సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అని విమర్శించారు. నాలుగేళ్లుగా హోదాపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.
కేసుల భయంతోనే హోదాపై చంద్రబాబు మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పోరాటం వల్లే హోదాపై ప్రజల్లో ఆదరణ లభించిందని తెలిపారు. అందుకే హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. తిరుపతిలో చంద్రబాబు తలపెట్టింది దగాకోరు సభ అని భూమన ధ‍్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment