
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పలువురు నేతలతో కలిసి ఆయన ఆర్థికమంత్రిని బుధవారం కలిశారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ సూచనల సమావేశంలో పాల్గొన్న సుబ్బారెడ్డి ఏపీకి చేయాల్సిన కేటాయింపులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున వినతిపత్రం సమర్పించారు. అందులో ఆయన ఏం డిమాండ్ చేశారంటే..
1. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
2. ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
3. పోలవరాన్ని వెంటనే పూర్తి చేయడం. అందుకు కావాల్సిన నిధుల విడుదల
4. విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్
5. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనున్న ఐఐఐటీ, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఎయిమ్స్‌కు కావాల్సిన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించడం
6. అమరావతికి ఆర్థిక సాయం
7. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఆర్థిక సాయం