వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు.. నిందితుల అరెస్ట్ | YSRCP MLA alla ramakrishna reddy threatened, accused arrested | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు.. నిందితుల అరెస్ట్

Published Tue, Dec 16 2014 6:43 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు.. నిందితుల అరెస్ట్ - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు.. నిందితుల అరెస్ట్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఫోన్లో బెదిరించిన ఆగంతకులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి గత పది రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆగంతకులు మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణహానీ తప్పదంటూ ఎమ్మెల్యేను హెచ్చరించారు. రామకృష్ణా రెడ్డి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ట్రాప్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement