మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్ | Mangalagiri YSRCP MLA Alla Ramakrishna Reddy arrested in mangalagiri | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్

Published Tue, Aug 2 2016 10:29 AM | Last Updated on Tue, Oct 9 2018 5:11 PM

Mangalagiri YSRCP MLA Alla Ramakrishna Reddy arrested in mangalagiri

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో బస్స్టాండ్ వద్ద బంద్ పాటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తొమ్మిది మంది పార్టీ నేతలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

అందులోభాగంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఈ రోజు తెల్లవారుజామున మంగళగిరి బస్సు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే బస్టాండ్ వద్ద కూడా ధర్నా చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బంద్కు సహకరించాలని కోరుతూ పట్టణంలో స్థానిక యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement