Rakesh Singh
-
ఆహా.. యూపీలో ఏమి సహనం?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎవరైనా అంటే.. అన్న వారిని పట్టుకొని చావ చితక్కొడుతారు అక్కడి అల్లరి మూకలు. బుధవారం నాడు ఒక్క రోజులో జరిగిన నాలుగు దైర్జన్య, హింసాత్మక సంఘటనలు అక్కడి ‘సహనానికి’ మచ్చుతునకలు. లక్నోలో బుధవారం పట్టపగలు రోడ్డు పక్కన డ్రైఫ్రూడ్స్ అమ్ముతున్న ఇద్దరు కశ్మీరీలను పట్టుకొని కాషాయ దుస్తులు ధరించిన యువకులు చితకబాదారు. పైగా వారే వీరోచితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. (యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి) అదే రోజు ముజాఫర్‌నగర్‌లో విద్యా, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ టీవీ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని వెతికి పట్టుకొని బీజేపీ కార్యకర్తలు చితక బాదారు. టెర్రరిస్టుగా ముద్ర వేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో సర్కులేట్ అవుతోంది. అదే రోజు సంత్ కబీర్ నగర్ జిల్లాలో బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రజల ముందే బహిరంగంగా కొట్టుకున్నారు. వారిద్దరు ఓ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. శంకస్థాపన పలకం మీద తన పేరు ఎందుకు లేదంటూ బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ప్రశ్నించారు. పేర్లు పెట్టదల్చుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాఘెల్ సమాధానం చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పట్టలేని ఆవేశానికి గురైన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ఒక్కసారిగా తన కాలికున్న బూటును లాగి దాంతో బాఘెల్ నెత్తిపై ఠపీ ఠపీమంటూ కొట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనకు ప్రతీకారంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి ఎమ్మెల్యే అనుచరులు జొరబడి అక్కడున్న ఎంపీ శరద్ త్రిపాఠిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. (ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ) అదే రోజు మీరట్‌లో గుడిశెవాసులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తమ గుడిసెలను తగులబెట్టారంటూ గుడిశెవాసులు రోడ్డెక్కి ప్రైవేటు వాహనాలను, బస్సులను దగ్ధం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి ‘సహనం’ రాజ్యమేలుతుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ‘నయే భారత్ నయా ఉత్తరప్రదేశ్’ నినాదంతో ఇచ్చిన పూర్తి పేజీ యాడ్ అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురితమైంది. తన ప్రభుత్వం హయాంలో అన్ని నగరాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగయిందని, నేరస్థులను అనుమాత్రం ఉపేక్షించమనే తమ విధానం విజయవంతం అయిందని కూడా ఆ యాడ్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ యాడ్ మధ్య భాగంలో శాంతి భద్రతల పరిస్థితి మెరగయిందన్న శీర్షిక కింద నేరాల పట్ల అణు మాత్రం సహించని విధానాన్ని అమలు చేస్తున్నామని, పోలీసు బృందాల ఎన్కౌంటర్ల వల్ల 69 మంది నేరస్థులు మరణించారని, 7043 మంది అరెస్టయ్యారని, ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పును గమనించి 11,981 మంది నేరస్థులు తమ బెయిళ్లను రద్దు చేసుకొని కోర్టుల ముందు హాజరయ్యారని చెప్పడంతో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవల గురించి, లక్ష మంది పోలీసుల నియామకానికి ప్రక్రియ కొనసాగుతోందని కూడా ఆ యాడ్‌లో పేర్కొన్నారు. బుధవారం జరిగిన నాలుగు, దౌర్జన, హింసాత్మక సంఘటనలకు సబంధించిన వీడియోలు అందుబాబులో ఉన్నా ఒక్క గుడిశెవాసులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి మినహా మిగతా మూడు సంఘటనల్లో పోలీసులు ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అనవసరమైన పబ్లిసిటీ పేరిట లక్షల రూపాయలు తగిలేసే బదులు, శాంతి భద్రతల పరిరక్షణకు కేటాయిస్తే ఎప్పటికైనా ‘సహనం’ వస్తుందేమో! -
యూపీలో ఒక్క రోజులోనే నాలుగు హింసాత్మక సంఘటనలు
-
సిమెంటు ఖర్చు అడుగుకు 150?
► రూ.5000 వసూలు చేస్తున్నారేం? ► రియల్టర్లకు సిమెంటు సంస్థల ప్రశ్న ► బస్తాకు 330–350 ఉంటేనే నిలదొక్కుకుంటాం ► కనీసం 10 శాతం రిటర్నులూ లేవు ► సిమెంటు కంపెనీల ప్రతినిధుల వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణంలో సిమెంటుకయ్యే వ్యయం ఒక చదరపు అడుగుకు రూ.150–175 మాత్రమేనని, కానీ నిర్మాణ సంస్థలు ఫ్లాట్‌కు ఒక చదరపు అడుగుకు రూ.5,000 పైన వసూలు చేస్తున్నాయని సిమెంటు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. నిర్మాణానికి అంత ఖర్చు ఎందుకవుతోందో ఈ సంస్థలు చెప్పాలని వారు ప్రశ్నించారు. ‘‘ఒక చదరపు అడుగుకు 25 కిలోల సిమెంటు కావాలి. బస్తాకు రూ.50 అధికమైనా, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.25 మాత్రమే పెరగాలి కదా?’’ అని ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్ వ్యాఖ్యానించారు. సాగర్ సిమెంట్స్ ఈడీ శ్రీకాంత్ రెడ్డి, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. 2015తో పోలిస్తే తెలంగా ణ, ఏపీలో ఇప్పుడున్న సిమెంటు ధర తక్కువని చెప్పారాయన. అయిదేళ్లుగా సిమెంటు ధరల పెరుగుదల ఏటా 1% మాత్రమేనని, అదే రియల్టీ ధరల పెరుగుదల ఏటా 10% ఉందని తెలిపారు. అమ్ముడుపోకుండా పెద్ద సంఖ్యలో గృహాలు ఉన్నా, ధర మాత్రం తగ్గడం లేదని గుర్తుచేశారు. మార్కెట్ ఆధారంగానే ధర.. ‘‘గతేడాది పెట్ కోక్ ధర టన్నుకు 45 డాలర్లుంటే, ఇప్పుడు 100 డాలర్లు దాటింది. రవాణా వ్యయం బస్తాకు రూ.50 అవుతోంది. సిమెంటుపై 27% పన్నులున్నాయి. మార్కెట్ ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతోంది. పరిశ్రమపైన రూ.50,000 కోట్ల అప్పులున్నాయి. కంపెనీలపై వడ్డీల భారం ఉంది. సిమెంటు ధర పెరగడానికి గల కారణాలను చూడకుండా సిమెంటు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా సిమెంటు ధర రూ.270–330 ఉంది. కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడి మార్కెట్లో ధర రూ.330–350 ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయి’’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సిమెంటుపై తక్కువ పన్నుంటుందని ప్రజలు, కంపెనీలు ఆశించినా, జీఎస్టీలో 28% శ్లాబులో చేర్చి ప్రభుత్వం నిరుత్సాహపరిచిందని అన్నారు. భారంగా ఉత్పత్తి సామర్థ్యం..: దేశంలో 1989కి ముందు 10 సిమెంటు కంపెనీలే ఉండేవి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.9 కోట్ల టన్నులు. ఇప్పుడు కంపెనీల సంఖ్య 70కిపైమాటే. సామర్థ్యం 42 కోట్ల టన్నులకు ఎగసింది. దక్షిణాదిన 50 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 150 మిలియన్ టన్నులు. ప్లాంట్ల వినియోగం దేశవ్యాప్తంగా 70% ఉంటే, దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 60% లోపేనని రవీందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పడిపోయి సామర్థ్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, అధిక తయారీ వ్యయాలు కంపెనీలకు సమస్యగా మారిందని, పెట్టుబడిమీద రాబడి 10%లోపే ఉంటోందని కంపెనీల ప్రతినిధులు వాపోయారు. తెలుగు రాష్ట్రాలు బెటర్.. ‘‘సంయుక్త రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకు 24 లక్షల టన్నుల సిమెంటు అమ్మకాలు నమోదయ్యాయి. 2015–16లో ఇది 12–14 లక్షల టన్నులకు చేరింది. ఏడాదిగా తమిళనాడులో సిమెంటు విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. సిమెంటు వినియోగంలో వచ్చే మూడేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10–18 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’’ అని శ్రీకాంత్ తెలిపారు. తమిళనాడు స్థిరంగా, కర్ణాటకలో 2–5 శాతం వృద్ధి ఉండొచ్చని చెప్పారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు 5–7 శాతం అధికం అవుతాయని అంచనా వేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, వైట్ ట్యాపింగ్ రోడ్లు, అందుబాటు గృహాల నిర్మాణం వేగిరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు తక్కువ ధరకు సిమెంటును సరఫరా చేస్తున్నట్టు గుర్తు చేశారు. -
పేటీఎం విక్రయదారులకు ఆదిత్య బిర్లా రుణాలు
హైదరాబాద్ : భారతదేశపు అతి పెద్ద మొబైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన పేటిఎం, ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌కు చంఎదిన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. పీటీఎం ప్లాట్‌ఫామ్‌పై 50వేలకు పైగా చిన్న విక్రయదారులకు ఈ ఒప్పందం వల్ల సులభంగా రుణాలు లభిస్తాయని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చిన్న విక్రయదారులకు స్వల్పకాలిక, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ద్వారా పొందవచ్చని పేటిఎం వైస్ ప్రెసిడెంట్(ఎస్ఎంఈ బిజినెస్) రేణుసట్టి పేర్కొన్నారు. భారత్‌లో లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రుణాలు అంత సులభంగా లభించవని, ఈ లోటును పేటీఎం ద్వారా భర్తీ చేస్తున్నామని ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సీఈఓ రాకేశ్ సింగ్ వివరించారు. -
సెయిల్ తాత్కాలిక సీఎండీగా స్టీల్ సెక్రటరీ రాకేశ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాత్కాలిక సీఎండీగా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సీఎస్ వర్మ బుధవారం పదవీ విరమణ నేపథ్యంలో రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను చేపట్టినట్లు సెయిల్ గురువారం బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో తెలిపింది. సంస్థ సీఎండీగా కొత్త నియామకం జరిగే వరకూ రాకేశ్ సింగ్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది.