వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంజిల్లా వ్యాప్తంగా గురువారం కార్యకర్తలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆవిష్కరించారు. చిత్రంలో రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, కొత్త చిన్నపరెడ్డి, మాబు, కావటి మనోహరనాయుడు, సునీల్, కొలకలూరి కోటేశ్వరరావు, సతీష్, మండెపూడి పురుషోత్తం, హనుమంత్‌నాయక్ తదితరులున్నారు.
గుంటూరు సిటీ : వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా అంతటా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఇటు పార్టీ శ్రేణులు, అటు వైఎస్సార్ అభిమానుల్లో నూతనోత్తేజం నింపే దిశగా జరిగిన ఈ వేడుకలను తొలుత జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం ద్వారా జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ శ్రీకారం చుట్టారు.
అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక పార్టీలకు నిరసనగా, జన రంజకమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఏర్పడిన వైఎస్‌ఆర్‌సీపీ సరిగ్గా నాలుగు వసంతాలు నింపుకుని 5వ వసంతంలోకి అడుగిడిందని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచీ జనం గుండె చప్పుడు తెలిసిన పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యలపై మాత్రం అసెంబ్లీ లోపలా, వెలుపలా రాజీ లేని పోరు చేస్తామని స్పష్టం చేశారు. రానున్నది వైఎస్‌ఆర్‌సీపీ శకమనీ, జగన్ సీఎం కావడం తధ్యమనీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలన్న సదుద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన పార్టీ జెండాను, ప్రజా సమస్యల అజెండాను నేటి వరకు కిందకు దించలేదన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము కూడా ఎత్తిన జెండా దించకుండా బాబు నయవంచన పాలనపై, అబద్ధపు హామీలపై యుద్ధాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ ఆదర్శం, జగన్ స్ఫూర్తితో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, జిల్లా బీసీ సెల్ కన్వీనర్ కోనూరి సునీల్‌కుమార్, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ మొగిలి మధుసూధనరావు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ మాబు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, విద్యార్థి విభాగం నేతలు ఉప్పుటూరి నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, గుంటూరు రూరల్ మండల జడ్పీటీసీ మెంబర్ కొలకలూరి కోటేశ్వరరావు, ఫిరంగిపురం మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హబీబుల్లా, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, జిల్లా కార్యదర్శి యనమల ప్రకాష్, మేళం ఆనందభాస్కర్, మేరువ నర్సిరెడ్డి, ఎలుకా శ్రీకాంత్‌యాదవ్, కడియాల శ్రీనివాసయాదవ్, జంగా జయరాజు, డి.రాజు, సంపతి నాగరాజు, ఎస్టీసెల్ నేత మేరాజోత్ హనుమంత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు
Published Fri, Mar 13 2015 1:38 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement