గుంటూరు : మంగళగిరి మండలంలో శనివారం నుంచి జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల భూములను ప్రభుత్వం భూ సర్వే చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. కాగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో 'జన్మభూమి-మా ఊరు' మలిదశ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.
కాగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం మంగళగిరిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
'జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం'
Published Sat, Nov 1 2014 9:49 AM | Last Updated on Tue, May 29 2018 2:28 PM
Advertisement
Advertisement