డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్ట్‌పెయిడ్ మిని పేరుతో కొత్త సేవలను లాంచ్ చేసింది. బై నౌ.. పే లేటర్ సర్వీసులకు ఇవి ఎక్స్‌టెన్షన్ అని చెప్పొచ్చు. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ భాగస్వామ్యంతో పేటిఎమ్ ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ప్రస్తుత కరోనా కాలంలో ఎటువంటి వడ్డీ లేకుండా రూ.250 నుంచి రూ.1,000 వరకు స్వల్ప రుణాలను తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను ముప్పై రోజుల్లోపు తిరిగి చెల్లించాలి.
పేటిఎమ్ ఇప్పటికే రూ.60,000 వరకు ఇన్స్టంట్ క్రెడిట్ అందిస్తుంది. ఇప్పుడు నెలవారీ ఖర్చుల కోసం ఈ పోస్ట్‌పెయిడ్ మిని ద్వారా డబ్బులు పొందొచ్చు. తీసుకునే నగదుపై ఎలాంటి ఫీజులు, యాక్టివేషన్ ఛార్జీలు లేవు. కేవలం కన్వీనియన్స్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. ఇకపోతే పేటీఎం ఐపీవోకు సిద్దం అవుతుంది. దీని ద్వారా ఏకంగా రూ.22 వేల కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment