అధికార పార్టీ కొత్త ఒరవడి..
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ కొత్త ఒరవడిలను సృష్టిస్తోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు.
కాకినాడ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ కొత్త ఒరవడిలను సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి మండిపడ్డారు. అధికారపార్టీ విజయం కోసం తమ పార్టీకీ ఓటు వేయించాలని అధికారుల పై ఒత్తిడి తేస్తుందని విమర్శించారు. అంగన్‌వాడీలు, మెప్మా వర్కర్లపై కూడా ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువైందని ఆయన ధ్వజమెత్తారు.
యువకులను తమ వైపు తిప్పుకునేందుకు వారిని మద్యానికి బానిసలు చేస్తున్నారన్నారు. ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలను పట్టించుకొని ప్రభుత్వం ఎన్నికల కోసం వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. ఎన్నికల సంఘం మహిళల అకౌంట్లను తనిఖీ చేయాలన్నారు.ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 50 వార్డులున్నాయి. కానీ ప్రస్తుతం 48 వార్డలకే ఎన్నికలు జరుగుతున్నాయి. 42, 48 వార్డులకు ప్రస్తుం ఎన్నికలు జరగడం లేదు.