వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి | YSRCP CGC Member kukkala Nageswara rao dies of heart attack | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి

Published Thu, Nov 21 2013 1:40 PM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి - Sakshi

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు నాగేశ్వరరావు మృతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, కృష్ణా జిల్లా  పరిషత్ మాజీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు గురువారం గుండెపోటుతో మృతి చెందారు.  ఈరోజు ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కుక్కల నాగేశ్వరరావు గతంలో కృష్ణాజిల్లా జెడ్పీ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన స్వగ్రామం మొవ్వ మండలం కోసూరు. కుక్కల నాగేశ్వరరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.

విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఎస్కే షిప్పింగ్ సంస్థను స్థాపించిన ఆయన ఈ ప్రాంతంలో ఎంతోమంది యువతీ యువకులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా సొంత ప్రాంతాన్ని ఏ మాత్రం మర్చిపోకుండా ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. కృష్ణాజిల్లా నుంచి, దివిసీమ ప్రాంతం నుంచి ఎవరు వెళ్లినా వెంటనే ఆదరించి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవారని సన్నిహితులు చెబుతుంటారు. నాగేశ్వరరావు మృతిపట్ల ఈ ప్రాంతవాసులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement