు - ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ (నాని)
అభ్యర్థి : ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ (నాని)
వయసు : 48 ఏళ్లు, కులం : కాపు
ఆళ్ల నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడిగా పేరుంది. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీ చేశారు. 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికై రికార్డు సృష్టించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈయన వ్యాపారం చేస్తారు. భార్య ఫణిరేఖ, కుమార్తె మణిచంద్ర, కుమారుడు ఆశిష్ ఉన్నారు.
పాలకొల్లు - డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి)
అభ్యర్థి: డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి) వయసు : 77 ఏళ్లు, కులం : కాపు
పాలకొల్లుకు చెందిన డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి మంచి హస్తవాసి గల వైద్యుడిగా పేర్గాంచారు. 1972లో పాలకొల్లులో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేసి అదే ఏడాది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009టీడీపీ అభ్యర్థిగా, 2014లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. భార్య లక్ష్మీ చిట్టి కామరాజమ్మ కుమార్తె డాక్టర్ సబిత (లేటు), డా.అంజన్.
పోలవరం - తెల్లం బాలరాజు
అభ్యర్థి : తెల్లం బాలరాజు
వయసు : 44 ఏళ్లు, కులం : కోయ (ఎస్టీ)
బాలరాజు రాజకీయ ప్రస్థానం 2004లో ప్రారంభమైంది. వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేస్తున్న బాలరాజుకు వెఎస్ 2004లో పోలవరం టికెట్ ఇచ్చారు. అఖండ విజ యం సాధించారు. 2009లో మరోసారి గెలిచారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. స్వస్థలం బుట్టాయగూడెం మండలం, దుద్దుకూరు. భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు.
దెందులూరు - కొఠారు అబ్బయ్యచౌదరి
అభ్యర్థి : కొఠారు అబ్బయ్యచౌదరి
వయసు : 37 ఏళ్లు, కులం : కమ్మ
లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉన్న అబ్బయ్య చౌదరి అది వదులుకుని రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన తండ్రి రామచంద్రరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్ సీపీలో చేరారు. తండ్రిని అనుసరిస్తూ అబ్బయ్య చౌదరి రాజకీయాల్లోకి ఇటీవలే ప్రవేశించారు. స్వస్థలం పెదవేగి మండలం రాయన్నపాలెం. భార్య అనురాధ లండన్‌లోని లాయిట్ బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నారు.
ఆకివీడు - పీవీఎల్ నరసింహరాజు (పీవీఎల్)
అభ్యర్థి : పీవీఎల్ నరసింహరాజు (పీవీఎల్)
వయసు : 58 ఏళ్లు, కులం : క్షత్రియ
ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన పీవీఎల్ నరసింహరాజు సహకార రంగం ద్వారా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. పీవీఎల్ తిమ్మరాజు కుమారుడైన ఆయన డిగ్రీ చదివారు. అనంతరం వ్యవసాయం చేస్తూనే పారిశ్రామిక వేత్తగా కూడా ఎదిగారు. యండగండి కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎన్‌సీబీసీ ఎక్సెలెంట్ అవార్డును రెండుసార్లు అందుకున్నారు.
భీమవరం - గ్రంధి శ్రీనివాస్
అభ్యర్ధి : గ్రంధి శ్రీనివాస్
వయసు : 56 ఏళ్లు, కులం : కాపు
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా గత ఏడాది మే 27న భీమవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీనివాస్ భీమవరం అర్బన్‌బ్యాంకు చైర్మన్‌గా పనిచేస్తుండగా 2004లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment