పేటీఎం విక్రయదారులకు ఆదిత్య బిర్లా రుణాలు | Aditya Birla loans to retailers Paytm | Sakshi
Sakshi News home page

పేటీఎం విక్రయదారులకు ఆదిత్య బిర్లా రుణాలు

Published Sat, Jul 25 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

పేటీఎం విక్రయదారులకు ఆదిత్య బిర్లా రుణాలు

పేటీఎం విక్రయదారులకు ఆదిత్య బిర్లా రుణాలు

హైదరాబాద్ : భారతదేశపు అతి పెద్ద మొబైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన పేటిఎం, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌కు చంఎదిన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. పీటీఎం ప్లాట్‌ఫామ్‌పై 50వేలకు పైగా చిన్న విక్రయదారులకు ఈ ఒప్పందం వల్ల సులభంగా రుణాలు లభిస్తాయని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చిన్న విక్రయదారులకు స్వల్పకాలిక, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ద్వారా పొందవచ్చని పేటిఎం వైస్ ప్రెసిడెంట్(ఎస్‌ఎంఈ బిజినెస్) రేణుసట్టి పేర్కొన్నారు.

భారత్‌లో లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రుణాలు అంత సులభంగా లభించవని, ఈ లోటును పేటీఎం ద్వారా భర్తీ చేస్తున్నామని ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సీఈఓ రాకేశ్ సింగ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement