జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ తమ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందనే సంకేతాన్ని పంపింది. బీసీలను చట్టసభల్లో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఆ సామాజిక వర్గ నేతలను పోటీలో నిలిపింది. ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ అసెంబ్లీ స్థానాల బరిలో నిలిపింది. ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలతో, నవరత్నాల వంటి పథకాలతో ముందుకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను మనసారా అశీర్వదించాలని జిల్లా వాసులను వినమ్రంగా శిరస్సువంచివేడుకుంటోంది.
పెడన : జోగి రమేష్
పేరు: జోగి రమేష్
తల్లిదండ్రులు : జోగి మోహనరావు, పుష్పవతి
భార్య : శకుంతల దేవి
సంతానం: జోగి రాజీవ్, జోగి రోహిత్‌కుమార్, జోగి రేష్మాప్రియాంక
విద్యార్హతలు: బీఎస్సీ
నేపథ్యం: యూత్‌కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కృష్ణాజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పెడన అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నుంచి పెడన అసెంబ్లీ బరిలో ఉన్నారు.
తిరువూరు (ఎస్సీ): కొక్కిలిగడ్డ రక్షణనిధి
పేరు: కొక్కిలిగడ్డ రక్షణనిధి
తల్లిదండ్రులు : ప్రసాదు, సూర్యకాంతమ్మ
భార్య పేరు :మరియమ్మ
పుట్టినతేదీ : 1.10.1968
నేపథ్యం: 2001–2006 తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం సర్పంచిగా, 2006–2011లో పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి విశేష కృషి చేశారు. మరోసారి తిరువూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ప్రజా సమస్యలును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
గుడివాడ: కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
పేరు : కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
తండ్రిపేరు : కొడాలి అర్జునరావు
తల్లి : వింధ్యారాణి
భార్యా : అనుపమ
సంతానం : ఇద్దరు అమ్మాయిలు
పుట్టిన తేదీ: 22–10–1971
నేపథ్యం : 1998లో తెలుగు యువత కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. గుడివాడ నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014లలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్‌కుమార్‌పై, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై, 2014లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.
ప్రస్తుత హోదా : అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
జగ్గయ్యపేట : సామినేని ఉదయభాను
పేరు : సామినేని ఉదయభాను
తల్లిదండ్రులు : సామినేని విశ్వనాథం, పద్మావతి
భార్య: సామినేని విమలా
సంతానం: సామినేని వెంకట కృష్ణప్రసాద్
సామినేని ప్రశాంత్ బాబు
సామినేని ప్రియాంక
వయస్సు: 63
చదువు: బీకాం
నేపథ్యం: 1975 నుంచి 1977 వరకు ఎస్‌జీఎస్ ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989 నుంచి 96 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, 1997లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 1998 లో పీసీసీ కార్యదర్శిగా నియమితులైనారు. 1999, 2004లో పోటీ చేసి రెండవసారి గెలుపొందిప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు.
నూజివీడు : మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
పేరు : మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
తల్లిదండ్రులు: వేణుగోపాల అప్పారావు, రమణాయమ్మ
భార్య:సుజాత(లేటు)
పుట్టిన తేదీ:11–8–1953
విద్యార్హతలు: బీకాం
స్వగ్రామం: నూజివీడు
నేపథ్యం: మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 1983లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో టీడీపీలో చేరారు. అరు పదవులు చేశారు. 1999లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి 40వేల ఓట్లతో గెలుపొంది సంచలనం సృష్టించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి నూజివీడు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో మరలా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి 10,500 మెజారిటీతో గెలుపొంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
కైకలూరు : దూలం నాగేశ్వరరావు
పేరు : దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)
తల్లిదండ్రులు : దూలం వీరన్న, బూసమ్మ
భార్య : వీరకుమారి
కుమారులు : వీర ఆది వినయ్‌కుమార్, వీర శ్యామ్ ఫణికుమార్
కోడళ్లు : అనుపమా, స్వాతి
జననం : 09–06–1957
వయస్సు : 62
విద్యార్హత : హైస్కూల్ చదువు
వృత్తి : ఆక్వా రైతు, ఫ్యాక్టరీల యజమాని
నేపథ్యం:2006–2011 వరకు కైకలూరు సర్పంచ్‌గా పనిచేశారు. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘ ఉపా«ధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
1987–88 వరకు కైకలూరులోని వేంకటేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్‌గా పనిచేశారు.
అవనిగడ్డ : సింహాద్రి రమేష్‌బాబు
పేరు: సింహాద్రి రమేష్‌బాబు
తల్లిదండ్రులు: వెంకటేశ్వరరావు, భారతి
భార్య: కెప్టెన్ లక్ష్మి
పిల్లలు: కుమార్తెలు (ఉజ్వల, సహజ, నిశ్చల),
కుమారుడు : వికాస్
పుట్టినతేదీ: 22–07–1956
విద్యార్హత: బీఏ
రాజకీయ పదవులు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి
నేపథ్యం:కమ్యూనిస్టు నేత సనకా బుచ్చికోటయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు.పులిగడ్డ–పెనుమూడి వారధి నిర్మించాలంటూ సాధన కమిటీ కన్వీనర్‌గా 63 రోజులు రిలే నిరాహార దీక్ష చేశారు. 2009 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి ప్రజారాజ్యం తరఫున , 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి చెందారు.
మైలవరం : వసంత వెంకట కృష్ణప్రసాద్
పేరు: వసంత వెంకట కృష్ణప్రసాద్
తల్లిదండ్రులు : వసంత నాగేశ్వరరావు, హైమావతి
భార్య : వసంత శిరీష
పిల్లలు : ఇద్దరు పిల్లలు
పుట్టిన తేదీ: ఏప్రిల్ 8, 1970
గ్రామం: ఐతవరం, నందిగామ మండలం, కృష్ణా జిల్లా
వృత్తి: పారిశ్రామికవేత్త. చిలుకలూరిపేటలో స్పిన్నింగ్ మిల్, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు.
నేపథ్యం: తండ్రి వసంత నాగేశ్వరరావు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేసి నందిగామ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం వ్యాపారంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం మైలవరం నుంచి అవకాశం లభించడంతో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై వసంత పోటీ చేస్తున్నారు.
మచిలీపట్నం : పేర్ని వెంకట్రామయ్య (నాని)
పేరు : పేర్ని వెంకట్రామయ్య (నాని)
తల్లిదండ్రులు : పేర్ని కృష్ణమూర్తి, నాగేశ్వరమ్మ
భార్య : జయసుధ
కుమారుడు : కృష్ణమూర్తి
పుట్టిన తేది : 21–12–1965
విద్యార్హత : బికాం
నేపథ్యం : పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికి పుచ్చుకున్న ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ తరçఫున బందరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. 2014 నుంచి వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
పామర్రు (ఎస్సీ) : కైలే అనిల్‌కుమార్
పేరు : కైలే అనిల్‌కుమార్
తల్లిదండ్రులు : కైలే సంజీవరావు, జ్ఞానమణి
భార్య : హేమలీన
కుమార్తె : ఆరాధ్య
పుట్టిన తేదీ : 13–02–1977
విద్యార్హత : ఎంసీఏ
నేపథ్యం: చిన్న నాటి నుంచే తన తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత ఈయనను వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు.
అనిల్ తల్లి కైలే జ్ఞానమణి వైఎస్సార్‌సీపీ తరపున బాపులపాడు మండలం జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలుగా, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు.
విజయవాడ పశ్చిమ : వెలంపల్లి శ్రీనివాసరావు
పేరు : వెలంపల్లి శ్రీనివాసరావు
తల్లిదండ్రులు: వెలంపల్లి సూర్యనారాయణ, మహాలక్ష్మి
భార్య పేరు : వెలంపల్లి శ్రీవాణి
పిల్లలు: ఒక కుమారుడు, కుమార్తె (కుమారుడు మరణించాడు)
పుట్టిన తేదీ: 15–08–1971
విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణత
వృత్తి : వస్త్ర వ్యాపారంతోపాటు మరికొన్ని వ్యాపారాలు
రాజకీయ నేపథ్యం: 2009లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాగా ఆ పార్టీలో కొనసాగారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు.
నందిగామ (ఎస్సీ) : డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు
పేరు: డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు
తల్లిదండ్రులు : మొండితోక కృష్ణ, కస్థాల మరియమ్మ
భార్య: డాక్టర్ రమాదేవి
సంతానం: శివసాయి కృష్ణ, సమీరకృష్ణ
స్వగ్రామం : చందర్లపాడు, కృష్ణా జిల్లా
విద్యార్హత : ఎండీ (చెస్ట్ ఫిజీషియన్)
వృత్తి : వైద్యుడు
నేపథ్యం: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షితులై 2013లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఆస్పత్రి ఏర్పాటు చేసి వైద్యడిగా సేవలందిస్తున్నారు.
గన్నవరం : యార్లగడ్డ వెంకట్రావు
పేరు: యార్లగడ్డ వెంకట్రావు
తల్లిదండ్రులు: యార్లగడ్డ రామశేషగిరిరావు, లక్ష్మీసామ్రాజ్యం
భార్య: జ్ఞానేశ్వరి
కుమారై: శ్రీసహస్ర
కుమారుడు: సహర్హరామ్
చదవు: బీఎస్సీ (ఐటీ ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ)
కుటుంబ నేపథ్యం: వ్యవసాయం
వ్యాపారం: ఐటీ రంగం
నేపథ్యం:యార్లగడ్డ చారిటబుల్ ట్రస్టు ద్వారా పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హాబీలు: క్రికెట్, పుస్తకాలు చదవడం, విశ్లేషణలు రాయడం, ఒంగోలు జాతి ఎడ్ల పోషణ
విజయవాడ తూర్పు : బొప్పన భవకుమార్
అభ్యర్థి: బొప్పన భవకుమార్
తండ్రి: బొప్పన రామమోహనరావు
తల్లి: బొప్పన స్వర్ణలతాదేవి
భార్య: బొప్పన రత్నకుమారి
పిల్లలు: ఒక కుమార్తె(అమృత)
విద్యార్హత: బీ కాం
స్వస్థలం: పటమట
పుట్టినతేది : 24–01–1963
పదవులు : 1982లో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 3వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
విజయవాడ సెంట్రల్ : మల్లాది విష్ణువర్థన్
పేరు : మల్లాది విష్ణువర్థన్
తల్లిదండ్రులు : సుబ్బారావు, సుందరమ్మ
భార్య : కిరణ్మయి
ఇద్దరు కుమార్తెలు : లక్ష్మీచంద్రిక, లలితా నాగదుర్గ
పుట్టిన తేదీ: 20–6–1963
విద్యార్హతలు : బీకాం
రాజకీయ నేపథ్యం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. 2004నుంచి 2008 వరకు చైర్మన్‌గా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 నుంచి 17 వరకు కాంగ్రెస్‌పార్టీ విజయవాడ నగర అ««ధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పెనమలూరు : కొలుసు పార్థసారథి
పేరు : కొలుసు పార్థసారథి
తండ్రి పేరు : కొలుసు పెద రెడ్డయ్య
తల్లి పేరు : సామ్రాజ్యం
భార్య : కె.కమల లక్ష్మి
కుమారుడు : నితిన్ కృష్ణ
పుట్టిన తేదీ : 18–04–1965
స్వగ్రామం : కారకంపాడు, మొవ్వ మండలం, కృష్ణాజిల్లా
విద్యాభ్యాసం : బీటెక్
నేపథ్యం : మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కొలుసు పెద రెడ్డియ్య కుమారుడైన పార్థసారథి తొలుత ఉయ్యూరు నుంచి 2001 సెప్టెంబరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. 2004లో ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన కారణంగా 2009లో పెనమలూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ శిష్యుడైన పార్థసారథి పెద్దాయన హయాంలో తొలుత పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో మాథ్యమిక శాఖ మంత్రిగా, 2012లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment