
బాయ్ ఫ్రెండ్ అభినయ్ శుక్లాతో హిందీ సీరియల్ నటి రుబీనా
సాక్షి, ముంబై : ప్రముఖ హిందీ సీరియల్ నటి రుబీనా దిలాయక్, తన బాయ్ ఫ్రెండ్ అభినయ్ శుక్లాల పెళ్లిపై వస్తున్న పుకార్లకు బ్రేక్ పడింది. వారిరువురు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్ధారించారు. ‘అవును మేం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఇతరుల వదంతులకు శాశ్వతంగా స్వస్తిపలకడానికి. జూన్‌లోనే మేం ఒక్కటవుతున్నాం... మమ్మల్ని ఆదరించి, దీవించిన మీ అందరికి ధన్యవాదాల’ని పోస్ట్ చేశారామె.
‘ మనిషి గొప్పగా అనుభూతి చెందే వాటిలో ప్రేమ ఓ దృఢమైన అనుబంధం.. అభినవ్ ప్రేమలో మునిగిపోయా. తనతో జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. అతను నా లోపాలను సరిచేయడమే కాదు..నా ఆనందాలకు కారణమయ్యాడు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రుబీనా ‘శక్తి అస్తిత్వా కె ఇషాస్ కి’ సీరియల్ ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితం. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే రుబీనా తన వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ, అభినవ్‌తో తనకున్న అనుబంధాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment