వైఎస్సార్‌సీపీ వార్డుల్లో అభివృద్ధి ఆపండి
కావలి : వైఎస్సార్‌సీపీ గెలిచిన వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడాని కి వీల్లేదు. అజెండాలోని ప్రతిపాదనల ను కూడా తొలగించాలని కావలి మున్సిపాలిటీ తొలి సమావేశంలో అధి కార పక్షం అధికారులను ఆదేశించింది. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది. అయితే కావలి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను తాము అంగీకరించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు తొలి సమావేశాన్ని బహిష్కరించా రు. వైఎస్సార్‌సీపీ తరఫున కౌన్సిలర్‌గా గెలిచి విప్ ధిక్కరించి టీడీపీ తరఫున వారి మద్దతుతో పోతుగంటి అలేఖ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. విప్ ధిక్కారం పై విచారణ జరుగుతుందని, ఆమె ఎన్నిక చెల్లదన్నారు. ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ విచారణ చేస్తున్నారన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాన్ని ప్రకటించకుండా అలేఖ్యను తాము చైర్మన్‌గా అంగీకరించమని సమావేశా న్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్‌కు సమావేశాన్ని బహిష్కరిస్తున్న కౌన్సిల ర్లు నిరసన పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఏక పక్షంగా అధికార పార్టీ కౌన్సిలర్లతో సమావేశాన్ని కొనసాగిం చారు. పలు వార్డుల్లో తాగునీటి బోర్లు, అభివృద్ధి పనుల నిర్వహణకు మున్సిప ల్ అధికారులు అజెండాను ప్రకటించా రు. దీంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో బోర్లు వేయడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తాము వ్యతిరేకమని అధికార పక్షం కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులకు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ కలుగుజేసుకుని మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి పైపులైన్లు లేని ప్రాంతాల్లో బోర్లు వేయాలని అజెండాలో పెట్టామన్నారు. 16వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అక్కడ గిరిజన కాలనీలు ఉన్నాయన్నారు. ఈ ప్రతిపాదనను ఎన్నికల ముందే తయారు చేశామన్నారు.
దీంతో వైస్ చైర్మన్, ఇతర టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో గిరిజనులే కాదు.. ఎంతటి నిరు పేదలు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలను చేసేందుకు తీర్మానించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 16వ వార్డు ప్రజలు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ను గెలిపించారని, ఆ వార్డులో ఎటువంటి అభివృద్ధి చేయడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని అలేఖ్య, వైస్ చైర్మన్, టీడీపీ కౌన్సిలర్లు తేల్చి చెప్పారు. అలేఖ్య మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించడాన్ని తప్పు బట్టారు. పట్టణంలోని 5,11,16, 23,30,38,46 వార్డుల్లో తాగునీటి సమస్యపై బోర్లు వేయడంతో పాటు అజెండాలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమోదించలేదు.
కావలి ఉత్తర శివారు ప్రాంతంలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అక్కడి నుంచి తరలించాలని పలువురు టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపాదనలు చేశారు. తాగునీటి సమస్యను అధిగమించాలంటే రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తే సరిపోదని, సంగం బ్యారేజీ నుంచి పైపులైన్లు వేస్తే ఆ సమస్య తీరుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పారిశుధ్య మెరుగుపరిచే విషయంలో నగర దీపికలను 40 మంది నియమించే ప్రతిపాదనల అంశాన్ని కౌన్సిలర్లు తిరస్కరించారు.