
కేకే రాజును పరామర్శిస్తున్న ఎంవీవీ సత్యనారాయణ, మళ్ల విజయప్రసాద్
సీతమ్మధార(విశాఖ ఉత్తర): వైఎస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదివారం బైక్ స్కిడ్ కావడంతో గాయపడ్డారు. హత్యాయత్నం అనంతరం తొలిసారి విశాఖ వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి రాజు ఆదివారం భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఉత్సాహంగా వెళ్తున్న ఆయన ఎన్‌ఏడీ వద్దకు చేరుకునేసరికి .. పెట్రోల్‌బంక్ నుంచి ఒక కారు బుల్లెట్‌కు అడ్డురా వడంతో బుల్లెట్‌కు ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీం తో స్కిడ్ అయి ఒక్కసారిగా బైక్ మీద నుంచి కిందికి పడిపోయారు. దీంతో షోల్డర్ డిస్క్‌తో పా టు కాళ్లు, చేతులు, కడుపుపై గాయాలయ్యాయి.
దీంతో అక్కడ ఉన్న కిరణ్‌రాజు కారులో హూటాహుటిన గురుద్వార్ వద్ద గల రామా హాస్పిటల్‌లో చేర్పించడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కేకేరాజును వెంటనే ఫోన్‌లో పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పలువురు నేతల పరామర్శ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేకేరాజును విశాఖ పార్లమెంట్ జిల్లా సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు వంశీకృష్ణ, కన్నబాబురాజు, ఎస్. సుధాకర్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, విశాఖపా ర్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఆళ్ల గణేష్, వార్డు అధ్యక్షులు చల్లా ఈశ్వరరావు, కటుమూరి సతీష్, సారిపిల్లి గోవింద్, నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు బాకీ శ్యాంకుమార్‌రెడ్డి, కేవీ బాబా, జూబేర్, కాయిత పైడి రత్నాకర్, సాడిపద్మారెడ్డి, ఉత్తరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.