రాజకీయ భేటీలా మార్చేశారు | ysrcp fire on babu | Sakshi
Sakshi News home page

రాజకీయ భేటీలా మార్చేశారు

Published Fri, Aug 8 2014 1:43 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

రాజకీయ భేటీలా మార్చేశారు - Sakshi

రాజకీయ భేటీలా మార్చేశారు

కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ ధ్వజం

హైదరాబాద్: విజయవాడలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల, ఎస్పీల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ భేటీగా మార్చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టర్లు, ఎస్పీల భేటీలో బాబు మాట్లాడిన తీరు చూస్తే ‘టీడీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి’ అనే విధంగా ఉందని విమర్శించారు.

అఖిల భారత సర్వీసుల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఎస్పీలను వారి యూనిఫామ్‌లను వదలి వేసి, పసుపుపచ్చ యూనిఫామ్‌లను వేసుకోవాలని ప్రత్యక్షంగా ఆదేశించినట్లుగా చంద్రబాబు మాట్లాడారని ఆమె దుయ్యబట్టారు. దానిని పూర్తిగా రాజకీయ సమావేశంగా నిర్వహించారని ఆమె విమర్శించారు. బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రా...లేక కేవలం టీడీపీకే ముఖ్యమంత్రా ? అని ప్రశ్నించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement