షేర్లంటే మాకెంతో ఇష్టం! | 84% retail investors prefer equities: Survey | Sakshi
Sakshi News home page

షేర్లంటే మాకెంతో ఇష్టం!

Published Thu, Jul 20 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

షేర్లంటే మాకెంతో ఇష్టం!

షేర్లంటే మాకెంతో ఇష్టం!

రిటైల్‌ ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మొగ్గు
ఆ తర్వాతే మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు చూపు
కరెక్షన్‌ కోసం చూస్తున్న 65 శాతం మంది
డెరివేటివ్స్, డే ట్రేడింగ్‌లో రిస్క్‌ ఎక్కువ
జియోజిత్‌ సర్వేలో ఇన్వెస్టర్ల వెల్లడి  


ముంబై: రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తొలి చాయిస్‌ షేర్లే. ఇతర పెట్టుబడి సాధనాల కంటే షేర్లకే వారు తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ  జియోజిత్‌ సెక్యూరిటీస్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మిగులు నగదు ఉన్నప్పుడే తాము స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటామని ఎక్కువమంది స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అవగాహన కోసం సెబీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితాలివ్వటం మొదలెట్టాయని, దలాల్‌ స్ట్రీట్‌ను ఇవి చక్కని పనితీరుగల మార్కెట్‌గా మార్చాయని సర్వే ప్రశంసించింది. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఈ ఏడాది 18 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. సెన్సెక్స్‌ ఇటీవల 30,000 మార్కును దాటడంతో కోచికి చెందిన జియోజిత్‌ సెక్యూరిటీస్‌ ఆన్‌లైన్‌ వేదికగా 3 లక్షల మంది ఇన్వెస్టర్లతో సర్వే నిర్వహించింది.

కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది తమ మిగులు ఆదాయంలో 20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నిజానికి దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా లాభాలను ఆర్జించినట్టు చూపే గణాంకాలు అందుబాటులో లేవు. ఎందుకంటే వీరు మార్కెట్ల బూమ్‌లో ఉన్నపుడు ప్రవేశించడం, కరెక్షన్‌కు గురవగానే నష్టాలతో బయటకు వెళ్లిపోవడం జరుగుతుంటుంది.  

సర్వేలో వెల్లడైన అంశాలివీ...
నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాం: 83.45 శాతం
మిగులు నిధులున్నపుడే స్టాక్‌ మార్కెట్లో పెడతాం: 59.25 శాతం
నెలనెలా ఇన్వెస్ట్‌ చేస్తాం: 20 శాతం
కొంత మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాం: 57.21 శాతం
నేరుగా ఈక్విటీల్లో పెడితేనే మంచి రాబడులొస్తాయి: 65.5 శాతం
ఈక్విటీల్లో రిస్కుంటుంది కనక మ్యూచువల్‌ ఫండ్లే నయం: 24 శాతం
డెరివేటివ్స్‌ అంటే అధిక రిస్కుంటుంది. కాబట్టి దాన్లో పెట్టం: 20 శాతం
కాస్తంత రిస్క్‌ ఉన్నా డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాం: 4.76 శాతం
డే ట్రేడింగ్‌ అంటే చాలా రిస్కుంటుంది. కాబట్టి మేం దూరంగా ఉంటాం: 62%
లాభం వెనక నష్టం కూడా ఉంటుంది. అయినా డే ట్రేడింగ్‌ చేస్తాం: 14.55%
మార్కెట్లలో కరెక్షన్‌ వస్తే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తాం. వేచి చూస్తున్నాం: 65%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement