ఒక్క ఇటుక రాయి కదిలించినా {పజా ఉద్యమాలు తప్పవు
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక
తిరుపతిరూరల్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదల గూడును కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవిలాల ధనలక్ష్మి నగర్‌లో పేదలు నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మఠం భూముల్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠం భూముల ఆక్రమణ తొలగించాలని ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో మఠం, డీకేటీ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్లను కూల్చివేస్తామని ప్రకటించడం దారుణమన్నారు.
పేదల ఇళ్లకు చెందిన ఒక్క ఇటుక రాయిని కదిలించినా ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. గూడుకోసం పేదలుచేసే పోరాటాలకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. నిరుపేదలు నివసిస్తున్న ఇళ్లను కూల్చితే వారి ఘోష చంద్రబాబుకు తగులుతుందని అవిలాల సర్పంచ్ కుమారిలోకనాధరెడ్డి అన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సెల్వం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదల జోలికొస్తే ఖబడ్దార్ !
Published Tue, Feb 24 2015 2:48 AM | Last Updated on Mon, Oct 29 2018 8:34 PM
Advertisement
Advertisement