కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా | Ysrcp Kurnool District Mla Candidate List | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా

Published Mon, Mar 18 2019 9:23 PM | Last Updated on Tue, Mar 19 2019 1:43 PM

Ysrcp Kurnool District Mla Candidate List - Sakshi

ఒకటే లక్ష్యం.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ ఏర్పాటే ధ్యేయం.. పరిగణనలోకి ఎన్నో సమీకరణలు.. ఎందరో ఆశావహులు.. సామాజిక లెక్కలు.. చివరకు గెలుపు గుర్రాలకే టికెట్లు అన్నట్లుగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ అధినేత అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. సమరోత్సాహంతో ప్రచారపోరుకు సమాయత్తమవుతున్న తరుణంలో అసెంబ్లీ నియోజక వర్గ  వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల  వివరాలు.. 

డోన్‌      బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి   


తల్లిదండ్రులు     : రామనాథ రెడ్డి, పార్వతమ్మ  
స్వగ్రామం    :      బేతంచర్ల  
పుట్టిన తేదీ    :  27–09–1970 
చదువు    :    బీటెక్‌ 
కుటుంబ సభ్యులు     : భార్య రూప, కుమారుడు అర్జున్, కుమార్తె ఐశ్వర్య 
వృత్తి    :    మైనింగ్‌ వ్యాపారం  
రాజకీయ స్ఫూర్తి    :    బుగ్గన శేషారెడ్డి (జేజి నాయన)  
ఇష్టమైన నాయకులు     :  కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  
రాజకీయ నేపథ్యం    : 1955లో తన జేజినాయన బుగ్గన శేషారెడ్డి డోన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత కాలంలో తండ్రి రామనాథ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా పనిచేశారు. బుగ్గన               రాజేంద్రనాథ్‌రెడ్డి  2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డోన్‌ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పీఏసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.  
 

కోడుమూరు     జరదొడ్డి సుధాకర్‌ 


తల్లిదండ్రులు    :    బాలనాగమ్మ,  ఆనందం 
స్వగ్రామం    :     ఎస్‌హెచ్‌ ఎర్రగుడి 
పుట్టిన తేదీ    :     06–05–1974 
చదువు     :     బీడీఎస్‌ (యుహెచ్‌ఎస్‌) ఎండీఎస్‌ (ఉస్మానియా) 
కుటుంబం    :      భార్య విజయలలిత, సంతానం శుక్రుత, సాకేత్‌ ఆనంద్‌ 
రాజకీయ స్ఫూర్తి    :     వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఇష్టమైన నాయకుడు    :     దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 
జీవిత లక్ష్యం    :    నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం  


నందికొట్కూరు    తొగురు ఆర్థర్‌  


తల్లిదండ్రులు    :     మార్తమ్మ, శ్యామూల్‌ 
స్వగ్రామం     :     మద్దూరు, పాములపాడు మండలం, నందికొట్కూరు నియోజకవర్గం 
పుట్టిన తేది    :     10–07–1955 
చదువు     :    బీఏ  
కుటుంబ సభ్యులు    :     భార్య వంట్ల పాపమ్మ (ప్రేమ వివాహం), కుమారుడు వివేక్‌ జయ సందీప్, కుమార్తె విజయ సిరి సింధూర 
వృత్తి     :     రిటైర్డ్‌ కమాండెంట్‌ (ఎస్పీ) 
నేపథ్యం    :    1982లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు విధుల్లో చేరి ఎస్పీ స్థాయికి ఎదిగారు. పాములపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఈయనకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. పోలీసు శాఖలో ఉన్నత స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తూ సౌమ్యుడిగా పేరు సంపాదించారు. కష్టాల్లో ఉన్న వారు ఆయన వద్దకు వెళితే తనవంతు సాయం చేసే వ్యక్తిత్వం. 

పాణ్యం      కాటసాని రాంభూపాల్‌రెడ్డి 

తండ్రి పేరు     :     కాటసాని నరసింహారెడ్డి 
స్వగ్రామం    :    గుండ్ల శింగవరం,   అవుకు మండలం 
పుట్టిన తేది     :     27–12–1959. 
చదువు       :     బీఏ 
కుటుంబ సభ్యులు    :    భార్య ఉమామహేశ్వరమ్మ, కుమారుడు శివ నరసింహా రెడ్డి, కుమార్తెలు ఉషారాణి, దేదీప్యా రాణి, మాధవీలత.  
రాజకీయ అరంగేట్రం  : మొదటి సారిగా 1980లో గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక. అనంతరం 1985, 1989, 1994, 2004, 2009లో పాణ్యం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాణ్యం నుంచి మొత్తం ఐదుసార్లు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది తిరుగులేని నాయకుడిగా ఉన్నారు.  


ఆళ్లగడ్డ : గంగుల బిజేంద్రారెడ్డి 

తల్లిదండ్రులు     :    ఇందిర, గంగుల ప్రభాకర్‌రెడ్డి ( వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ)
పుట్టిన తేదీ     :     14–07– 1987  
చదువు    :     ఎంబీఏ  
స్వగ్రామం     :    ఎర్రగుడిదిన్నె, రుద్రవరం మండలం, ఆళ్లగడ్డ నియోజకవర్గం 
రాజకీయ నేపథ్యం     :    ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల 
కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మొట్ట మొదటి సారిగా 1967లో గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్‌గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత  1980లో ఆయన పెద్ద కుమారుడు గంగుల ప్రతాప్‌రెడ్డి 
ఎస్వీ సుబ్బారెడ్డిపై గెలుపొంది రాజకీయ అరంగ్రేటం చేశారు. తరువాత ఆయన రెండో కుమారుడు గంగుల ప్రభాకరరెడ్డి  రెండుసార్లు కాంగ్రెస్, ఒక్కసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం గంగుల ప్రభాకరరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడైన గంగుల బిజేంద్రారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో ఆయన సేవలను గుర్తించి పార్టీ టికెట్‌ ఇచ్చింది. 


ఆదోని : ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్‌రెడ్డి  

తల్లిదండ్రులు    :     లలితమ్మ, భీమిరెడ్డి 
స్వగ్రామం    :     రాంపురం, మంత్రాలయం మండలం  
పుట్టిన తేది    :    23– 03– 1963 
చదువు    :    ఇంటర్‌మీడియట్‌ 
కుటుంబసభ్యులు    :    భార్య శైలజ, కుమారుడు జయమనోజ్‌ కుమార్‌రెడ్డి, కుమార్తె గౌతమి 
రాజకీయ చరిత్ర     :     తండ్రి భీమిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన నుంచే రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే పలు స్టూడెంట్స్‌ యూనియన్లకు నాయకత్వం వహించారు. 1989లో టీడీపీలో చేరి కౌతాళం మండల టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2002లో కాంగ్రెస్‌లో చేరారు.  2004లో ఆదోని కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  
రాజకీయ స్ఫూర్తి      :     ఎన్టీఆర్‌ 
ఇష్టమైన నాయకులు :    వైఎస్‌ రాజశేఖర రెడ్డి 
జీవిత లక్ష్యం    :    చివరి వరకు ప్రజా జీవితంలో ఉండడం    


ఆలూరు :       పెంచికలపాడు జయరాం

తల్లిదండ్రులు    :    శారదమ్మ, బసప్ప  
స్వగ్రామం    :    గుమ్మనూరు, చిప్పగిరి మండలం, ఆలూరు నియోజకవర్గం 
పట్టినతేది    :     16–10–1967  
చదువు     :    పదవ తరగతి 
కుటుంబీకులు    :    భార్య పి. రేణుక, కుమారుడు ఈశ్వర్, కుమార్తె
రాజకీయ నేపథ్యం     :     1997లో తల్లి పి.శారదమ్మ గుమ్మనూరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో జయరాం ఏరూరు టీడీపీ ఎంపీటీసీ  అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2006లో చిప్పగిరి మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2012లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1998 ఓట్లతో విజయం సాధించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఈయనకు మరో సారి అవకాశం వచ్చింది.


పత్తికొండ : కంగాటి శ్రీదేవి 


తల్లిదండ్రులు     :     కమ్మగిరిరెడ్డి, వెంకటలక్ష్మి 
స్వగ్రామం    :     బురుగుల, ప్యాపిలి మండలం, డోన్‌ నియోజకవర్గం 
పుట్టిన తేదీ     :    12–06–1972 
చదువు    :   బీఏ  
కుటుంబ సభ్యులు     :     భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి, కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, కుమార్తె స్నేహారెడ్డి 
రాజకీయ చరిత్ర    :    30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. 2013లో కేడీసీసీ బ్యాంక్‌ జిల్లా చైర్మన్‌గా పని చేశారు. 2015లో భర్త నారాయణరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తుండగా 2017 మే 21వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. 2017 నవంబర్‌లో జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... కంగాటి శ్రీదేవిని వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు.  
ఇష్టమైన నాయకుడు    :    వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి. 
జీవిత లక్ష్యం     :    జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడటం. 


శ్రీశైలం :  సింగారెడ్డి గారి శిల్పా చక్రపాణిరెడ్డి 

తల్లిదండ్రులు     :     వెంకట లక్ష్మమ్మ, చెన్నారెడ్డి 
స్వగ్రామం    :     కొండ సుంకేసుల, వైఎస్‌ఆర్‌ జిల్లా 
పుట్టిన తేది     :     1–07–1954 
చదువు     :     డిగ్రీ 
కుటుంబ సభ్యులు     :     భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు కార్తీక్‌రెడ్డి, కుమార్తె శ్వేత 
అభిరుచులు     :     స్నేహితులతో కలవడం, కొత్త ప్రదేశాలను చూడడం 
గతంలో వృత్తి     :     వ్యవసాయం 
రాజకీయ గురువు     :     దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 
రాజకీయ ప్రవేశం      :     2004, 2009లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో శిల్పా సహకార్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆత్మకూరు నియోజకవర్గంలోని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం, మహిళలకు అర్థిక సాయం చేయడం వంటి పనులు నిర్వర్తించారు. 2011 నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో కీలకంగా వ్యవహరించారు. అనివార్య కారణాలతో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తున్నారు. 


బనగానపల్లె  : కాటసాని రామిరెడ్డి

తల్లిదండ్రులు        :  కాటసాని ఓబులమ్మ, ఓబులరెడ్డి 
స్వగ్రామం    :     గుండ్ల శింగవరం, అవుకు మండలం 
చదువు     :     డిగ్రీ 
కుటుంబ సభ్యులు    :     భార్య జయమ్మ, కుమారులు ఓబుల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి (లేటు), కుమార్తెలు ప్రతిభ, ప్రణతి 
ఇష్టమైన నాయకులు     :    వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 
రాజకీయ నేపథ్యం     :      21 ఏళ్ల వయస్సులో 1987లో అవుకు మండలం మెట్టుపల్లె సింగిల్‌ విండో అధ్యక్షుడిగా, 1988–93 సంవత్సరాల మధ్య గుండ్ల శింగవరం సర్పంచ్‌గా, అవుకు మండల ఉపాధ్యక్షుడిగా, 1994–98 మధ్య బనగానపల్లె మండల జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.     


కర్నూలు : మొహమ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌

తండ్రి    :    మొహమ్మద్‌ అబ్దుల్‌ మోయీజ్‌ ఖాన్‌     
స్వగ్రామం    :     కర్నూలు 
పుట్టిన తేది    :    31– 01–1977     
కుటుంబ సభ్యులు    :    భార్య, కుమారుడు, కుమార్తె     
చదువు    :    డెట్రాయిట్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌  
ఉద్యోగం    :     అమెరికాలోని డెట్రాయిట్‌లో కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (2003 నుంచి 2011 వరకు)     
రాజకీయ నేపథ్యం    :     తాత బి.షంషీర్‌ఖాన్‌ 1967లో కేఈ మాదన్న (కాంగ్రెస్‌)పై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా, 1978లో ఇబ్రహీంఖాన్‌ ( కాంగ్రెస్‌)పై జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తండ్రి మోయీజ్‌ఖాన్‌ 1985 నుంచి 2011 వరకు కాంగ్రెస్‌ నాయకుడిగా పనిచేశారు. ఏఐసీసీ మెంబరుగా కూడా ఎంపికయ్యారు.  హఫీజ్‌ఖాన్‌ 2011లో వైఎస్‌ఆర్‌సీపీలో  చేరి పదవులు పొందారు.  

  
నంద్యాల :   సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి 


తల్లిదండ్రులు    :     శిల్పా మోహన్‌రెడ్డి, రమాదేవి 
పుట్టిన తేదీ    :     18–09–1983 
చదువు     :     అగ్రికల్చర్‌(బీఎస్సీ) 
కుటుంబ వివరాలు    :     భార్య నాగిని రెడ్డి, సంతానం సశ్యరెడ్డి, ఈషిర్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం    :     తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయ ప్రవేశం. నంద్యాల నియోజకవర్గంలో ఎవరికీ ఏ కష్టం వచ్చిన నేనున్నాంటూ భరోసా కల్పిస్తున్నారు. శిల్పా సహకార్‌ ద్వారా నంద్యాల ప్రజలకు మరింత దగ్గర కావాలని భార్య శిల్పా నాగిని ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  మహిళలకు పావలా వడ్డీ రుణం,చిరు వ్యాపారులకు వడ్డీలేని  రుణాలు, నియోజకవర్గంలో  మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు సొంత నిధులతో నిర్మించి ప్రజలకు ఉచితంగా అందించడం, పేదలకు వివాహ కార్యక్రమాలు, పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక సాయం అందజేయడం తదితర కార్యక్రమాలు చేస్తుంటారు.  


మంత్రాలయం  : ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి 

తల్లిదండ్రులు    :     ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ), లలితమ్మ (మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సర్పంచ్‌) 
స్వగ్రామం    :     రాంపురం, మంత్రాలయం మండలం 
చదువు    :     డిగ్రీ 
కుటుంబ సభ్యులు :     భార్య వై.విజయమ్మ, కుమారుడు ధరణీరెడ్డి, కుమార్తె ప్రియాంక 
రాజకీయ నేపథ్యం    : 1989లో రాజకీయ ప్రవేశం చేశారు. రాంపురం సర్పంచ్‌గా, మంత్రాలయం సింగిల్‌ విండో అధ్యక్షులుగా పదేళ్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మంత్రాలయం అభ్యర్థిగా బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి దళవాయి రామయ్యపై 10,697 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి పై 7462 ఓట్లతో గెలిచారు. చివరి వరకు ప్రజా జీవితంలో ఉండాలన్నది ఆయన లక్ష్యం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ఎవరైనా సాయం కోరి వస్తే కాదనే స్వభావం కాదు ఆయనది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.     
రాజకీయ గురువు        : బీవీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి 
అభిమాన నాయకుడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి   

ఎమ్మిగనూరు :   కడిమెట్ల చెన్నకేశవరెడ్డి 

తల్లిదండ్రులు     :    విరుపాక్షమ్మ, చెన్నారెడ్డి 
పుట్టిన తేదీ      :     01–07–1940 
స్వగ్రామం    :     కడిమెట్ల
కుటుంబసభ్యులు    :    భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, ఐదుగురు కుమార్తెలు 
చదువు     :    పీయూసీ 
రాజకీయ నేపథ్యం :    1994,1999లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009, 2012లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement