
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలి అదృశ్యం
కంచిలి: మండలంలోని పోలేరు ప్రాదేశికం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎంపీటీసీ సభ్యురాలు కప్ప జయమ్మ, ఆమె భర్త జానకీరావు నాలుగు రోజుల నుంచి కనిపించడంలేదు. ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ కొత్త కార్యవర్గం ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఈమెతో పాటుభర్త అదృశ్యం కావడం సర్వత్రా చర్చలకు తెరతీసింది. వీరి ని తెలుగుదేశం పార్టీ నేతలు కిడ్నాప్ చేసి ఉంటారనే పుకార్లు వినిపిస్తున్నాయి. మండలంలో 19 ప్రాదేశికాలు ఉండగా, రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 17 ప్రాదేశికాలకు ఎన్ని క నిర్వహించగా వైఎస్సార్‌సీపీకి 12 స్థానా లు, టీడీపీకి 05, కాంగ్రెస్‌కు 01 స్థానం దక్కాయి. టీడీపీ అభ్యర్థి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలంటే మరో నాలుగురు ఎంపీటీసీల బలం అవసరం. ఇందు లో భాగంగానే వైఎస్సార్‌సీపీకి చెం దిన నలుగురు ఎంపీటీసీ సభ్యుల మద్దతు పొందే ఎత్తుగడలో భాగంగా పోలేరు ఎంపీటీసీ అదృశ్యం జరిగినట్లు తెలుస్తోంది.