ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): సామాన్యుడి ప్రగతి కోసమే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పయనమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం తూర్పు నియోజకర్గంలో ప్రజా సంకల్ప సభ నిర్వహించారు. కొత్తవెంకోజిపాలెం సర్వీసు రోడ్డులో జరిగిన ఈ సభలో శీకృష్ణ శ్రీనివాస్ కార్యకర్తలనుఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. సామాన్యుల ప్రగతిని కాంక్షిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. జగన్ రాకతో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
మీకు నేను అండగా ఉంటా
పార్టీ కోసం పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. దీనికి ఏ ఒక్క కార్యకర్త బయపడాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై బెదిరింపులకు దిగితే సహించేదిలేదన్నారు. తమ మౌనాన్ని టీడీపీ నాయకులు చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేఅయిన వెలగపూడి తూర్పు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని మద్యంమత్తులో ముంచడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. సమస్యలతో వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు వార్డు స్థాయి నాయకులు భరోసా కల్పించాలన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రతినిధి ఫరూఖీ, పార్టీ రాష్ట్ర సహాయకార్యదర్శి రవిరెడ్డి, సీనియర్ నాయకుడు కళ్లా బాబురావు, మాజీ కార్పోరేటర్ పేర్ల విజయచందర్, మొల్లి అప్పారావు, నడింపల్లి కృష్ణంరాజు, మొండి రామకృష్ణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కేఆర్ పాత్రుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, బి.సునీల్, రవి, జోషిల, రమణమూర్తి, బీఎన్ రెడ్డి, కిరణ్, మద్దాల భాను, వార్డుల అధ్యక్షులు, వార్డుల నాయకలు పాల్గొన్నారు.
నవరత్నాలతోనే ప్రగతి
జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే రాష్ట్రంలో సామాన్యుడి ప్రగతి సాధ్యమవుతుందని విశాఖ పార్లమెంట్ జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. సామాన్య ప్రజల కోసం పూర్తిస్థాయిలో ఆలోచించి జగన్‌మోహన్ రెడ్డి విద్య, ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక భరోసాలతో కూడిన ఈ పథకాలను ప్రకటించడం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అయితే ఇచ్చిన ఒక్క హమీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పనున్నారన్నారు.
గెలుపే అందరిలక్ష్యం కావాలి
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే కార్యకర్తల లక్ష్యం కావాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఒక సైనికుడిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తూర్పు నియోజకవర్గంలో 10 ఏళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడి వంశీకృష్ణ నాయకత్వానికి బాటలు వేయాలని ఎంవీవీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment