
శ్రీమంతులున్న పెద్దదేశాల్లో భారత్‌ది 4వ స్థానం
న్యూయార్క్: అధిక సంపన్న కుటుంబాలు (ఆల్ట్రా-హై-నెట్-వర్త్ హౌస్‌హోల్డ్స్-యూహెచ్‌ఎన్‌డబ్ల్యూ) ఉన్న 4వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. బోస్టన్‌కు చెందిన కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘గ్లోబల్ వెల్త్ 2015: విన్నింగ్ ద గ్రోత్ గేమ్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. నివేదిక ప్రకారం.. ఆర్థిక వృద్ధి కారణంగా చైనా, భారత్‌లో సంపద పెరుగుతోంది. గతేడాది అధిక సంపన్న కుటుంబాలను కలిగి దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో (5,201) ఉంది.
దీని తర్వాతి స్థానాల్లో చైనా (1,037), యూకే (1,019), భారత్ (928), జర్మనీ (679) ఉన్నాయి. భారత్ లో సంపన్న కుటుంబాల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. 2013లో 284గా ఉన్న సంపన్న కుటుంబాల సంఖ్య గతేడాది 928కి చేరింది. గతేడాది అంతర్జాతీయ ప్రైవేట్ ఫైనాన్షియల్ వెల్త్ 12 శాతం వృద్ధితో 164 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది 6 శాతం వార్షిక వృద్ధిరేటుతో 2019 నాటికి 222 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.