తాము నిఖార్సైన సమైక్య వాదులమని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేయాలని...
పీలేరు, న్యూస్‌లైన్: తాము నిఖార్సైన సమైక్య వాదులమని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేయాలని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్‌చేశారు. బుధవారం రాత్రి ఆయన న్యూస్‌లైన్‌తో మా ట్లాడుతూ గత 28 రోజులుగా సీమాం ధ్రలో సమైక్య ఉద్యమం ఉవెత్తున ఎగసిపడుతుంటే పదిరోజుల పాటు నోరు మెదపక ఇంటికే పరిమితమైన సీఎం తమ ఉనికి కోల్పోతామన్న భయంతో మీడియా ముందుకు వచ్చారని దుయ్యబట్టారు.
సీడబ్ల్యూసీ, యూపీఏలో ప్ర త్యేక ఆహ్వానితులుగా ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఢిల్లీలో ఒప్పుకుని ఇక్కడ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించా రు. వారం క్రితం మీడియా సమావేశంలో ప్రత్యేక రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని డి మాండ్ చేసిన చంద్రబాబు సిగ్గు లేకుం డా సీమాంధ్రలో ఎలా యాత్ర చేయాలంటారని నిలదీశారు. రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజ యమ్మ పదవులకు రాజీనామా చేశారని తెలిపారు.
సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ గుంటూరులో విజయమ్మ చేపట్టిన దీక్షను రాష్ట్ర ప్రభుత్వం నిరాక్షిణ్యంగా అడ్డుకుని భగ్నం చేసిందన్నారు. పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిపారు. సీమాంధ్రలో వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.