ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ విభజనకు కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ‘అభినవ కైకేయి’గా అభివర్ణించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొనడానికి వెళ్లిన ఎమ్మెల్యే ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. త్రేతాయుగంలో భరతుడికి రాజ్యాభిషేకం చేయడం కోసం కైకేయి.. రాముడిని అడవులకు పంపితే, సోనియా తన కుమారుడు రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం జగన్‌ను జైలు పాలు చేశారని అన్నారు. జగన్‌కు బెయిలు రాకుండా జైల్లోనే ఉండేలా కుట్రలు, కుతంత్రాలు పన్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగుజాతిని ముక్కలు చేయడానికి పూనుకోవడం ఆమె తెల్లజాతి అహంకారానికి నిదర్శనమన్నారు. మరోవైపు తన కుమారుడిని తెలంగాణాలో ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు విభజనకు సహకరిస్తూ లేఖ ఇచ్చి.. ఆ లేఖను వెనక్కి తీసుకోకుండా, ఇరుప్రాంతాల టీడీపీ నాయకులతో డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు. రాబోవు రోజుల్లో టీడీపీ పునాదులు కూలిపోతాయనే విషయం ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌ను, అందుకు సహకరిస్తున్న టీడీపీని ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అభినవ కైకేయి సోనియా
Published Tue, Feb 18 2014 3:07 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement