Vamsi Krishna Srinivas
-
బలిచ్చే మేకపోతు మాకు వద్దు వంశీ కృష్ణకు జనసేన నేతలు షాక్
-
వంశీకి టికెట్ ఇస్తే మాత్రం ! విశాఖ సౌత్ లో జనసేన టికెట్ రచ్చ
-
ప్రాణం ఉన్నంతవరకూ జగనన్న వెంటే..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అమితమైన ప్రేమ.. ప్రాణమున్నంతవరకు జగనన్న వెంటే నడుస్తానని ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని, ఎప్పటిలాగే పార్టీ కోసం, జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు. జీవీఎంసీ మేయర్ పదవి దక్కలేదన్న కోపంతో పార్టీ నగర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నమ్మవద్దని కోరారు. ఫేక్ అకౌంట్‌తో వివాదాస్పద పోస్టింగ్‌లు కొంతమంది నా పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వైఎస్సార్ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెడుతున్నారని, అలా చేసిన వారిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. పార్టీకి, నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. తల్లి వంటి పార్టీని, పెద్దల ప్రతిష్టకు భంగం కల్గించే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నానని వంశీకృష్ణ పేర్కొన్నారు. చదవండి: నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా తిరుపతి ఉప పోరు: ‘ఆ ది’శగా అరాచకాలకు కుట్ర! -
‘అభివృద్ధికి అడ్డుపడితే పుట్టగతులుండవ్’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుకే మూడు రాజధానులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని తెలిపారు. (చదవండి: ‘కన్నవారికి తలకొరివి పెట్టని ఆయన హిందువా?’) సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని విమర్శలు గుప్పించారు. కోర్టులకు వెళ్లి సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వారు చేసిన అవినీతిపై కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధికి అడ్డం పడితే టీడీపీ నేతలకు పుట్టగతులు ఉండవని వంశీ కృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. -
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో మహా నగరం కాబోతుందన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్ట్ ఘటన తో ఇప్పటికైనా చంద్రబాబు లో మార్పు రావాలని హితవు పలికారు. మార్పు రాకపోతే రాబోయే కార్పొరేషన్లు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారన్నారు. విశాఖ ప్రజలను గుండాలుగా చిత్రీకరిస్తున్నారని.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే తీవ్రంగా పరిగణిస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. -
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): సామాన్యుడి ప్రగతి కోసమే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం తూర్పు నియోజకర్గంలో ప్రజా సంకల్ప సభ నిర్వహించారు. కొత్తవెంకోజిపాలెం సర్వీసు రోడ్డులో జరిగిన ఈ సభలో శీకృష్ణ శ్రీనివాస్ కార్యకర్తలనుఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. సామాన్యుల ప్రగతిని కాంక్షిస్తూ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. జగన్ రాకతో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. మీకు నేను అండగా ఉంటా పార్టీ కోసం పనిచేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. దీనికి ఏ ఒక్క కార్యకర్త బయపడాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై బెదిరింపులకు దిగితే సహించేదిలేదన్నారు. తమ మౌనాన్ని టీడీపీ నాయకులు చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేఅయిన వెలగపూడి తూర్పు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని మద్యంమత్తులో ముంచడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. సమస్యలతో వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు వార్డు స్థాయి నాయకులు భరోసా కల్పించాలన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రతినిధి ఫరూఖీ, పార్టీ రాష్ట్ర సహాయకార్యదర్శి రవిరెడ్డి, సీనియర్ నాయకుడు కళ్లా బాబురావు, మాజీ కార్పోరేటర్ పేర్ల విజయచందర్, మొల్లి అప్పారావు, నడింపల్లి కృష్ణంరాజు, మొండి రామకృష్ణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కేఆర్ పాత్రుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, బి.సునీల్, రవి, జోషిల, రమణమూర్తి, బీఎన్ రెడ్డి, కిరణ్, మద్దాల భాను, వార్డుల అధ్యక్షులు, వార్డుల నాయకలు పాల్గొన్నారు. నవరత్నాలతోనే ప్రగతి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే రాష్ట్రంలో సామాన్యుడి ప్రగతి సాధ్యమవుతుందని విశాఖ పార్లమెంట్ జిల్లా నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. సామాన్య ప్రజల కోసం పూర్తిస్థాయిలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి విద్య, ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక భరోసాలతో కూడిన ఈ పథకాలను ప్రకటించడం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 2014 ఎన్నికల్లో ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అయితే ఇచ్చిన ఒక్క హమీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పనున్నారన్నారు. గెలుపే అందరిలక్ష్యం కావాలి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే కార్యకర్తల లక్ష్యం కావాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఒక సైనికుడిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తూర్పు నియోజకవర్గంలో 10 ఏళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడి వంశీకృష్ణ నాయకత్వానికి బాటలు వేయాలని ఎంవీవీ పిలుపునిచ్చారు. -
గాల్లో తేలేట్టు చేసే వినోదం
యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, ఖుషి, మోనీషా ప్రధాన పాత్రధారులు. సురేష్ గుణ్ణం దర్శకుడు. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావ్ నిర్మాతలు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చేఅంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘ఇది క్లీన్ ఎంటర్టైనర్. యువతకు నచ్చే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి’’ అని తెలిపారు. పోసాని, సయాజీ షిండే, కృష్ణభగవాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: సాయికార్తీక్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శీలం లక్ష్మణ్, సహ నిర్మాత: భాస్కర్ విల్లూరి. -
సినిమా రివ్యూ: రారా...కృష్ణయ్య
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, జగపతి బాబు, కళ్యాణి, రవిబాబు, చలపతిరావు, తాగుబోతు రమేశ్, తనికెళ్ల భరణి సంగీతం: అచ్చు రాజమణి ఫోటోగ్రఫీ: శ్రీరాం నిర్మాత: వంశీ కృష్ణ శ్రీనివాస్ కథ, దర్శకత్వం: మహేశ్ బాబు.పి ప్లస్ పాయింట్స్: రెజీనా ఫోటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్: కథ, కథనం సెకండాఫ్ లో స్లో నేరేషన్ క్లైమాక్స్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో ఆకట్టుకున్న సందీప్ కిషన్, రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో నూతన దర్శకుడు మహేశ్ బాబు.పి రూపొందించిన చిత్రం 'రారా...కృష్ణయ్య'. కిడ్నాప్ నేపథ్యంగా ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం జూలై 4 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్, రెజీనాలతో, దర్శకుడు మహేశ్ బాబు రూపొందించిన కిడ్నాప్ డ్రామా ఏ మేరకు పండిందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. వంశ పారంపర్యంగా చేస్తున్న దందాను కొనసాగించడం ఇష్టంలేక తన అన్నయ్య జగ్గు భాయ్ (జగపతిబాబు)కు దూరంగా వెళ్లి మాణిక్యం (తనికెళ్ల భరణి) అనే ట్రావెల్స్ వ్యాపారి వద్ద డ్రైవర్ పనిచేస్తుంటాడు కిట్టూ అలియాస్ కృష్ణయ్య(సందీప్ కిషన్). తాను నమ్మిన మాణిక్యం కిట్టూని మోసగిస్తాడు. తనకు జరిగిన మోసానికి జీర్ణించుకోలేని కిట్టూ.. తండ్రి కుదుర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని మాణిక్యం కూతురు నందూ(రెజీనా)ను కిడ్నాప్ చేస్తాడు. నందూని కిడ్నాప్ చేసిన తర్వాత కృష్ణయ్య జీవితంలో ఏలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కృష్ణయ్య కుటుంబం చేసే దందా ఏమిటి? నందూ, కృష్ణయ్యల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందా? ఈ కిడ్నాప్ కథలో, తమ్ముడి ప్రేమ వ్యవహారంలో జగ్గూ భాయ్ పాత్రేంటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రారా...కృష్ణయ్య' చిత్రం. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: కృష్ణయ్య పాత్రలో సందీప్ కిషన్ పర్వాలేదనిపించాడు. పాత్రకు ఉన్న పరిమితి కారణంగా సందీప్ కిషన్ చలాకీతనాన్ని గొప్పగా ప్రదర్శించలేకపోయాడు. ఫైట్లకు పెద్ద స్కోప్ లేకపోవడంతో తన సత్తాను పెద్దగా చూపించలేకపోయాడు. డాన్యులతో ఓకే అనిపించాడు. నందూ పాత్రలో రెజీనా మరోసారి ఆకట్టుకుంది. ఫెర్ఫార్మెన్స్ తోపాటు, గ్లామర్ తో కూడా మెప్పించింది. అల్లరిపిల్లగా, చలాకీతనంతో రెజీనా మరోసారి మెరిసింది. టాలీవుడ్ లో మరోసారి గుర్తింపు తెచ్చుకునే ఫుల్ లెంగ్త్ పాత్రకు రెజీనా పూర్తిగా న్యాయం చేసింది. లెజెండ్ తర్వాత జగ్గు భాయ్ అనే ఓ ప్రధానమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. అయితే పాత్రలో ఇంటెన్సిటీ ఉన్నా.. కథనంలో తేలిపోయింది. జగ్గుభాయ్ పాత్రకు వినియోగించిన క్యాస్టూమ్స్ జగపతిబాబుకు చక్కగా కుదిరాయి. అక్కడక్కడ జగ్గుభాయ్ పాత్ర ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో గుర్తుంచుకునే పాత్రను పోషించడానికి జగపతిబాబుకు అవకాశం చిక్కలేదు. తనికెళ్ల భరణి, రవిబాబులవి రోటీన్ పాత్రలే. ఇప్పటిలానే తాగుబోతు పాత్రలో రమేశ్ చిత్ర తొలిభాగంలో కొంత వినోదాన్ని పండించేందుకు ప్రయత్నించాడు. టెక్నికల్ ఫెర్ఫార్మెన్స్: ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకునే విధంగా శ్రీరాం మంచి ఫోటోగ్రఫిని అందించాడు. అందమైన లోకేషన్లను చక్కగా చిత్రీకరించాడు. రెజీనాను గ్లామర్ ను ఎలివేట్ చేయడంలో శ్రీరాం సఫలమయ్యారు. ప్రేమకథకు పాటలే సగం బలం పాటలు. అయితే ఒకటి..అరా పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నా.. పూర్తి స్థాయిలో సందీప్ కిషన్, రెజీనా కెమిస్ట్రీని పండించే విధంగా పాటలు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ చిత్రానికి పాజిటివ్ అంశమని చెప్పవచ్చు. దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. కొత్త దర్శకుడు అనే భావన ఎక్కడ కనిపించకపోవడం ప్లస్ పాయింటే. అయితే తొలి భాగంలో కథను తన చెప్పు చేతల్లోనే ఉంచుకుని నడిపించారనే ఫీలింగ్ కలిగించిన దర్శకుడు.. రెండవ భాగంలో తడబాటుకు గురయ్యాడు. తొలి భాగంలో వినోదాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుని సంతృప్తి పరిచినా.. రెండవ భాగంలో నత్తనడకగా సాగిన కథనంతో ప్రేక్షకుల సహనానికి దర్శకుడు పరీక్ష పెట్టారు. జగపతి పాత్ర ఎంట్రీ బాగా ఉన్నా.. అదే వూపును కొనసాగించలేకపోయారు. సందీప్, రెజీనాల మధ్య లవ్ సీన్లు చప్పగా చిత్రీకరించారు. ఓవరాల్ గా... గొప్పగా కాకపోయినా.. ఓకే అనే రేంజ్ లో రారా... కృష్ణయ్య ఉన్నాడనిపించారు. ట్యాగ్: రారా..పిలుపుకు స్పందించని కృష్ణయ్య! Follow @sakshinews -
ప్రజలకు అందుబాటులో ఉంటా
గెలిచాక విశాఖ సమస్యలన్నింటిని పరిష్కరిస్తా విజయమ్మకు బ్రహ్మరథం పట్టిన విశాఖ ప్రజలు అడుగడుగునా పూలు, మంగళ హారతులతో స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజ లందరికి అందుబాటులో ఉంటా. మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా. అందమైన విశాఖను మరింత పర్యాటకప్రాంతంగా సుందరంగా తయారు చేసుకుందాం. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మళ్లీ సువర్ణయుగం రావాలన్నా, విశాఖ అభివృద్ధి కావాలన్నా జగన్ రావాలి. తప్పకుండా మీరంతా జగన్‌ను ఆశీర్వదించండి’ అని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో రోడ్‌షోలో భాగంగా ఆమె తూర్పు, ఉత్తరం, దక్షిణం నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు అడుగడుగునా ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై నిరీక్షించారు. మహిళలు హారతులతో ఆహ్వానం పలికి దారిపొడవునా పూలతో స్వాగతం పలికారు. వీరిని ఉద్దేశించి విజయమ్మ ఉత్సాహంగా ప్రసంగించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటరాగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓల్డ్ డైరీఫాం జంక్షన్ వద్ద నుంచి విజయమ్మ రోడ్ షో ప్రారంభమైంది. సుమారు పది ప్రాంతాల్లో విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో జరిగే సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. విజయమ్మను చూసేందుకు అపార్ట్మెంట్, ఇళ్లల్లోని నివాసులు రోడ్లపైకి చేరి తమ అభిమాన నాయకురాలిని చూసి ఆనందంతో ఉప్పొంగారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావుతో కలిసి వివిధ ప్రాంతాల్లో యాత్ర సాగించారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో పార్టీ అభ్యర్థి కోలా గురువులు వెంట రాగా.. రాత్రి 9.15 గంటలకు ద్వారకానగర్ చేరుకున్నారు. విజయమ్మ వెంట పార్టీ నియోజకవర్గ అభ్యర్థులతోపాటు నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ ఆద్యంతం ఉండి, పార్టీ మేనిఫెస్టో కార్యక్రమాల్ని వివరించారు. రోడ్ షోలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. -
గంగమ్మకు నీరాజనం
=మళ్లీ రాకు సు(నా)మీ =మత్స్యకార మహిళల వేడుకోలు గంగమ్మా.. సల్లగా సూడమ్మా.. మా పసుపు, కుంకాలు కాపాడమ్మా.. అంటూ మత్స్యకార మహిళలు గురువారం సాగర తీరంలో పూజలు చేశారు. తొమ్మిదేళ్ల క్రితం సునామీ విలయం సృష్టించిన రోజున గంగమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తోంది. కలశాలతో పసుపు నీటిని, పాలను తీసుకువెళ్లి సముద్రంలో కలిపి, హారతులు పట్టారు. ఎలాంటి ఉపద్రవం రాకుండా కాపాడమని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : వేలాదిమంది మత్స్యకారుల భక్తికి గంగమ్మ పరవళ్లు తొక్కింది. భక్తులు అందించిన తీర్ధప్రసాదాలను అలల రూపంలో స్వీకరించింది. కలశాల్లోని పసుపు నీటిని తనలో కలుపుకుంది. గురువారం ఉదయం మత్స్యకారుల పూజలతో పెదజాలారిపేట తీరం పుణ్యక్షేత్రాన్నే తలపించింది. గంగమ్మ తల్లి ఉగ్రరూపం దాల్చకుండా మత్స్యకారులను చల్లగా చూడాలని మహిళలు ఈ పూజలు నిర్వహించారు. 2004 డిసెంబర్ 26న సునామీ ముంచుకొచ్చాక ప్రతి ఏటా ఇదే తేదీన సముద్ర తీరంలో గంగమ్మ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పెదజాలారిపేటలో వేలాదిమంది మత్స్యకారులు పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారికి పాలధారతో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుగా డప్పులతో ఆట పాటలతో తీరానికి చేరుకున్నారు. కలశాలతో సముద్రం ఒడ్డున పూజలు చేశారు. ఇసుకతో గంగమ్మ ప్రతిమ తయారు చేసి పసుపు, కుంకుమ పూసి, పాలతో అభిషేకించారు. అమ్మవారికి పూసిన పసుపును మహిళలు తమ మంగళసూత్రాలకు రాసుకుని భర్త చల్లగా ఉండాలని వేడుకున్నారు. మహిళలందరూ ఒకేసారి సముద్రంలో పసుపు నీరు, పాలు వదిలి భక్తితో దండాలు పెట్టారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సునామీ వంటి ఉపద్రవాలు మళ్లీ రాకుండా గంగమ్మ చల్లగా చూడాలన్నారు. అనంతరం గ్రామా సేవా సంఘం పెద్దలు పరసన్న, సత్తయ్య, గురయ్యతాతలు మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు మళ్లీ ఒడ్డుకు ఎప్పుడు చేరుకుంటారో తెలీదని, ఎలాంటి ప్రమాదం జరగకుండా గంగమ్మను శాంతింపచేయడానికి ప్రతి సంవత్సరం పూజలు చేస్తున్నామన్నారు. ఈ పండుగలో వైఎస్సార్సీపీ నాయకులు కారి శ్రీలక్ష్మి, తెడ్డు గుర్నాథం, శ్రీనివాసరెడ్డి, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
విడిపోతే చెడిపోతాం
=తాగునీటికీ ఇక్కట్లే =సమైక్యం కోసం పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ =సమైక్య శంఖారావం సభలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలకు తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఉత్తర నియోజక వర్గం సమన్వయకర్త జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో బుధవారం 33వ వార్డు 80 అడుగుల రోడ్డులో సమైక్య శంఖారావం సభ నిర్వహించారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీయేనని, తెలుగుజాతి కలిసి ఉండడం కోసం పోరాడే ఏకైక నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ పశ్చిమ నియోజక వర్గ సమన్వయకర్త దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడానికే కిరణ్, చంద్రబాబులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. భీమిలి సమన్వయకర్త కోరాడ రాజబాబు మాట్లాడుతూ జగన్ పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దక్షిణ నియోజక వర్గ సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ సోనియా గాంధీ తన కుమారుడ్ని ప్రధానిని చేయడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆరోపించారు. అనంతరం కేంద్ర కార్యవర్గ సభ్యులు పి.ఎస్.ఎన్.రాజు, నగర మహిళా క న్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, ఉత్తర నియోజక వర్గ సమన్వయకర్త రవిరాజు, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సభ ప్రారంభానికి ముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవిరెడ్డి, కంపా హనోక్, గుడ్ల పోలిరెడ్డి, పక్కి దివాకర్, భూపతిరాజు, జాన్ వెస్లీ, విల్లూరి భాస్కరరావు, ఎ.వి.ఎస్.నాయుడు, నీలి రవి, ఆళ్ళ శ్రీను, వార్డు నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.