రైతు కున్సోతు బాలు మృత దేహం వద్ద నివాళులర్పిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్
ఇల్లెందు : ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కళ్లు లేవు. రైతు ఆత్మహత్యలను చూడట్లేదు, వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు’’ అని, కాంగ్రెస్ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ విమర్శించారు. ఇల్లెందు మండలం చల్ల సముద్రం పంచాయతీ సేవ్యాతండాలో (ఆత్మహత్య చేసుకున్న) రైతు కున్సోతు బాలు మృత దే హాన్ని గురువారం సందర్శించి నివాళులర్పించా రు. కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం, కాం గ్రెస్ పట్టణ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమ న్నారంటే...
‘‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. పంట నష్ట పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? గ్రామాల్లోని ఈ దయనీయ పరిస్థితిని సీఎం దృష్టికి తెచ్చి, బాధిత రైతులను ఆదుకునేలా చర్యలు శ్రద్ధ చూపకపోవడం దారుణం. బాలు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అతడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. పిల్లలకు ఉచిత విద్యను అందించాలి’’.
‘ఆంబజార్’ ఆవేదన
ఇల్లెందులోని ఆంబజార్‌లో బలరాం నాయక్ పర్యటించారు. ప్రధాన రోడ్డు మధ్య నుంచి మిషన్ భగీరథ పైపులైన్ తవ్వకాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, ఆ మట్టంతా తమ దుకాణాల్లో పడు తోందని అక్కడి వ్యాపారులు బలరాం నాయక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలతో నెల రోజుల నుంచి తమ దుకాణాలు నడవటం లేదని, రోడ్డు వెడల్పు పేరుతో ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై కలెక్టర్‌తో మా ట్లాడతానని బలరాం నాయక్ చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్‌కె.జానీ, పోషం వెంకటేశ్వర్లు, నాయకులు సి హెచ్.వెంకటేశ్వర్లు, బి.దళ్‌సింగ్ నాయక్, బి.హరిప్రి య, మంజ్యా శ్రీను నాయక్, సత్యవతి, మిల్ట్రీ ర వి, దాస్యం ప్రమోద్‌కుమార్, పులి సైదులు, జీవీ భద్ర ం, సుధీర్ తోత్లా, నంద కిషోర్, కటకం దయాకర్, ధన్‌రాజ్, నవీన్, రుద్ర రామస్వామి, బండ్ల శ్రీ ను, బండ్ల రజని, తోట లలిత శారద, అక్తర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment