
సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. సీటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా అందజేశారు. అలాగే వెంకటేశ్వరపురంలో ఆయన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.