'ప్రకృతి కరుణించని దుర్మార్గపు పాలన నీది' | ysrcp leader bhumana karunakar reddy takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రకృతి కరుణించని దుర్మార్గపు పాలన నీది'

Published Sat, Aug 5 2017 5:52 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

'ప్రకృతి కరుణించని దుర్మార్గపు పాలన నీది' - Sakshi

'ప్రకృతి కరుణించని దుర్మార్గపు పాలన నీది'

నంద్యాల: రాజకీయాల్లో నైతిక విలువలకు, విశ్వసనీయతకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పునాది వేశారని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. అలాంటి వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేతలు భూతాలు, ప్రేతాత్మలుగా మారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని చెబితే అలా ఎందుకు అంటున్నారో అనే విషయం ఆలోచించుకోవాల్సిందిపోయి, ఆ దుర్మార్గపు పాలనను ఎండగట్టడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నాయని మండిపడ్డారు.

చంద్రబాబు పాలన నరకాసురుడి పాలనను గుర్తు చేస్తోందన్నారు. ఆయన పాలన రాక్షస పాలనకంటే దుర్మార్గంగా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ భూతాలు ప్రేతాలుగా మారి రాష్ట్రంలో గగ్గోలు పుట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర్రబాబుది అబద్ధాల, మోసాల పరిపాలన అని, ఆయన తన మూడేళ్ల పాలనలో మూడు లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలకంటే దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందనేది నానుడి అని, ప్రకృతి కూడా కరుణించని దుర్మార్గపు పాలన చంద్రబాబుది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన భూతాలకు స్వర్గధామంగా ఉంటే ప్రజలకు మాత్రం నరకంలాగా ఉందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement