
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.త్రయోదశి ఉ.9.56 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం కృత్తిక పూర్తి (24 గంటలు) వర్జ్యం సా.5.31 నుంచి 7.12 వరకు, దుర్ముహూర్తం ఉ.8.33 నుంచి 9.17 వరకు, తదుపరి రా.10.33 నుంచి 11.25 వరకు అమృతఘడియలు... రా.3.40 నుంచి 5.44 వరకు.
సూర్యోదయం : 6.23
సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు.. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. స్థిరాస్తి వృద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం.
కర్కాటకం: నూతన విద్యావకాశాలు. పనులు చకచకా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.
సింహం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు.
కన్య: కొత్తగా రుణయత్నాలు. బంధువర్గంతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యతిరేక పరిస్థితులు.
తుల: ప్రయత్నాలలో ఆటంకాలు. కొన్ని పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో విభేదాలు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: ఊహించని ఆహ్వానాలు. చిన్ననాటì మిత్రులను కలుసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కొంత తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కుంభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక వివాదం నుంచి బయటపడతారు. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment