అంబాజీపేట (తూర్పుగోదావరి జిల్లా): రైతు సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి నిండు కుదిరి మోహన్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మణిరత్నం, నియోజకవర్గ కోఆర్డినేటర్ చిట్బిబాబులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహారిస్తోందని, రైతు సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా గుర్తించి, రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.