వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లో ఆందోళనకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి, కలమట వెంకటరమణను పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇటు అసెంబ్లీలోనూ అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న ఆందోళనపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. వార్షిక బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్ల గురించి పేర్కొకపోవడాన్ని గర్హిస్తూ, వేతనాలు పెంచాలనే డిమాండ్తో ఏపీ అంగ్వాడీ కార్యకర్తలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. అసెంబ్లీ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడికిపోయాయి.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్టు
Published Tue, Mar 17 2015 11:12 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement