వెంకయ్యకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు | YSRCP to support venkaiah naidu as Vice-precidential candidate | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు

Published Tue, Jul 18 2017 2:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

వెంకయ్యకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు - Sakshi

వెంకయ్యకు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు

- వైఎస్‌ జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌
సాక్షి, అమరావతి:
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం రాత్రి తనకు ఫోన్‌ చేసి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును ప్రతిపాదించిన విషయాన్ని తెలిపి మద్దతు కోరారని జగన్‌ తెలిపారు.

అమిత్‌ షా అభ్యర్థనపై స్పందిస్తూ.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్‌ వంటి ఉన్నత రాజ్యాంగ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని, అలాంటప్పుడే ఏ పార్టీకీ చెందని వ్యక్తులుగా ఆ పదవుల్లో ఉన్న వారు వ్యవహరించే పరిస్థితి నెలకొంటుందనేది తాము మొదటినుంచీ చెబుతూ వస్తున్న విధానమని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువారైన వెంకయ్యనాయుడుకు తెలుగువారిగా కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తోందని అమిత్‌ షాకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement