కుప్పం: కుప్పం నియోజకవర్గంలో కార్మికులు అధికంగా ఉన్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రవళి అన్నారు. కుప్పంలో శుక్రవారం కార్మిక నాయుకుడు రంగయ్యు ఆధ్వర్యంలో ఘనంగా మేడే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాదీవుహల్‌లో జరిగిన కార్మికుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. కార్మిక నాయకుడు రంగయ్య తెలిపిన కార్మికు డివూండ్లు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తావున్నారు. సంస్థల యూజవూన్యం కార్మికులకు 8 గంటల పనిని విధిగా అమలు చేయూలని ఆయున డివూండ్ చేశారు.
నియోజకవర్గంలో రాతి కార్మికులు అధికంగా ఉన్నారని, వీరికి సహాయు సహకారాలు అందించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆయున స్పష్టం చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీవో 12ను రద్దు చేయూలని డివూండ్ చేశారు. కుప్పం ప్రాంతంలో ఉపాధి పనులు లేక బెంగళూరు పట్టణాలకు వలస వెళుతున్నారని అన్నారు. ఆటో నడుపుకుంటూ పేదవారు జీవనం సాగిస్తుంటే, జీవో 12ను అమలు చేసి వారి జీవనోపాధికి ఆటంకం కలిగించడం తగదన్నారు. ఎనిమిదవ తరగతి పూర్తరుుతేనే డ్రైవింగ్ లెసైన్స్‌లు ఇవ్వాలనే నిబంధనలను సవరించాలని ఆయున తెలిపారు.
అంతేకాకుండా కార్మికులకు ఉచిత బీవూ సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు వుంజూరు చేయూలని కోరారు. కుప్పం ప్రాంతంలోని కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా తనను కలిస్తే అండగా ఉంటానని ఆయన తెలిపారు. అనంతరం కార్మిక నాయుకులు రంగయ్యు వూట్లాడుతూ, 30 ఏళ్లుగా కార్మికుల కోసం పోరాటం సాగిస్తున్నానని తెలిపారు. సవుస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు సహాయు సహకారాలు అందించాలని ఆయున కోరారు. ఈ కార్యక్రవుంలో వైఎస్సార్ సీపీ కుప్పం వుండల కన్వీనర్ వెంకటేష్‌బాబు, ఎంపీపీ సాంబశివం, జెడ్పీటీసీ రాజ్‌కువూర్, సర్పంచ్ వెంకటేష్, వైస్ సర్పంచ్ సుధీర్, సత్యేంద్రశేఖర్, గోపినాథ్, రావుకృష్ణ, ఏడీఎస్ శరవణ, రవి, నాను, ఎంఆర్ సురేష్ పాల్గొన్నారు.
కార్మికులకు అండగా ఉంటా
Published Sat, May 2 2015 4:19 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement