అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం | YSRCP MLA Raghu Rami Reddy Criticised Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sun, May 13 2018 1:38 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP MLA Raghu Rami Reddy Criticised Chandrababu Naidu - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

ఖాజీపేట : అబద్ధాలు చెప్పడంచంద్రబాబు నైజం. ప్రజలను మోసం చేయడం కోసం రోజుకో అబద్ధం చెబుతున్నాడు. ఆయన మాటలను ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. శనివారం మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వంచనపై గర్జన’ పేరుతో 14, 15 తేదీల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. పాదయాత్రలో అందరూ పాల్గొని చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో పూటకోక మాట మాట్లాడింది చంద్రబాబు కాదా ప్రశ్నించారు.  అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీ మేలని తీర్మాణం చేసి ఇప్పడు హోదా రాగం అందుకున్నారన్నారు.

నేడు ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని గట్టిగా కోరుతున్నారని, ఇది గమనించి చంద్రబాబు మాట మార్చి హోదా డ్రామా అడుతున్నాడన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ గంగాధర్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు గురివిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాలిపోతు మనోహర్, జిల్లా బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి వెంకటయ్యనాయుడు, జల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, దస్తగిరిబాబు, నాయకులు వెంకట శివానందకుమార్‌రెడ్డి, శ్రీరాములనాయక్, మండల ప్రధాన కార్యదర్శి  శివారెడ్డి, తుడుమలదిన్నె కృష్ణారెడ్డి,  దుంపలగట్టు వెంకటరామిరెడ్డి,  రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement